అరియానా గ్లోరి గురించి కుర్రాళ్లకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఆర్జీవీతో ఇంటర్వ్యూ, ‘బిగ్ బాస్’తో బాగానే పాపులారిటీ సంపాదించింది అరియానా.

‘బిగ్ బాస్’ నుంచి వచ్చాక ఆమె కొన్ని సినిమాల్లో తళుక్కున మెరిసింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ వీడియోలు, ఫొటోలతో అలరిస్తోంది అరియానా.

ఇటీవల రోల్ రైడా.. ‘కాకినాడ కాజా’ అల్బమ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసింది.

ఆ వీడియో ప్రమోషన్ కోసం అరియానా.. రోల్ రైడాతో కలిసి స్టెప్పులు వేసింది.

ఈ పాటలో అరియానా ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసింది.

ఈ వీడియో చూసిన ఆమె అభిమానులు.. శుభశ్రీకి బదులు నువ్వు చేసినా బాగుండేదని అంటున్నారు.

అరియానా పోస్ట్ చేసిన వీడియో ఇదే.