EPAPER

Pawan Kalyan: కౌన్ బనేగా కరోడ్ పతి షోలో పవన్ కు సంబంధించిన ప్రశ్న.. అదిరా పవర్ స్టార్ రేంజ్

Pawan Kalyan: కౌన్ బనేగా కరోడ్ పతి షోలో పవన్ కు సంబంధించిన ప్రశ్న.. అదిరా పవర్ స్టార్ రేంజ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు ఒక బ్రాండ్.  సినిమాల్లో అయినా.. రాజకీయాల్లో అయినా ఆయనకంటూ ఒక రికార్డ్ ఉంది.  ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.  సినిమాలు, బ్రాండ్, కోట్లలో వచ్చే పారితోషికం వదిలేసి.. పదేళ్ల క్రితం జనసేన అనే పార్టీని స్థాపించాడు పవన్.


ఎన్నో విమర్శలు, మరెన్నో అవమానాలను ఎదుర్కొంటూ వచ్చాడు. అలా దాదాపు 10 ఏళ్ల తరువాత ఈ ఏడాది పవన్.. ఎన్నికల్లో గెలిచి ఏపీ డిప్యూటీ సీఎం గా పదవిని చేపట్టారు. అది కూడా అలా ఇలా కూడా కాదు.. రికార్డ్ స్థాయిలో గెలిచి చూపించాడు. ఇక ఈ ఎన్నికల తరువాత పవన్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. నేషనల్ వైడ్ గా పవన్ కు మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు.

తాజాగా  బాలీవుడ్ పాపులర్ షోలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రశ్న అడగడం సంచలనంగా మారింది. కౌన్ బనేగా కరోడ్  పతి షో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో తాజాగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రశ్నను అమితాబ్ అడగడం సంచలనంగా మారింది.


” 2024 జూన్ లో ఏపీ డిప్యూటీ సీఎం గా  బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు.. ? ” అని  అమితాబ్ అడిగాడు. ఇక ఈ ప్రశ్నకు సదురు కంటెస్టెంట్ ఆడియన్స్ పోల్ అప్షన్ ఎన్నుకున్నారు. ఇక ఆడియన్స్ ఎక్కువమంది పవన్ కళ్యాణ్ అని చెప్పగా.. కంటెస్టెంట్ ఆ ఆన్సర్ ను లాక్ చేశారు. ఈ ప్రశ్న ఖరీదు.. రూ. 1.60 లక్షలు.  ఇక ఆడియన్స్ చెప్పిన సమాధానాన్ని కంటెస్టెంట్ ఓకే చేయడంతో పవన్ కళ్యాణ్ అని చెప్పి కంటెస్టెంట్ రూ.1.60 లక్షలు సంపాదించాడు.

ఇక ఈ ప్రశ్నకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోను పవన్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ అదిరా పవన్ కళ్యాణ్ రేంజ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక పవన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG.. ఈ మూడు సినిమాలపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమాలతో పవన్ ఎలాంటి విజయాలను అందుకుంటాడు అనేది చూడాలి.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×