EPAPER

27 countries Travel Without Flight: ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఇద్దరు మిత్రలు.. విమానం ఎక్కకుండా 27 దేశాల పర్యటన!

27 countries Travel Without Flight: ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఇద్దరు మిత్రలు.. విమానం ఎక్కకుండా 27 దేశాల పర్యటన!

27 countries Travel Without Flight| చాలామందికి ఈ ప్రపంచంలోని అన్ని దేశాలు పర్యటించాలని కోరిక ఉంటుంది. కానీ ఆశ కొంతమందికి మాత్రమే తీరుతుంది. ఆ కొద్ది మంది జాబితాలో ఓ ఇద్దరు మిత్రులు చేరారు. ఇద్దరు యువకులు టొమాసో ఫరినామ్ (25), ఆడ్రియాన్ లఫూంటె (27) తమని తాము ‘సస్టెయినెబుల్ ఎక్స్‌ప్లోరర్స్’ అని చెప్పుకుంటూ భూ గ్రహంపై పర్యావరణ రక్షణ కోసం అవగాహన కల్పించడానికి ప్రపంచ దేశాల పర్యటనకు బయలు దేరారు. వీరిలో టొమాసో ఇటలీ చెందిన వాడు కాగా.. ఆడ్రియాన్ స్పెయిన్ దేశస్తుడు.


అయితే వీరిద్దరూ 15 నెలల క్రితం తమ ప్రయాణం మొదలు పెట్టి ఒక్కసారి కూడా విమానం ఎక్కకుండా ఇప్పటివరకు 27 దేశాలు చుట్టేశారు. భూగోళ పర్యటనలో ప్రకృతిని ఆస్వాదించాలంటే విమాన ప్రయాణం కంటే సముద్ర మార్గంలో ప్రయాణించడం మంచి అనుభూతినిస్తుందని.. పైగా విమానంలో ప్రయాణిస్తే.. ఒక్కో ప్యాసింజర్ తలసరి 90 కేజీ కార్బన్ వాయువు పర్యావరణంలో విడుదల అవుతుందని చెప్పారు.

వీరి ప్రయాణంలో చాలా వింతలు విశేషాలున్నాయి. ఒకసారి అయితే ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఒక బోట్ కెప్టెన్ వారికి ఫ్రీగా మరో దేశం తీసుకెళ్లాడట. వీరిద్దరూ సముద్ర మార్గంలో ప్రయాణం చేయడం ద్వారా పర్యావరణాన్ని కాలుష్య నుంచి కాపాడడమే కాకుండా తక్కువ ఖర్చుతో సుదూరంగా ప్రయాణిస్తున్నారు. 27 దేశాలు ప్రయాణించడానికి వీరిద్దరూ తలసరి 7700 డాలర్లు మాత్రమే ఖర్చు చేశారట.


2023 సంవత్సరమంతా ఈ స్నేహితుల జోడీ ప్రపంచ టూర్ లోనే గడిపేసింది. ఈ భూగోళ పర్యటకుల జోడీ నిరంతరం తమ ప్రయాణం గురించి ఇన్‌స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తూ ఉంటుంది. 2023 వేసవిలో ఈ ఇద్దరూ తమ గ్లోబల్ అడ్వెంచర్ ని మొదలుపెట్టారు. తమ ప్రయాణానికి వీరు ‘ప్రాజెక్ట్ కూన్’ అని పేరు పెట్టారు. భూగోళంలో మానవులు జీవవైవిధ్యమైన జంతువులు, చెట్లు, సముద్ర జలాలతో కలిసిమెలిసి జీవించగలమని సందేశమిస్తూ వీరు ముందుకు సాగుతున్నారు.

Also Read: కదులుతున్న రైలు నుంచి అడవిలో పడ్డ ప్రయాణికుడు.. తిండి నీరు లేక ఏం చేశాడంటే..

అయితే వీరు ప్రయాణానికి ముందు తమ కుటుంబానికి తమ కోరిక గురించి చెప్పినప్పుడు వారంతా ఆందోళన చెందారని తెలిపారు. సముద్ర మార్గంలో సుదూరంగా ప్రయాణించడం ప్రమాదాలతో కూడుకున్నదని కావడంతో వారంతా తమని సమర్థించలేదని వెల్లడించారు. అయినా తాము అనుకున్నది సాధించే యువ రక్తం కావడంతో వీరివురూ తమ సుదీర్ఘ ప్రయాణంలో ముందుగా అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఒక పెద్ద షిప్పులో ప్రయాణించారు. ఆ తరువాత పసిఫిక్ సముద్రం దాటడానికి కేవలం ఒక చిన్న మోనోహాల్ బోట్‌ని ఉపయోగించారట.

తొలి 39 రోజుల్లో అట్లాటిక్ మహాసముద్రం నుంచి బయలుదేరి సౌత్ అమెరికా చేరుకున్నారు. ఆ తరువాత గల్ఫ్ఆఫ్ పనామాకు ప్రయాణించి అక్కడ వాతావరణం తుఫాను కారణంగా ప్రమాదకరంగా ఉండడంతో 10 రోజులు ఆగిపోయామని ఫరినామ్ తెలిపాడు. ప్రస్తుతం వీరిద్దరూ పసిఫిక్ మహాసముద్రం దాటి ఆస్ట్రేలియాకు వెళుతున్నారని తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపారు. దారి మధ్యలో ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు అందమైన దీవుల్లో బస చేస్తున్నామని చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు.

Related News

Viral Video: డాక్టర్‌పై చెప్పులతో దాడి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Amazon Delivery After 2 Years: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Big Stories

×