EPAPER

Pithapuram: చంద్రబాబు అబద్దాన్ని కూడా అమ్మేయగలరు.. ఏలూరు పర్యటనలో జగన్ గరం గరం

Pithapuram: చంద్రబాబు అబద్దాన్ని కూడా అమ్మేయగలరు.. ఏలూరు పర్యటనలో జగన్ గరం గరం

YS Jagan Visits Pithapuram Floods Affected Areas: ఏలూరు వరదలకు కారణం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమేనని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఏలేరు ముంపు గ్రామాల్లో జగన్ పర్యటించారు. అనంతరం రమణక్కపేటలో మీడియాతో మాట్లాడారు. విజయవాడలో మాదిరిగానే ఇక్కడ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. అధికారులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.


ఏలూరు రిజర్వాయర్‌లో ఫ్లడ్ మేనేజ్‌మెంట్ చేయలేదని, బాధ్యత, మానవత్వం లేని ప్రభుత్వమని విమర్శించారు. వరదలను ఎలా మేనేజ్ చేయాలో కూడా ఈ ప్రభుత్వానికి తెలియదని, గోబెల్స్‌కు చంద్రబాబు తమ్ముడిలాంటోడని ఎద్దేవా చేశారు.

అబద్ధాన్ని కూడా అమ్మగలిగే టాలెంట్ చంద్రబాబుకి ఉందని జగన్ అన్నారు. ఎగువ నుంచి భారీగా వరద వచ్చినా కిందకు నీళ్లకు వదల్లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. బాధ్యత, మానవత్వం లేని ప్రభుత్వమని విమర్శలు చేశారు. వరదలను ఎలా మేనేజ్ చేయాలో కూడా ఈ ప్రభుత్వానికి తెలియదని దుయ్యబెట్టారు.


వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించినా..ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కనీసం జిల్లా కలెక్టర్లతో రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఏలూరు రిజర్వాయర్ నిండేవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

ఏలూరు అభివృద్ధి పనుల విషయంలో చంద్రబాబు అబద్ధాలు చెప్పారని జగన్ అన్నారు. ఏ కాల్వపైనా ఆధునీకరించాలంటే నీళ్లు లేని సమయంలో లేదా క్రాప్ హాలీడే ప్రకటిస్తే తప్పా సాధ్యం కాదన్నిరు. 2008లోనే దివంగత వైఎస్సార్ ఏలేరుకు నిధులు కేటాయించి ప్రారంభించారని గుర్తు చేశారు.

ఆనాటి నుంచి ఇప్పటివరకు ఏలేరును ఎవరూ పట్టించుకోలేదన్నారు. 2014లో చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత అంచనాలు మాత్రమే పెంచారే తప్పా అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వాయర్లు నిండుగా ఉన్నాయని తెలిపారు.

2015లో ఏలేరు అంచనాలు రూ.295కోట్లకు పెంచిన చంద్రబాబు.. పనులు మాత్రం పూర్తిచేయలేకపోయారన్నారు. వైసీపీ హయాంలో క్రాప్ హాలీడే ప్రకటిస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కాల్వ ఆధునీకీకరణ పనులు వేగంగా చేయలేకపోయామని చెప్పారు. చంద్రబాబు హయాంలో కరువు విలయతాండవం చేసిందని, ఆ సమయంలో ఏలేరు అభివృద్ధి పనులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు వైసీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జగన్ మండిపడ్డాడు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలు లేనందున రైతులకు సకాలంలో సాయం అందడం లేదన్నారు. రైతులకు ఇస్తానన్న సున్నా వడ్డీ పంట రుణాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రూ.20వేలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేశారన్నారు.

చంద్రబాబు వస్తే బడి పిల్లలకు రూ.15వేలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని చెప్పారు. అలాగే అక్కచెల్లెమ్మలకు రూ.18వేలు ఇవ్వకుండా మోసం చేశారని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. ఆరోగ్యశ్రీ నిధులు, విద్యాదీవెన, గోరుముద్ద కనిపించకుండా చేశారన్నారు. వరద బాధితులకు కనీసం పునరావాసం కూడా కల్పించడం లేదని విమర్శించారు.

Also Read: టీడీపీ ఆఫీసు దాడి కేసు, వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో స్మాల్ రిలీఫ్.. కాకపోతే..

అంతకుముందు వైఎస్ జగన్ పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మాధవపురం, నాగులాపల్లి గ్రామాల్లో పర్యటించిన రైతులతో మాట్లాడారు. అనంతరం బాధితులను ఓదార్చారు.

Related News

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Minister Kandula Durgesh: రాష్ట్రంలో స్టూడియోలు నిర్మించండి.. నిర్మాతలకు మంత్రి మరోసారి ఆహ్వానం

Tirumala Laddu: తిరుమల లడ్డూపై వివాదం.. వేంకటేశ్వరుడికి మచ్చతెచ్చేలా మాజీ సీఎం చేశారా?

Ysrcp Mlas: ఇంట్లో కుంపటి.. జగన్‌కు ఇక ఝలక్‌ల మీద ఝలక్‌లే, ఎందుకంటే?

Kadambari Jatwani: న్యాయం కోసం.. హోంమంత్రి అనితను కలిసిన.. నటి కాదంబరి జత్వానీ

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు.. ఎందుకో తెలుసా?

Balineni Srinivasa Reddy: వైసీపీకి రాజీనామా.. జనసేనలోకి బాలినేని? ముహూర్తం ఫిక్స్!

Big Stories

×