EPAPER

ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌.. టీమిండియా, శ్రీలంక ఆటగాళ్లదే హవా!

ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌.. టీమిండియా, శ్రీలంక ఆటగాళ్లదే హవా!

India, Sri Lanka players rise in ICC Men’s Test Rankings: అంతర్జాతీయ క్రికెట్ బోర్డు(ఐసీసీట) టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ నంబర్ వన్ స్థానం దక్కింది. న్యూజిలాండ్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్ రెండో స్తానంలో కొనసాగుతుండగా.. డారిల్ మిచెల్ మూడో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.


ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు ర్యాంకులను మెరుగుపర్చుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ టాప్ 5లోకి అడుగుపెట్టాడు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లిలు ఒక్కో స్థానం మెరుగుపర్చుకున్నారు. తాజాగా, ర్యాంకింగ్స్‌లో ముగ్గురు వరుసగా.. 5, 6, 7 స్థానాలకు ఎగబాకారు. అలాగే ఉస్మాన్ ఖ్వాజా, మొహమ్మద్ రిజ్వాన్, మార్నస్ లబూషేన్ కూడా తలో స్థానం మెరుగుపర్చుకొని టాప్ 10లో కొనసాగుతున్నారు.

వీరితో పాటు శ్రీలంక ఆటగాళ్లు భారీగా ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సత్తా చాటిన లంక బ్యాటర్ ధనంజయ డిసిల్వ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని 13వ స్థానానికి చేరుకున్నాడు. ఇదే టెస్టు మ్యాచ్‌లో రాణించిన మెండిస్ 6 స్థానాలు మెరుగుపర్చుకుని 20వ స్థానానికి ఎగబాకారు. అలాగే ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసని పథుమ్ నిసాంక ఏకంగా 42 స్థానాలు మెరుగుపర్చుకొని 39వ స్థానానికి ఎగబాకాడు.


బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో ఉండగా..ఆస్ట్రేలియా స్టార్ పేసర్ హెజిల్ వుడ్, టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా టాప్ 3లో ఉన్నారు. కమిన్స్, రబాడ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఏడు, కుల్దీప్ 15 వ స్థానంలో ఉన్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్ లో లకం బౌలర్లు సత్తా చాటారు. మిలన్ రత్నాయకే 26, విశ్వ ఫెర్నాండో 13, లహీరు కుమార 10 స్థానాలు మెరుగుపర్చుకుని 85, 31, 32 స్థానాలకు ఎగబాకారు.

టెస్ట్ ఆల్ రౌండర్లలో తాజాగా, ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు ఏమీ లేవు. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ 6వ స్థానాన్ని కాపాడుకున్నాడు. ఈ జాబితాలో లంక ఆటగాడు మిలన్ రత్నాయకే 22 స్థానాలు మెరుగుపర్చుకొని 51వ స్థానానికి చేరాడు.

ఇదిలా ఉండగా, టీమిండియా గత 6 నెలలుగా టెస్ట్ ఫార్మాట్ ఆడలేదు. మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. బంగ్లాదేశ్ తో సొంతగడ్డపై సెప్టెంబర్ 19 నుంచి రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి టెస్ట్ కోసం ఇప్పటికే జట్టును ప్రకటించారు. తొలి టెస్ట్ సెప్టెంబర్ 19 నుంచి 23 మధ్య చెన్నై వేదికగా జరగనుంది. రెండో టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 27 అక్టోబర్ 1 మధ్య కాన్పూర్ వేదికగా జరగనుంది. ఈ టెస్ట్ సిరీస్ తో వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

Also Read: గిల్.. ఎంత పని చేశావ్? సారాని వదిలి.. అవనీత్ ని పట్టావా?

అయితే 6 నెలలుగా టీమిండియా టెస్ట్ ఫార్మాట్ ఆడలేదు. అయినా భారత ఆటగాళ్లు టాప్ 10లో తమ ర్యాంకులను పదిలంగా ఉంచుకున్నారు. ఇక, ఈ సిరీస్ అనంతరం భారత ఆటగాళ్లు మెరుగైన ర్యాంక్స్ సాధించే అవకాశం ఉంది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×