Shocking Video: మనుషులకే కాదు జంతువులకు కూడా కొన్నిసార్లు మాట్లాడుకునే మాటలు అర్థం అవుతుంటాయి. అందులో ముఖ్యంగా ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులు తరచూ మనతో మెదిలి మన మాటలను అర్థం చేసుకుని ప్రవర్తిస్తుంటాయి. ఈ తరుణంలో వాటికి మనం మాట్లాడుకునే సంభాషణలు కూడా అర్థం చేసుకునే తెలివి వస్తుంది. దీనికి ఉదాహరణగా చాలా సంఘటనలు కూడా ఉన్నాయి. ఇంట్లోనే పెంచుకునే జంతువులు మనం ఏం చెప్పినా వింటూ ఆ పనులు చేస్తుంటాయి. అయితే తాజాగా ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓ కుక్క టీవీలో వచ్చిన సంభాషణను అర్థం చేసుకుని భయాందోళనకు గురైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇటీవల అగ్ర రాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో ఆయన మాట్లాడిన మాటలకు కుక్క బెంబేలెత్తిపోయింది. ‘ఒహియోలోని స్ప్రింగ్ఫీల్డ్లో వలసదారులు కుక్కలను తింటున్నారు’అని డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనపై ఈ కుక్క హడలి పోయింది. సెప్టెంబర్ 11వ తేదీన యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మరియు ట్రంప్‌ల మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
నవంబర్‌లో యూఎస్ ఎన్నికలకు ముందు, హారిస్ మరియు ట్రంప్ అబార్షన్ హక్కులు, ఆర్థిక వ్యవస్థ, ఇమ్మిగ్రేషన్ మరియు సరిహద్దు సమస్యలు, అలాగే ఇజ్రాయెల్-గాజా యుద్ధంతో సహా అనేక విషయాలపై చర్చించారు. అయితే, ఇమ్మిగ్రేషన్ పాలసీపై డిబేట్ సెగ్మెంట్ నిర్వహించిన సందర్భంగా, ఒహియోలోని స్ప్రింగ్ఫీల్డ్లో అనేక మంది అక్రమ హైతియన్ వలసదారులు నివాసితుల పెంపుడు జంతువులను దొంగిలించి వాటిని తింటున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ చేసిన వ్యాఖ్యల వీడియో టీవీలో దర్శనమిచ్చింది. అయితే ఓ వ్యక్తి తన ఇంట్లో పెంపుడు కుక్కతో కలిసి టీవీ చూస్తూ ఉండగా ఈ సంభాషణ రావడంతో ఆ కుక్క హడలిపోయింది. వెంటనే సోఫా నుంచి కిందకు దిగి పక్కన దాక్కుంది. దీంతో యజమాని ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.
THEY’RE EATING THE DOGS pic.twitter.com/lQqMW5l8pT
— Tarquin 🇺🇦 (@Tarquin_Helmet) September 11, 2024