నల్ల మిరియాలు ప్రతి ఒక్కరి వంటింట్లోనూ ఉంటాయి. ఇవి అనేక  ఔషధ గుణాలతో నిండి ఉంటాయి.

వర్షాకాలంలో వీటితో తయారు చేసిన బ్లాక్ పెప్పర్ టీ తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

బ్లాక్ పెప్పర్ టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

వర్షాకాలంలో జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులతో  ఇది ప్రభావవంతంగా పోరాడుతుంది.

ఇది మంచి సువాసన, రుచిని కలిగి ఉంటుంది.

మిరియాల్లో ఉండే పైపెరిన్ అనే మూలకం జీర్ణక్రియను ఉత్తేజపరిచే శక్తిని కలిగి ఉంటుంది.

 మిరియాల టీ కడుపులో గ్యాస్, అజీర్ణాన్ని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది.

తరుచుగా బ్లాక్ పెప్పర్ టీ తాగడం వల్ల జీర్ణ  సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

నల్ల మిరియాల టీ విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది

ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది