EPAPER

Actress Hema: నువ్వు ఇక మారవా.. మళ్లీ కొత్త వీడియో రిలీజ్ చేసిన హేమ

Actress Hema: నువ్వు ఇక  మారవా.. మళ్లీ కొత్త వీడియో రిలీజ్ చేసిన హేమ

Actress Hema: సినీ నటి హేమ ఏ ముహూర్తాన డ్రగ్స్ కేసులో దొరికిందో కానీ, అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమె పేరు బాగా వినిపించడం మొదలయ్యింది. బెంగుళూరు రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకుంటూ డైరెక్ట్ దొరికిందని బెంగుళూరు పోలీసులు కన్ఫర్మ్ చేస్తే.. ఇక్కడ ఈమేమో.. అసలు ఆ కేసుకు, నాకు ఎలాంటి సంబంధం లేదని వీడియోలు పెట్టడం హైలైట్ గా మారింది.


కొందరు హేమకు సపోర్ట్ గా మాట్లాడుతూ రాగా.. ఇంకొందరు హేమ ఇలాంటి వీడియోలు ఎన్ని పెట్టినా నమ్మేది లేదని చెప్పుకోస్తున్నారు. ఈ మధ్యనే హేమ .. తాను అన్ని టెస్ట్ లు చేయించుకున్నాను అని, హెయిర్, నెయిల్స్, బ్లడ్ లో ఎలాంటి డ్రగ్స్ లేవని రిపోర్ట్ వచ్చినట్లు తెలిపింది.  తనను చాలామంది బెదిరిస్తున్నారని, పవన్ కళ్యాణ్ ను, సీఎం రేవంత్ రెడ్డిని  కలిసి మాట్లాడే అవకాశం కల్పించాలని కోరింది.

ఇక ఆ మనవి ఇంకా నెరవేరకముందే తాజాగా పోలీసులు బెంగుళూరు రేవ్ పార్టీ ఛార్జ్ షీట్ ను సమర్పించారు. 1086 పేజీల తో కూడిన చార్జ్ షీటును కోర్టుకు సమర్పించారు. ఇందులో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు స్పష్టంగా తెలిపారు. పార్టీలో మొత్తం 88 మంది పాల్గొన్నారని, ల్యాబ్ ఇచ్చిన నివేదికలో హేమ ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యినట్లు చెప్పుకొచ్చారు.  ఇక పోలీసులు ఇలా మాట్లాడితే.. ఇంకోపక్క హేమ మాత్రం తాను డ్రగ్స్ కేసులో నుంచి బయటపడినట్లు ఒక కొత్త వీడియో రిలీజ్ చేసింది.


” హాయ్.. అందరికీ నమస్కారం.. నేను మీ హేమను..  ఈరోజు నేను  ఓ గుడ్ న్యూస్ విన్నాను. దాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు  మా లాయర్ ఫోన్ చేసి  ఛార్జ్‌షీట్‌లో నా రిపోర్ట్స్ .. బ్లడ్, హెయిర్, నెయిల్స్ రిపోర్ట్స్  అన్నీ నెగెటివ్ వచ్చాయంట..   అదే ఛార్జ్‌షీట్‌లో ఇచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు. ఇలా నాకు మంచి గుడ్‌న్యూస్ చెప్పారు. ఆల్రెడీ నేను చేయించుకున్న టెస్టుల్లో నెగెటివ్ వచ్చింది.. ఆ విషయం మీకు చెప్పాను.

ఏ టెస్టులకైనా రెడీ, ఎక్కడికైనా రెడీ.. నా టెస్టులు నమ్మాల్సిన అవసరం లేదని కూడా చెప్పాను. కానీ ఇప్పుడు అఫీషియల్‌గా.. ఛార్జ్‌షీట్‌లో కూడా నా టెస్టులకి నెగెటివ్ వచ్చిందని ఇచ్చారు. చాలా  చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అప్‌లోడ్ చేశాను.  హేమ ఎప్పుడూ నవ్వుతూ మీ ముందు ఇలాగే ఉండాలని నన్ను బ్లెస్స్  చేయండి” అంటూ చెప్పుకొచ్చింది.

ఇక ఈ వీడియోపై నెటిజన్స్ పలురకాలుగా  స్పందిస్తున్నారు.  నువ్వు ఇక మారవా అని కొందరు, నువ్వు హైదరాబాదు లో ఏ చెట్టు కింద నిలుచుని వీడియో చేసావో ఆ చెట్టు దగ్గరికి మమ్మల్ని అందరినీ తీసుకెళ్లు… అప్పుడే నమ్ముతాము నీ మాటలు అని ఇంకొందరు. చికెన్ బిర్యానీ బావుంది అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇంకొంతమంది అసలు ఏంటి ఈ కన్ఫ్యూజన్ అని తలలు పట్టుకుంటున్నారు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×