EPAPER

Attack on Kaushik Reddy house: కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్, రెచ్చిపోయిన గాంధీ అనుచరులు, రాళ్లతో దాడి

Attack on Kaushik Reddy house: కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్, రెచ్చిపోయిన గాంధీ అనుచరులు, రాళ్లతో దాడి

Attack on Kaushik Reddy house: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ-కౌశిక్‌రెడ్డి సవాల్-ప్రతి సవాల్ మధ్య వాతావరణం వేడెక్కింది. కౌశిక్‌రెడ్డి విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ రంగంలోకి దిగేశారు. తన ఇంటి నుంచి నేరుగా కొండాపూర్‌లోని కౌశిక్ నివాసానికి చేరుకున్నారు.


ఈ క్రమంలో గాంధీ అనుచరులు కౌశిక్‌రెడ్డి ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. గేటు ఎక్కి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే ఇంటిపై గాంధీ మద్దతుదారులు రాళ్లు, చెప్పులు టమాటాలు విసిరారు. దీంతో కౌశిక్ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పరిస్థితి గమనించిన పోలీసులు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఇటు గాంధీ మద్దతుదారులు.. అటు కౌశిక్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా సరే గాంధీ మద్దతుదారులు వెనక్కి తగ్గలేదు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.. నీ ఇంటి కొచ్చా.. దమ్ముంటే బయటకి రా అంటూ డిమాండ్ చేశారు.


కౌశిక్ రెడ్డి కోవర్టు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవర్టుల మూలంగా పార్టీ నాశనం అయ్యిందని దుయ్యబట్టారు. తమపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రాంతీయ విబేధాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారని విరుచుకుపడ్డారు.

ALSO READ: వీధికెక్కిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కేసీఆర్,కేటీఆర్ మౌనమేలా?

మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతావా అంటూ మండిపడ్డారు గాంధీ. కరీంనగర్ నుంచి నీవు బతకడానికి రాలేదా అంటూ ప్రశ్నించారాయన. క్రిమినల్ అని తెలిసి గవర్నర్ దూరంగా పెట్టింది వాస్తవం కాదా? అంటూ విమర్శించారు గాంధీ.

మరోవైపు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అదేస్థాయిలో రెచ్చిపోయారు. తెలంగాణ పవరేంటో రేపు చూపిస్తానన్నారు. ఈ క్రమంలో నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తెచ్చారు.  చివరకు పరిస్థితి గమనించిన పోలీసులు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని అదుపులోకి తీసుకుని మరో ప్రాంతానికి తరలించారు.

 

 

 

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×