EPAPER

Cooking Oil: ఇలా వంట చేసుకుని తింటే కొలస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టేయోచ్చు..

Cooking Oil: ఇలా వంట చేసుకుని తింటే కొలస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టేయోచ్చు..

Cooking Oil: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆహారంపై సరిగా దృష్టి పెట్టడం లేదు. దీంతో మారుతున్న జీవనశైలి కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా బయట తయారుచేసే ఆహారం తింటే చాలా వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అయితే ఇలా తయారుచేసే ఆహారంలో నూనెను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. రుచి బాగుండాలని, క్రిస్పీగా ఉండాలని భావించి నూనెను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా వంటల్లో నూనెను ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరంలో కొలస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.


మాంసాహారంలో అయితే నూనెను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సాధారణంగానే మాంసాహారంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ తరుణంలో నూనెను కూడా ఎక్కువగా ఉపయోగించిన మాంసాహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని కొలస్ట్రాల్ స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వంటల్లో నూనెను వీలైనంత తక్కువగా వాడాల్సి ఉంటుంది. ఇలాంటి ఆహార పదార్థాలు తింటే మధుమేహం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

నూనెను ఎక్కువగా వేపుడు పదార్థాలు వండడానికి వాడుతుంటారు. దీని కారణంగా ఇందులో నూనెను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీని కారణంగా ట్రైగ్లిజరైడ్స్, కొలస్ట్రాల్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు మాత్రమే కాదు ఊబకాయం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే వంటల్లో నూనెను ఎంత తక్కువగా వాడితే ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు ఉంటాయి.


వంటల్లో కేవలం నూనెను ఒక చుక్క మాత్రమే ఉపయోగిస్తే చాలా వరకు కొలస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు. వంటల్లో 5 నుంచి 10 స్పూన్లు నూనెను వాడడం కంటే కేవలం ఒకటి లేదా రెండు స్పూన్ల నూనెను వాడడం వల్ల శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు. అయితే ఇలా వండుకుని తినాలంటే నాన్ స్టిక్ పాన్ లలో వంట చేసుకుని తింటే చాలా తక్కువ నూనెను వాడుకోవచ్చు. ఎందుకంటే నాన్ స్టిక్ లో కూర త్వరగా ఉడుకుతుంది. అందువల్ల ఇందులో నూనెను తక్కువగా వాడినా కూడా వంట బాగుంటుంది. అయితే ఇలా నాన్ స్టిక్ పాన్ లలో వండిన ఆహారాన్ని ఎక్కువగా సేపటికి వరకు ఉంచకుండా త్వరగా తినేస్తే మంచిది.

మాంసాహారాన్ని వండుకునే సమయంలో ఎక్కువగా నూనెను వాడకుండా ఉండాలంటే ముందుగానే మాంసాహారాన్ని మారినేట్ చేసి దానికి ఆయిల్ పూసి ఉంచాలి. దానిని నూనె వాడకుండా డైరెక్ట్ గా వండినా కూడా రుచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా చేపలు, మటన్, చికెన్, గుడ్లు వంటివి వండుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×