EPAPER

Employees Extramarital Affair : ఆఫీసులో వివాహేతర సంబంధం.. ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ.. కోర్టుకెక్కిన ఉద్యోగులు

Employees Extramarital Affair : ఆఫీసులో వివాహేతర సంబంధం.. ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ.. కోర్టుకెక్కిన ఉద్యోగులు

Employees Extramarital Affair | ఒకే ఆఫీసులో సహాద్యోగులుగా పనిచేస్తూ ప్రేమలో పడ్డారు. అయితే వారి ప్రేమ విషయం ఉంచకుండా ఆఫీసులోనే పాశ్చాత్య సంస్కృతి లాగా ముద్దులు పెట్టుకోవడ వంటివి చేయడం మొదలుపెట్టారు. అది చూసి ఆఫీసులో వారి గురించి ఒకటే చర్చ.. ఈ విషయం బాస్ వరకు వెళ్లింది. మరో విశేషమేమిటంటే వారిద్దరికీ వెర్వేరుగా ఇంతకుముందే పెళ్లి అయింది. అయినా బహిరంగంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఇదంతా విన్న బాస్.. వారిద్దిరినీ ఆఫీసు నుంచి తొలగించాడు. తమ వ్యక్తిగత జీవితం కారణంగా ఉద్యోగం నుంచి తొలగించడం అన్యాయమని ఆ ప్రేమ జంట కంపెనీపై కేసు వేసింది. కానీ కోర్టు వారికే మొటిక్కాయలు వేసింది. ఈ ఘటన చైనాలో జరిగింది.


చైనా వార్తా సంస్థ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. చైనా దేశంలోని సిచుఆయన్ రాష్ట్రంలో ఉన్న ఒక ఫార్మా కంపెనీలో లియు అనే యువకుడు, చెన్ అనే యువతి పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఒకే డిపార్ట్‌మెంట్ లో కలిసి పనిచేస్తుండగా.. వారిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కాని సమస్య ఏమిటంటే వారిద్దరికీ వేర్వేరు వ్యక్తులతో ఇదివరకే వివాహమైంది. ఇద్దరూ కలిసి సినిమాలకు, షికార్లకు వెళ్లడం.. అఫీసు అయిపోయిన తరువాత తరుచూ ఫోన్లో మాట్లాడడం చేసేవారు.

Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?


ఈ క్రమంలో లియు భార్య ఒకరోజు అతని ఫోన్ చెక్ చేసింది. అందులో మరో యువతిని తన భర్త కిస్ చేయడం, కౌగిలించుకోవడం వంటి ఫొటోలు చూసింది. అది చూసి షాక్ అయిన ఆమె, ఫోన్లో ఇద్దరి మధ్య జరిగిన అన్ని రొమాంటిక్ చాట్స్‌ని చదివింది. అందులో ”ఐ లవ్ యు”, ”నేను నిన్నే ఎప్పుడూ చూస్తూ ఉండాలనుకుంటున్నాను ” అనే మెసేజ్ లున్నాయి. అయితే తన భర్తకు బుద్ధి చెప్పాలని ఆమె ఆఫీసులో పనిచేసే ఇతరులందరికీ వారి మెసేజ్ లు, ఫొటోలు వాట్సాప్ ద్వారా పంపించింది. దీంతో లియు, చెన్ ఇద్దరి వివాహేతర సంబంధం గురించి అందరికీ తెలిసిపోయింది. దీంతో వారిద్దరికీ ఆఫీసులో ఇబ్బందులు తలెత్తాయి. మేనేజర్ వారిని పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. ఆఫీసులో ఒత్తిడి తట్టుకోలేక లియు కొన్ని రోజులు సెలవు పెట్టి వెళ్లిపోయాడు.

అయితే మరుసటి రోజు ఈ విషయం చెన్ భర్తకు కూడా తెలిసిపోయింది. అతను ఆఫీసు వద్దకు వచ్చి గొడవ చేశాడు. ఇది చాలదంటూ లియు, చెన్ ఇద్దరూ మళ్లీ బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం అందరూ చూశారు. దీంతో విషయం పెద్దదై కంపెనీ యజమాన్యం లియు, చెన్ ఇద్దరినీ ఉద్యోగం నుంచి తొలగించింది.

ఆ తరువాత లియు, చెన్ కంపెనీపై కేసు వేశారు. తమ వ్యక్తిగత జీవితంతో కంపెనీకి సంబంధం లేదని.. వారిని ఉద్యోగం నుంచి తొలగించడం కంపెనీ చేసిన తప్పు అని కోర్టులో వాదించారు. తమకు నష్టపరిహారంగా చైనా యుఆన్ 256000 (భారత కరెన్సీ రూ.30 లక్షలు) చెల్లించాలని డిమాండ్ చేశారు. లియు కంపెనీలో సీనియర్ పొజిషన్ లో ఉండడంతో నష్టపరిహారంగా రూ.27 లక్షలు, చెన్ రూ.3 లక్షలు డిమాండ్ చేసింది.

Also Read: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?

అయితే కంపెనీ తరుపున వాదించే లాయర్.. కంపెనీ నియమాలను కోర్టు ముందు ప్రవేశపెట్టాడు. కంపెనీ రూల్స్ ప్రకారం.. ఉద్యోగులు అనైతికంగా ప్రవర్తించినా, కంపెనీ పేరుని దిగజార్చినా వారిని ఉద్యోగం నుంచి తొలగించే హక్కు కంపెనీకి ఉంది. ఉద్యోగంలో చేరే సమయంలో ఇద్దరు ఉద్యోగులు కూడా ఈ నియమాలు కలిగిన అగ్రీమెంట్ పై సంతకం చేశారని చూపించాడు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు లియు, చెన్ పై మండిపడింది. వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా తమ తప్పుని సమర్థిస్తూ.. వాదించడం లేమిటని చెబుతూ కేసుని కొట్టి వేసింది.

Related News

Viral Video: డాక్టర్‌పై చెప్పులతో దాడి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Amazon Delivery After 2 Years: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Big Stories

×