EPAPER

Samsung Galaxy M05: వెరీ చీప్.. రూ.7,999 లకే కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్, సామాన్యులకు పండగే పండగ!

Samsung Galaxy M05: వెరీ చీప్.. రూ.7,999 లకే కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్, సామాన్యులకు పండగే పండగ!

Samsung Galaxy M05 Price: టెక్ బ్రాండ్ Samsung సామాన్యులను దృష్టిలో పెట్టుకుని ఫోన్లను లాంచ్ చేస్తుంది. అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు అందిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికి ఎన్నో మొబైళ్లను చీప్ ధరకే తీసుకొచ్చి దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇప్పుడు మరో చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ Samsung Galaxy M05ను భారతదేశంలో లాంచ్ చేసింది.


ఈ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Helio G85 SoCను అందించారు. అలాగే ఇది 4GB RAM + 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా Samsung RAM ప్లస్ ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే రెండు సంవత్సరాల పాటు OS అప్‌డేట్‌లను పొందుతుంది. కాగా ఈ Galaxy M05 గత సంవత్సరం లాంచ్ అయిన Galaxy M04కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చింది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అదే సమయంలో ఫోన్‌కు శక్తినివ్వడానికి 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Samsung Galaxy M05 Specifications


Samsung Galaxy M05 స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ గెలాక్సీ M05 స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్‌లు) PLS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌‌ఫోన్ 4GB RAM + 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. అలాగే ఇది ఆక్టా-కోర్ MediaTek Helio G85 SoC ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. అలాగే దీని స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు. మైక్రో SD కార్డును ఉపయోగించి దాదాపు 1TB వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. అలాగే Samsung RAM ప్లస్ ఫీచర్‌తో అందుబాటులో ఉన్న మెమరీని అదనంగా 8GB వరకు విస్తరించవచ్చు. కాగా Samsung Galaxy M05 డ్యూయల్ వెనుక కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి.

Also Read: వారెవ్వా ఆఫర్ సూపర్.. సామ్‌సంగ్ ఫోన్‌పై రూ.20,000 డిస్కౌంట్, కొద్ది రోజులు మాత్రమే!

ఇక ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 2.0 ఎపర్చరుతో 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇది రెండు సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లను, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్‌ను పొందుతుంది. ఇక Galaxy M05లోని కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికొస్తే.. ఇందులో 4G, Wi-Fi 802.11a/b/g/n/ac, బ్లూటూత్, GPS, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-C వంటి పోర్ట్‌లు ఉన్నాయి. ఇంకా Samsung Galaxy M05లో 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేసింది.

Samsung Galaxy M05 Price

Samsung Galaxy M05 స్మార్ట్‌ఫోన్ ధర విషయానికొస్తే.. ఇది భారతదేశంలో 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. కంపెనీ దీని ధరను కేవలం రూ.7,999గా నిర్ణయించింది. ఇది మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో అందించబడుతుంది. దీనిని కొనుక్కోవాలని అనుకునే వారు Amazon, Samsung.com సహా ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు.

Related News

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Big Stories

×