EPAPER

Horoscope 12 September 2024: ఈ రాశి వారికి ఆ విషయాల్లో నష్టాలు పక్కా! మరి మిగతా రాశుల వారి పరిస్థితి!

Horoscope 12 September 2024: ఈ రాశి వారికి ఆ విషయాల్లో నష్టాలు పక్కా! మరి మిగతా రాశుల వారి పరిస్థితి!

Astrology 12 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి నష్టాలు వచ్చే అవకాశం ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి లాభాలు అంతంతమాత్రమే ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకొవద్దు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలకు గురికావొచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. నవగ్రహ శ్లోకాలు పారాయణ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను సకాలంలో ఫూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులకు ప్రమోషన్స్, బదిలీలు ఉండవచ్చు. కోపాన్ని ప్రదర్శించవద్దు. చేపట్టిన పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి. ప్రయాణాలు అనుకూలం కాదు. దుర్గా నామాన్ని స్మరించాలి.


మిథునం:
మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను ఉత్సాహంగా పూర్తిచేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. అనుకున్న పనుల్లో విజయాలు వరిస్తాయి. వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆదిత్య హృదయం చదివితే బాగుంటుంది.

కర్కాటకం:
కర్కాటక రాశి వారికి శుభకరంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో బుద్ధి బలాన్ని పెట్టుబడిగా పెట్టి అధిక లాభాలు పొందుతారు. కలహాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. ఖర్చులను అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సంద్శన శుభప్రదం.

సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగులకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తిచేయడంతోపాటు కొత్త పనులు చేపడతారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఖర్చుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారంలో రాబడి ఉంటుంది. ప్రయాణాలు ఉంటాయి. జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

కన్య:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వృత్తి, వ్యాపారాల్లో సాధారణ ఫలితాలు ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. గిట్టని వారికి దూరంగా ఉండడం మంచిది. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సందర్శన మంచిది.

Also Read: కన్యా రాశిలోకి బుధుడు, శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. కీలక విషయాల్లో విజయం సిద్ధిస్తుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సమస్యలు తీరండంతో పాటు జీవితంలో ప్రశాంతత ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. బంధుమిత్రుల సహకారంతో కొత్త పనులు మొదలుపెడతారు. ప్రయాణాలు ఉంటాయి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం.

వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కొత్తగా వ్యాపారాలు మొదలుపెడతారు. మీ కృషికి తగిన ఫలితం ఉంటుంది. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా ఉంటారు. గొప్ప వ్యక్తులు నుంచి స్ఫూర్తి పొందుతారు. అందరితో మన్ననలు పొందుతారు. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. శివపంచాక్షరీ జపం మేలు చేస్తుంది.

ధనుస్సు:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. లేదంటే త్రీవ నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. హనుమాన్ చాలీసా పఠనం మేలు చేస్తుంది.

మకరం:
మకర రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో అనుకున్నంత లాభాలు రావు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేస్తే మంచిది. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం అంతంతమాత్రమే ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

కుంభం:
కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. రావాల్సిన బకాయిలు వసూలు అవుతాయి. కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు. ప్రభుత్వం నుంచి రుణాలు అందుకుంటారు. ఊహించని లాభాలు వస్తాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కోపం, చిరాకు వంటి వాటిని దరిచేరనీయవద్దు. గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగిపోతాయి.

మీనం:
మీన రాశి వారికి ఆశాజనకంగా లేదు. వృత్తి, వ్యాపార రంగాల్లో అభివృద్దికి సంబంధించిన వార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక ప్రశాంతత ఉండదు. కొన్ని సంఘటనలు ఉత్సాహపరుస్తాయి. కొత్త పాజెక్టులు కలిసివస్తాయి. ఊహించని ధనలాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

Related News

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Big Stories

×