EPAPER

Mahesh babu-Rajamouli: 18వ శతాబ్దం నాటి పీరియాడిక్ కథతో మహేష్-రాజమౌళి వస్తున్నారు

Mahesh babu-Rajamouli: 18వ శతాబ్దం నాటి పీరియాడిక్ కథతో మహేష్-రాజమౌళి వస్తున్నారు

Mahesh babu-Rajamouli coming with 18th century story: మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే సినిమా అప్ డేట్స్ గురించి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని విజయేంద్రప్రసాద్ తెలిపారు. మహేష్ పుట్టినరోజున ఏదో ఒక అప్ డేట్ వస్తుందని ఎదరుచూశారు ఫ్యాన్స్. వారిని తీవ్ర నిరుత్సాహానికి గురిచేశారు మూవీ యూనిట్. ఈ సెప్టెంబర్ లోనే సినిమా షూటింగ్ మొదలు పెడతారని అన్నారు. దానిపైనా క్లారిటీ రాలేదు. రాజమౌళి సినిమా అంటేనే స్టార్టింగ్ ట్రబుల్. ఆలస్యంగా మొదలు పెడతారు..చిత్రీకరణ కూడా అంతే ఆలస్యం అవుతుంది. దీనితో ఒక్కో హీరో ఆయనతో కలిసి ట్రావెల్ చేయాలంటే కనీసం నాలుగయిదేళ్లు పడుతుంది.


మురారి రీరిలీజ్

మొన్న సంక్రాంతికి గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు నెక్ట్స్ మూవీ కోసం మరో ఐదేళ్లు ఎదురుచూడాల్సిందేనని అభిమానులు ఆందోళన పడుతున్నారు. అందుకే ప్రతి సంవత్సరం మహేష్ బాబు హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసుకుంటూ తృప్తిపడుతున్నారు. రీసెంట్ గా ఇరవై ఏళ్ల క్రితం రిలీజయిన మురారి చిత్రం రీరిలీజ్ లోనూ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. మహేష్ బాబుకు లేడీస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అందుకే ఆయన సినిమాలన్నీ మాస్ యాంగిల్ లో ఉన్నా ఫ్యామిలీ సెంటిమెంట్ తప్పకుండా ఉంటుంది. మహేష్ కూడా మొదట్లో ప్రయోగాత్మక చిత్రాలు చేసినా ఆ ప్రయోగం బెడిసికొట్టడంతో కొంత కాలం నుంచి అలాంటి సినిమాల జోలికి వెళ్లడం లేదు. టక్కరి దొంగ, వన్ నేనొక్కడినే, స్పైడర్ మూవీలన్నీ ప్రయోగాత్మక సినిమాలే. అందుకే ప్రేక్షకాభిమానులు తన సినిమా నుంచి ఏమేం అంశాలు కోరుకుంటున్నారో తాను కూడా అవే కమర్షియల్ అంశాలు ఉండేలా సేఫ్ జోన్ లో నటిస్తూ వస్తున్నారు.


డబుల్ హ్యాట్రిక్ విజయాలు

గుంటూరు కారం మూవీతో డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. వరుసగా ఆరు సినిమాలు విజయం సాధించి మంచి స్వింగ్ మీద ఉన్నారు మహేష్ బాబు. రాజమౌళి కూడా ఒకసినిమాని మించి మరొకటి హిట్ చేసుకుంటూ తన రేంజ్ ని ఆస్కార్ లెవెల్ కి తీసుకుపోయారు. ఆర్ఆర్ఆర్ మూవీ సినిమా తర్వాత అనేక హాలీవుడ్ సంస్థలు రాజమౌళికి ఓపెన్ ఆఫర్ల ఇచ్చాయి. తాము వేల కోట్లు ఖర్చుపెడతామని..తమ సినిమాలకు డైరెక్షన్ చేయమని రాజమౌళిపై ఒత్తిడి పెరిగింది. అయినా రాజమౌళి కేవలం భారతీయ సినిమాలకే ప్రధాన్యతనిస్తున్నారు. తన సినిమా పూర్తయ్యేదాకా వేరే ఏ సినిమాకూ కమిట్ అవ్వరు రాజమౌళి. ఎందుకంటే ప్రతి సన్నివేశం ఎంతో చక్కగా చిత్రీకరిస్తారు. అందుకే ఇండస్ట్రీలో ఆయనను జక్కన్న అంటారు. ఒక్కో సినిమాను శిల్పం మలిచినట్లుగా సమయం ఎక్కువైనా తగ్గేది లేదంటూ తన పని తాను చేసుకుని వెళుతుంటారు. అయితే మహేష్ బాబు సినిమాను 2025 జనవరిలో మొదలు పెడతారని సమాచారం.

18వ శతాబ్దం నాటి కథ

ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ అడవుల నేపథ్యంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే పాత్రలో మహేష్ కనిపించనున్నారని కథను కొద్దిగా లీక్ చేశారు. అయితే మహేష్ బాబుతో రూపొందిస్తున్న ఈ మూవీ 18వ శతాబ్దానికి చెందిన పీరియాడిక్ కథాంశం అని తెలుస్తోంది. అప్పటి కాలానికి తీసికెళ్లి రాజమౌళి ప్రేక్షకులకు మరో థ్రిల్ కలిగించనున్నారు. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు లను కలిపి ఆర్ఆర్ఆర్ గా రూపొందిస్తే జనం ఆదరించారు. అందుకే రాజమౌళి విజన్ వేరేలా ఉంటుంది. ఇప్పటిదాకా ఫెయిల్యూర్ అనేది లేని రాజమౌళి వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న మహేష్ బాబును ఎలా చూపిస్తారో అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×