EPAPER

Vijay Varma: బాధలో ఉన్నారు ఇబ్బంది పెట్టకండి, మీడియాకు విజయ్‌ వర్మ రిక్వెస్ట్

Vijay Varma: బాధలో ఉన్నారు ఇబ్బంది పెట్టకండి, మీడియాకు విజయ్‌ వర్మ రిక్వెస్ట్

Vijay Varma Request To Media: బాలీవుడ్‌ నటి మలైకా అరోరా తండ్రి అనిల్‌ అరోరా రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. తన ఇంటి టెర్రస్ మీది నుంచి దూకి చనిపోయారు. ఈ నేపథ్యంలో మలైకా ఇంటి దగ్గర మీడియా హడావిడి మొదలైంది. బాధలో ఉన్న ఇంటి ముందు మీడియా అత్యుత్సాహం పట్ల పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ఇబ్బందికి గురి చేయకూడదని సూచిస్తున్నారు. ఆ కుటుంబ పరిస్థితి అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతే బాగుటుందంటున్నారు. మలైకా బయటకు వచ్చినప్పుడల్లా ఆమెను రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టకూడదని రిక్వెస్ట్ చేస్తున్నారు.


వారిని ఒంటరిగా వదిలేయండి- విజయ్ వర్మ

బాధలో ఉన్న మలైకా కుటుంబాన్ని ఒంటరిగా వదిలేయాలని నటుడు విజయ్ వర్మ మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. “దయచేసి దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని వదిలేయండి. ఇప్పుడు వాళ్లు చాలా కష్టసమయంలోఉన్నారు. ఈ బాధ నుంచి బయటపడటం అంత ఈజీ కాదు. మీడియా వారిపై కాస్త దయచూపాలని కోరుతున్నా” అంటూ రాసుకొచ్చారు.


మీడియా తీరుపై వరుణ్ ఆగ్రహం

అటు తన తండ్రి అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకు వచ్చిన మలైకాను ఫోటోలు తీసేందుకు కెమెరామెన్లు ఎగబడటం పట్ల మరో నటుడు వరుణ్ ధావన్ అసహనం వ్యక్తం చేశారు. బాధలో ఉన్నవారి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. “మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? మీ కారణంగా ఎదుటి వాళ్లు ఎలా ఇబ్బంది పడుతున్నారో ఆలోచించండి. మీ పని మీరు చేస్తున్నారు. కానీ, ఆ కుటుంబం బాధలో ఉందనే విషయాన్ని మర్చిపోకండి” అని రాసుకొచ్చారు.

Also Read: మలైక అరోరా తండ్రి ఆత్మహత్య, 6వ అంతస్తుపై నుంచి దూకి.. కారణం ఇదేనా?

ముంబై హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు

అనిల్‌ అరోరా అంత్యక్రియలు ముంబైలోని శాంతాక్రజ్ హిందూ శ్మశానవాటికలో జరిగాయి. ఈ కార్యక్రమంలో మలైకా అరోరా తన కొడుకు అర్హాన్ ఖాన్ తో కలిసి పాల్గొన్నారు. అర్జున్ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్‌ తో పాటు పలువురు ప్రముఖులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మలైకా అరోరా మాజీ భర్త అర్బాజ్ ఖాన్, అతడి భార్య షురా ఖాన్‌ తో కలిసి శ్మశాన వాటికకు వచ్చారు. అనిల్‌ అరోరా భౌతికకాయానికి నివాళులర్పించారు.

ఆత్మహత్యకు ముందుకు కూతుళ్లకు ఫోన్

బుధవారం(సెప్టెంబర్ 11న) నాడు అనిల్‌ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. 65 ఏండ్ల వయసు ఉన్న ఆయన ఇంటి టెర్రస్ మీది నుంచి దూకి చనిపోయారు. ఆయన చనిపోవడానికి ముందు తన ఇద్దరు కూతుళ్లు మలైకా, అమృతకు ఫోన్ చేశారు. అనారోగ్యంతో అలసిపోయానని చెప్పారు. కాసేపటికే తను ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ చేశారు. కుటుంబ సభ్యులు అతడితో మాట్లాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదని పోలీసులు వెల్లడించారు. అనిల్ అరోరా ఆత్మహత్యకు గల అసలు వాస్తవాలు ఏంటి? అనే విషయంపై లోతుగా విచారణ జరుపుతున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. త్వరలోనే ఈ సూసైడ్ వెనుకున్న నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు.

 

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×