EPAPER

Mla Arekapudi gandhi: ఎమ్మెల్యే అరికపూడి గాంధీ.. పార్టీలో ప్రాంతీయ విభేదాలు వద్దన్నాను, అయినా..

Mla Arekapudi gandhi: ఎమ్మెల్యే అరికపూడి గాంధీ.. పార్టీలో ప్రాంతీయ విభేదాలు వద్దన్నాను, అయినా..

Mla Arekapudi gandhi: బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ-కౌశిక్‌రెడ్డిల మధ్య వివాదం ముదిరిపాకాన పడింది. ఈ వ్యవహారంపై శుక్రవారం ఉదయం మరోసారి రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే గాంధీ. రెచ్చగొట్టే ధోరణిలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీని ఆయన భ్రష్టుపట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు గుర్తించాలన్నారు. పార్టీలో ప్రాంతీయ విభేదాలు వద్దని తాను కేసీఆర్‌తో చెప్పానని గుర్తు చేశారు.


గురువారం ఉదయం 11 గంటలకు నా ఇంటికి వస్తానని కౌశిక్‌రెడ్డి అన్నారని, ఆయన రాకపోవడంతో వాళ్ల ఇంటికి వెళ్లానని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. బీఆర్ఎస్‌కి-తనకు యుద్ధం కాదన్నా రు. వ్యక్తిగతంగా కౌశిక్‌రెడ్డితో తనకు యుద్ధమేనన్నారు.

ALSO READ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసు ఫిర్యాదు.. కేసు నమోదు


బీఆర్ఎస్ పార్టీ అన్నా, కేసీఆర్ అన్నా తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు ఎమ్మెల్యే. ఈ విషయాన్ని అధినేత గుర్తు ఉంచాలన్నారు. కౌశిక్‌రెడ్డి ఓ కోవర్ట్ అంటూనే.. ఇలాంటివాళ్లు పార్టీలో ఉంటే చాలా మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు. సమ ఉజ్జీ కాని వ్యక్తి ఇంటికి వెళ్లినందుకు ఒకవిధంగా తాను బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు సదరు ఎమ్మెల్యే.

కొంతమంది పోలీసుస్టేషన్లను ముట్టడిస్తామని చెప్పడంతో ప్రభుత్వం తగు జాగ్రత్త తీసుకుంటుందన్నారు. నా ఇంటి వద్ద ఎలాంటి పోలీసు అవసరం లేదన్నారు. మా ఇంటికి ముందు చక్కటి వాతావరణం ఉందన్నారు. మీడియా అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు ఎమ్మెల్యే గాంధీ.

ముఖ్యమంత్రి ప్రొద్భలంతో ఇదంతా జరిగిందంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై రిప్లై ఇచ్చారాయన. నా ఫోన్ ఇస్తానని, సింగిల్ కాల్ అయినా చూపించాలన్నారు. గురువారం కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద జరిగిన కొన్ని దృశ్యాలు చూపించారు. తనపై రాయి, పూలకుండీలతో దాడి చేసిన విజువల్స్‌ను మీడియాకు చూపించారు. ఇలాంటి చీడ పురుగుల్ని ఏరి పారేయాలని కంకణం కట్టుకున్నానని చెప్పుకొచ్చారు అరికపూడి గాంధీ.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×