EPAPER

Travis Head: హెడ్.. వీర కొట్టుడు.. ఒకే ఓవర్ లో 30 పరుగులు

Travis Head: హెడ్.. వీర కొట్టుడు.. ఒకే ఓవర్ లో 30 పరుగులు

Travis Head Smashes 30 Runs off Sam Curran’s over in 1st T20I: ఆస్ట్రేలియా ఓపెనర్, విధ్వంసకర ఆటకు పెట్టింది పేరైన ట్రావిస్ హెడ్ ప్రస్తుతం భీకర ఫామ్ తో చెలరేగిపోతున్నాడు. ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ తరఫున అభిషేక్ శర్మతో కలిసి సృష్టించిన సునామీ ఇన్నింగ్స్ ఇంకా అందరి కళ్లకు కట్టినట్టే కనిపిస్తున్నాయి. స్కాట్లాండ్‌ వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా చెలరేగి ఆడాడు. ఇప్పుడలాంటిదే మరొకటి ఆడి చూపించాడు. అందరి కళ్లు బైర్లు కమ్మాయి. ఒకే ఓవర్ లో వీరకొట్టుడు కొట్టి 30 పరుగులు చేశాడు. ఆ కథా కమామిషు ఏమిటంటే..


ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య టీ 20 సిరీస్ జరుగుతోంది. నిజానికి పాకిస్తాన్-ఇండియా మధ్య మ్యాచ్ అంటే ఎంత ఇంట్రస్టు ఉంటుందో, ఆ రెండు దేశాల మధ్య మ్యాచ్ అన్నా అదే రీతిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో సౌతాంప్టన్‌ వేదికగా బుధవారం ఆసీస్ వర్సెస్ ఇంగ్లండ్‌ల మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరిగింది. ఇందులో ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడి ఆకట్టుకున్నాడు.

ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. కేవలం 23 బంతుల్లోనే 59 పరుగులు చేసి దుమ్ము దులిపాడు. ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ స్కోరులోనే ఒక విధ్వంసం జరిగింది. అదేమిటంటే.. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్, ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తాత్కాలిక కెప్టెన్ గా చేసిన సామ్ కరన్‌ పవర్ ప్లేలో 5వ ఓవర్ వేశాడు.


Also Read: మహిళల టీ 20 ప్రపంచకప్.. టికెట్ ధర ఎంతో తెలుసా?

ఆ ఫీల్డింగ్ నిబంధనలను ఆసరా చేసుకుని హెడ్ ఆ  ఓవర్‌లో వరుసగా 4, 4, 6, 6, 6, 4 బాది పారేశాడు. దీంతో ఆ ఒక్క ఓవర్‌లో ఆస్ట్రేలియాకు 30 పరుగులు వచ్చాయి. వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన ట్రావిస్ హెడ్.. అటు ఇటుగా మిగిలిన మూడు బంతుల్ని ఫోర్లుగా మలచాడు. ఈ క్రమంలో హెడ్ కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తి చేసుకోవడం విశేషం.

మరో ఓపెనర్ మాట్ షార్ట్ కూడా అద్భుతంగా ఆడాడు.  26 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇలా ఓపెనర్లు ఇద్దరూ ఎడాపెడా బాదేయడంతో ఇంగ్లండ్ దిక్కులు చూస్తూ ఉండిపోయింది.

అయితే మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 151 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×