EPAPER

US Ghost Town: అమెరికాలో దెయ్యాల ఊరు!.. 62 ఏళ్లుగా అక్కడ రగులుతున్న మంటలు..

US Ghost Town: అమెరికాలో దెయ్యాల ఊరు!.. 62 ఏళ్లుగా అక్కడ రగులుతున్న మంటలు..

US Ghost Town Centralia| అమెరికా లో ఒక పట్టణంలో అసలు ప్రజలెవరూ నివసించడం లేదు. చూడడానికి ఆ ఊరు హాలివుడ్ హారర్ సినిమాల్లో లాగా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఆ ఊరికి వెళఇతే ఏదో ఉపద్రవం జరిగిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఊరి పేరు సెంట్రాలియా.


అమెరికాలోని పెన్సిల్‌వేనియా రాష్ట్రంలో చిన్న పట్టణం సెంట్రాలియా. ఆ పట్టణంలో 1962 కి ముందు అంతా సాధారణంగా ఉండేది. 1860వ దశకంలో నిర్మించబడిన ఈ పట్టణంలో అప్పడు దాదాపు 2700 మంది నివసించేవారు. సెంట్రాలియా పట్టణ భూభాగంలో బొగ్గు నిల్వలు బాగా ఉండడంతో అక్కడ మైనింగ్ కార్యకలాపాలు మొదలయ్యాయి. 1865లో ఈ ఊరి పేరు సెంట్రల్ విల్లె గా నామకరణం జరిగింది. అయితే సెంట్రల్ విల్లె అనే పేరుతో సమీపంలోని షుయిల్‌కిల్ కౌంటీలో మరో పట్టణం ఉండడంతో పోస్టల్ శాఖ వారు తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం ఈ ఊరి పేరుని సెంట్రాలియాని అని మార్చింది.

అయితే సెంట్రాలియా పట్టణంలో చాలా మందికి ఉపాధి దొరికింది. అక్కడ బొగ్గు మైన్లలో పనిచేయడానికి దూర ప్రాంతాల నుంచి జనం వచ్చి అక్కడే స్థిరపడిపోయారు. అమెరికా లో గ్రేట్ డిప్రెషన్ లాంటి భారీ ఆర్థిక సంక్షోభం వచ్చిన సమయంలో దేశ వ్యాప్తంగా చాలా బొగ్గు గనులు మూతబడిపోయాయి. కానీ సెంట్రాలియా మైన్స్ మాత్రం యథావిధిగా పనిచేశాయి. దానికి కారణం ఆ మైన్స్ ని తమ అదుపులోకి తీసుకున్న మాలీ మెగైర్స్ అనే ఐరిష్ సీక్రెట్ సొసైటీ. ఈ మాలీ మెగైర్స్ చాలా కృూరులని.. వారు చేతబడులు లాంటివి చేసేవారని ప్రచారంలో ఉంది.


మాలీ మెగైర్స్ సభ్యులే సెంట్రాలియా పట్టణ వ్యవస్థాపకుడిని 1860వ దశకంలో హత్యచేసి.. అక్కడున్న మొత్తం మైన్స్, ఇతర సంపదను హస్త గతం చేసుకున్నారని స్థానికులు చెబుతుంటారు. కానీ ఆ తరువాత కూడా ఈ మాలీ మెగైర్స్ సీక్రెట్ సొసైటీ వారు చాలా తక్కువ వేతనానికి కూలీలతో పనిచేయించేవారని.. ఎదురు తిరిగిన వారిని హత్య చేసి మైన్స్ లోపలే పాతిపెట్టారని కథలుగా చెప్పుకుంటున్నారు.

Also Read: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

ఈ క్రమంలో 1962లో ఎవరూ ఊహించినది జరిగింది. ఆ సంవత్సరంలో బొగ్గు గనుల్లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎంత మంది చనిపోయారనే విషయాన్ని మాలీమెగైర్స్ సభ్యులు బయటికి రానివ్వలేదు. కానీ ఆ అగ్ని ప్రమాదం ఎప్పటికీ ఆరని మంటలుగా మారుతుందని వారు అసలు ఊహించలేదు. దీంతో సెంట్రాలియా మొత్తం దహించుకుపోయింది. అక్కడ నివసిస్తున్న వారంతా ఇళ్లు ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అగ్ని మంటలు తీవ్రమవుతుండడంతో ప్రభుత్వం దిగివచ్చింది. మంటలు ఆర్పేందుకు చాలా ఖర్చు చేయాల్సి వచ్చింది. కానీ ఆ మంటలు మాత్రం ఆరిపోలేదు. 28 ఏళ్ల పాటు ఆ రగులుతున్న మంటలను ఆర్పేందుకు ప్రభుత్వం అప్పటికే 7 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. ఇక ఓపిక లేక అలాగే వదిలేసింది.

అమెరికా పర్యావరణ రక్షణ శాఖ ప్రకారం.. సెంట్రాలియా భూభగంలోని మంటలు అలాగే వదిలేస్తే.. మరో 100 సంవత్సరాల నుంచి 250 సంవత్సరాల వరకు రగులుతూనే ఉంటాయి. దీనంతటికీ కారణం.. భూభగాంలోని నాక్సియస్ గ్యాసులని నిపుణులు తెలిపారు. కానీ సాధారణ ప్రజలు మాత్రం ఆ బొగ్గు గనుల్లో హత్య చేయబడిన కూలీల ఆత్మలే ఈ ఉపద్రవానికి కారణమని నమ్ముతున్నారు.

Also Read: ఆఫీసులో వివాహేతర సంబంధం.. ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ.. కోర్టుకెక్కిన ఉద్యోగులు

అయితే గత దశాబ్ద కాలంగా సెంట్రాలియా మంటల తీవ్రత తగ్గడంతో అక్కడికి పర్యాటకులు వెళుతున్నారు. కరోనా సమయంలో మాత్రం ప్రభుత్వం ఆ ప్రాంతంలో పర్యటించకూడదని ఆంక్షలు విధించింది.

Related News

Viral Video: డాక్టర్‌పై చెప్పులతో దాడి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Amazon Delivery After 2 Years: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Big Stories

×