EPAPER

Terror Attacks on Railways: రైల్వేలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారా? వరుస ప్రమాదాలకు కారణమేంటి?

Terror Attacks on Railways: రైల్వేలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారా? వరుస ప్రమాదాలకు కారణమేంటి?

ఫర్హతుల్లా ఘోరి.. ఇతను ముందుగా ఓ మత ప్రబోధకుడు.. తన ప్రవచనాలను ప్రజల మంచి కోసం కాకుండా.. ప్రజల ప్రాణాలను తీసేందుకు ఉసిగొల్పుతున్న వ్యక్తి.. ఇటీవల జరిగిన రామేశ్వరం కేఫ్‌ బ్లాస్ట్‌ మాస్టర్‌మైండ్‌.. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటూ ఇండియాలో చాప కింద నీరులా ఉగ్రవాదం విస్తరించేందుకు ప్లాన్‌ చేస్తున్న వ్యక్తి.. అలాంటి ఫర్హతుల్లా.. ఇటీవల ఓ వీడియో రిలీజ్ చేశాడు. అందులోని సారాంశం ఏంటంటే.. ఇండియాలో విధ్వంసం సృష్టించండి. భారీగా ఆస్తినష్టం జరగాలి.. ప్రాణనష్టం జరగాలి.. ఇందుకోసం ఇండియాలోని రవాణా వ్యవస్థలను టార్గెట్ చేసుకోండి. రైల్వే లైన్స్, పెట్రోల్ పైప్‌లైన్స్, లాజిస్టిక్‌ చైన్స్‌.. ఇలా వీటిపై దాడి చేయండి.. అంటూ తన అనుచరులకు నూరి పోస్తున్నారు ఈ ఘోరి.. ఇండియన్ గవర్నమెంట్‌ను షేక్ చేసి తీరుతామని ప్రతిజ్ఞ కూడా చేశాడు ఈ ఉగ్రవాది.

ఇప్పుడు మరో సీన్‌కి వద్దాం.. ఇండియాలో వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా వరకు చివరి నిమిషంలో మన అధికారుల అప్రమత్తతతో ఆగిపోతున్నాయి. ఉదాహరణకు.. ఆగస్టు 23, 24లో వందే భారత్‌ ట్రైన్‌ను డీ రైల్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత ఈ నెల 10న కాళింది ఎక్స్‌ప్రెస్ వెళ్తున్న సమయంలో అన్వర్‌గంజ్-కాస్‌గంజ్‌ రైల్వే లైన్‌లో ఏకంగా సిలిండర్‌ను ఉంచారు. ట్రైన్‌ ఫుల్ స్పీడ్‌లో ఉండటం.. ఎమర్జెన్సీ బ్రేక్స్ అప్లై చేసిన కంట్రోల్ కాకపోవడంతో ఆ సిలిండర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు. ఈ సీన్‌ మర్చిపోకముందే.. రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో గూడ్స్‌ రైల్‌ను డీరైల్ చేయడానికి ట్రై చేశారు. ట్రాక్‌పై ఓ సిమెంట్‌ బ్లాక్‌ను పెట్టారు.. ఇక్కడ కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు.


కాబట్టి.. ఈ సీన్స్‌ అన్నింటిని లింక్‌ చేస్తే.. ఇదంతా ఓ పక్కా ప్లాన్‌ ప్రకారం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇదంతా ఉగ్ర కుట్రలో భాగమే అని అర్థమవుతోంది. ఈ విషయాన్ని ఇప్పుడు ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్స్ కన్ఫామ్ చేస్తున్నాయి. ఇప్పటికే దీనిపై ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభమైంది. ఏకంగా 14 మందిని అరెస్ట్ చేశారు. వీరందరికి ఐసిస్ ఖొరాసన్‌ మాడ్యుల్‌తో లింక్స్ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అయితే ఇన్వెస్టిగేషన్‌లోకి ఎప్పుడైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ఎంటర్ అయ్యిందో.. అప్పుడు మరిన్ని విషయాలు తెలిశాయి. ఈ కేసులో అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, ముస్సావిర్ హుస్సేన్‌ షాజిబ్‌లను విచారించిన NIA చాలా కీలక విషయాలను తెలుసుకున్నట్టు తెలుస్తోంది. ఫర్హతుల్లా ఘోరి, అతని అల్లుడు షాహిద్ ఫైసల్ సౌత్ ఇండియాలో స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారని గుర్తించింది NIA.. కాబట్టి.. ఇప్పుడు ఈ దాడులన్ని పక్కా ప్లాన్‌ జరగుతున్నాయనే దానికి ఆధారాలు కూడా లభించినట్టైంది.

Also Read: ప్రధాని స్టయిల్.. సీజేఐ ఇంట్లో మోదీ.. ఆసక్తిగా గమనిస్తున్న విపక్షాలు..

ఈ పరిణామాలన్ని చూస్తుంటే.. ఉగ్రవాదులు తమ అటాక్‌ స్టైల్‌ను మార్చినట్టు కనిపిస్తోంది. ఒకప్పటిలా గన్స్‌ను ఉపయోగించకుండా.. కేవలం ఇలాంటి పనులు చేస్తూ ఎక్కువ ఆస్తి, ప్రాణ నష్టం కలిగించేలా ప్లాన్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఫర్హాతుల్లా ఘోరి.. అతని నెట్‌వర్క్‌పై ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. నిజానికి ఈ పేరు చాలా ఏళ్ల నుంచి మోస్ట్ వాంటెడ్‌ లిస్ట్‌లో ఉంది. 2002 గుజరాత్‌లోని అక్షర్‌ధామ్‌ టెంపుల్ అటాక్‌లో కూడా ఇతని పేరు ఉంది. ఆ ఘటనల్లో 30 మంది చనిపోగా.. 80 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత 2005లో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ ఆఫీస్‌లో జరిగిన సూసైడ్‌బాంబ్‌ కేసులో కూడా ఘోరి నిందితుడిగా ఉన్నాడు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. లెటెస్ట్‌గా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన పలువురు ఉగ్రవాదుల హ్యాండ్లర్‌ కూడా ఘోరి అని ఇన్వెస్టిగేషన్‌లో తేలింది.

ఇండియాలో అరాచకం సృష్టించాలని అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాయి పాక్ ఉగ్ర సంస్థలు.. వారి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతుండటంతో చివరికి ఇలా రైల్వేలను టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా.. ఇలా సైలెంట్‌గా ఉండి.. వయలెన్స్‌ను సృష్టించాలని చూస్తున్న టెర్రర్ నెట్‌వర్క్‌ భరతం పట్టేందుకు ప్లాన్‌ వేస్తున్నారు అధికారులు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×