EPAPER

CM Revanth Reddy: ట్రాన్స్‌జెండర్లకు సీఎం రేవంత్ రెడ్డి గోల్డెన్ ఆఫర్.. ‘వాలంటీర్లుగా నియమించుకోవాలి’

CM Revanth Reddy: ట్రాన్స్‌జెండర్లకు సీఎం రేవంత్ రెడ్డి గోల్డెన్ ఆఫర్.. ‘వాలంటీర్లుగా నియమించుకోవాలి’

Transgenders as Volunteers: ట్రాన్స్‌జెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయ కోణంలో నిర్ణయం తీసుకున్నారు. నిర్భాగ్యులుగా, సమాజంలో గుర్తింపు లేకుండా ఎలాంటి ఆదరణకు నోచుకోలేకపోతున్న ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్లుగా నియమించుకునే అవకాశాలను పరిశీలించుకోవాలని ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచనలు చేశారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను నియంత్రించడంలో ట్రాన్స్‌జెండర్ల సహాయం తీసుకోవాలని, వారిని ట్రాఫిక్ వాలంటీర్లుగా తీసుకోవాలని పేర్కొన్నారు. హోంగార్డుల తరహాలో వారికి శిక్షణ ఇచ్చి వారి సహాయం తీసుకోవాలని, వారికి ఉపాధి కల్పించి ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించే పరిస్థితులు కల్పించాలని వివరించారు. వేతనం ఇచ్చి వారి జీవితాలను మెరుగుపరచాలని పేర్కొన్నారు. ఇందుకు ఆసక్తి కనబరిచే ట్రాన్స్‌జెండర్ల జాబితాను రూపొందించాలని ఆదేశించారు.


జీహెచ్ఎంసీ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టెండర్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో జీహెచ్ఎంసీ రోడ్లు, క్లీనింగ్, ఫుట్‌పాత్‌ల అభివృద్ధికి సంబంధించిన టెండర్లు గడువులోగా పూర్తి చేయని కాంట్రాక్టర్లపై 15 రోజుల్లోగా కచ్చితమైన రిపోర్ట్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఒక వేళ రిపోర్టుల్లో తప్పుడు వివరాలు పొందుపరిస్తే సదరు అధికారులపైనా యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేశారు. గడువులోగా తప్పనిసరిగా టెండర్లకు సంబంధించిన పనులను కాంట్రాక్టర్లు పూర్తి చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇదే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ట్రాన్స్‌జెండర్లపై మానవీయ కోణంలో ఆలోచనలు చేశారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నది. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర ట్రాన్స్‌జెండర్ల సమస్యలను కూడా చూస్తున్నాం. ట్రాన్స్‌జెండర్లకు సొంత కుటుంబం నుంచే ఆదరణ కరువవుతుంది. ఇంటి నుంచి గెంటేస్తే.. బయట స్వతంత్రంగా జీవించేందుకు ఆర్థిక మార్గాలు వారికి ఉండవు. ఏ రంగంలోనూ ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి లభించడం లేదు. ఏ కంపెనీ కూడా వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురై వారు చివరికి బిక్షాటన చేయాల్సి వస్తున్నది. కొందరు వ్యభిచారంలోకి దిగిపోతున్నారు. చాలా మంది ట్రాన్స్‌జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలనే బలమైన కాంక్ష ఉన్నప్పటికీ సొసైటీలో వారికి అందుమైన మార్గాలు లేవు. దీంతో కొందరు నెగెటివ్ షేడ్‌లోకి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి వారి జీవితాలను మార్చే ఒక సువర్ణావకాశాన్ని ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.


Also Read: Pithapuram: చంద్రబాబు అబద్దాన్ని కూడా అమ్మేయగలరు.. ఏలూరు పర్యటనలో జగన్ గరం గరం

ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగించుకోవాలని, వారికి హోంగార్డుల తరహాలో తర్ఫీదు ఇచ్చి ట్రాఫిక్ వాలంటీర్లుగా వారి సేవలను వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఆలోచనలను పరిశీలించాలని సూచించారు. ఇలా ట్రాన్స్‌జెండర్లకు సమాజంలో ఆత్మగౌరవాన్ని ప్రసాదించే.. వారి జీవితాల్లో వెలుగులు నింపే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. ట్రాన్స్‌జెండర్లకు దయనీయ పరిస్థితులు మనం దేశవ్యాప్తంగా చూడొచ్చు. కానీ, వారికి ఉపాధి కల్పించి.. వారి జీవితాలూ ఆత్మగౌరవంతో ఉండేలా నిర్ణయం తీసుకోవడం బహుశా దేశంలోనే తెలంగాణ మొదటిది అనే చర్చ జరుగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డే ఈ అద్భుత ఆలోచనలను వెల్లడించడం ప్రశంసనీయమని చెబుతున్నారు. ఇది నేటి కాలపు సామాజిక, సాంఘిక సంస్కరణ అని అభివర్ణిస్తున్నారు.

Related News

Kavitha: కవిత మౌనమేల.. దూరం పెట్టారా.. ఉంచారా..?

Telangana Graduate MLC Election: ఎమ్మెల్సీ‌ ఎన్నిక బీజేపీని జీవన్‌రెడ్డి ఢీ కొడతాడా?

Bhadradri Temple chief priest: భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు.. లైంగిక వేధింపులు.. లాగితే విస్తుపోయే నిజాలు!

Hyderabad Metro: ప్రయాణికులు జాగ్రత్త.. మెట్రో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌..క్లిక్ చేస్తే అంతే!

Special Trains: సంక్రాంతి.. కోచ్‌ల పెంపు, ఆపై ప్రత్యేకంగా రైళ్లు!

Hydra: హైడ్రా భయం.. అటువైపు చూడని కస్టమర్లు.. టార్గెట్ లేక్ వ్యూ భవనాలా?

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Big Stories

×