EPAPER

HMD Budget UPI phone: స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ తో రూ.999కే మొబైల్ ఫోన్.. UPI పేమెంట్స్ కూడా చేయొచ్చు

HMD Budget UPI phone: స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ తో రూ.999కే మొబైల్ ఫోన్.. UPI పేమెంట్స్ కూడా చేయొచ్చు

HMD Budget UPI phone| ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఇండియా. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత దేశంలో అత్యధిక జనాభా ఉండడం ఇక్కడి ప్రజలు కూడా స్మార్ట్ ఫోన్ కు అలవాటు పడిపోవడంతో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ కనిపిస్తోంది. అయితే కొంతమంది బడ్జెట్ కారణంగా స్మార్ట్ ఫోన్ ని తక్కువగా ఉపయోగించే వారుంటారు. అలాంటి వారు ఒక మంచి ఫీచర్ ఫోన్ తీసుకోవడం ఉత్తమం. ఇలాంటి వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొనే MHD కంపెనీ రెండు ప్రత్యేక ఫీచర్ ఫోన్లు తీసుకొచ్చింది.


HMD 110, HMD 105 అనే రెండు ఫీచర్ ఫోన్లు కేవలం రూ.999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. పైగా ఈ ఫోన్లలో ఒక్కసారి చార్జింగ్ చేస్తే 18 రోజుల పాటు బ్యాటరీ పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. సీ పిన్ చార్జర్ ద్వారా చార్జింగ్ చేయొచ్చు.

ఈ రెండు ఫీచర్ ఫోన్లు జూ11, 2024 నుంచి అందుబాటులో ఉన్నాయి. వీటిలో HMD 110 ధర రూ.1119 కాగా, HMD 105 ధర రూ.999 మాత్రమే కావడం విశేషం. పైగా ఈ రెండు ఫీచర్ ఫోన్లలో స్మార్ట్ ఫోన్లలాగా యుపిఐ పేమెంట్ వెసలుబాటు కూడా ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ఫోన్ వెనుక భాగంలో ఉన్న కెమెరా తో యూపిఐ పేమెంట్ చేయడానికి QR కోడ్ స్కాన్ చేసి లావాదేవీలు చేయొచ్చు. ఈ రెండు ఫోన్ లలో కూడా మైక్రో ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ ఆప్షన్ ఉంది. రెండు ఫోన్లలో కూడా USB టైప్ సీ పోర్ట్ ఉంది. 3.5mm హెడ్ ఫోన్స్ జ్యాక్ కూడా ఇందులో ఉండడం మరో విశేషం.


Also Read: EPS pension Any Bank: ఈపిఎస్ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై దేశంలో ఏ బ్యాంకులో నుంచి అయినా పెన్షన్ డ్రా చేయొచ్చు!

ఈ రెండు ఫోన్లు.. కస్టమర్లు HMD వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. HMD 110 ఫీచర్ ఫోన్ బ్లాక్ అండ్ గ్రీన్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉండగా.. HMD 105 ఫీచర్ ఫోన్ బ్లాక్, బ్లూ బ్లాక్, బ్లూ పర్పల్ కలర్ వేరియంట్స్ లో లభిస్తున్నాయి. HMD 110, HMD 105 ఈ రెండు ప్రత్యేక ఫీచర్ ఫోన్లలో మల్టీమీడియా ఫీచర్ కూడా ఉంది.

MHD కంపెనీ ప్రకారం.. ఈ రెండు ఫీచర్ ఫోన్స్ లో 1,000mAh బ్యాటరీ ఉంది. అయితే HMD 105 లో డుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్ ఉండగా.. HMD 110 లో వెనుక భాగంలో కెమెరా సెన్సర్ ఉంది. ఈ రెండు ఫోన్లలో కూడా 23 రకాల భాషల ఆప్షన్స్ ఉన్నాయి. పైగా టూల్స్ విషయానికి వస్తే.. రెండు ఫోన్స్ లోనూ కాల్ రికార్డింగ్, ఎంపి3 ప్లేయర్, వైర్ లెస్ ఎఫ్ఎమ్ వంటి ఫీచర్స్ ఈ ఫోన్లలో ఉన్నాయి. వీటన్నితోపాటు వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఈ రెండు ఫోన్స్ లో ఉంది.

ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే ఈ రెండు ఫీచర్ ఫోన్స్ కేవలం 2G ఇంటర్నెట్ ని మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ సిమ్ కార్డ్ లు ఈ ఫోన్స్ లో పనిచేస్తాయి. కానీ జియో సిమ్ మాత్రం పనిచేయదు.

Also Read:  ట్రైన్ లేట్ అయితే మీ డబ్బులు ఫుల్ రిఫండ్.. షరతులు వర్తిస్తాయి!

నోకియా కంపెనీ క్లాసిక్ ఫోన్ల తయారీ లైసెన్స్ తీసుకొని అదే టెక్నాలజీతో MHD కంపెనీ ఈ ఫోన్లను తయారు చేసింది. ఇటీవలే Nokia 3210 రీలాంచ్ కూడా జరిగింది. త్వరలోనే అండ్రాయిడ్ స్మార్ట్ ఫఓన్స్ కూడా ఈ కంపెనీ మార్కెట్లో లాంచ్ చేయనుందని ప్రకటించింది.

Related News

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Big Stories

×