EPAPER

Dangerous Train Routes: ప్రపంచంలోనే డేంజరస్ రైల్వే మార్గాలు.. వెళ్తుంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

Dangerous Train Routes: ప్రపంచంలోనే డేంజరస్ రైల్వే మార్గాలు.. వెళ్తుంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

Dangerous Train Routes In The World: రైలు ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో సుదూర ప్రయణాలకు రైలు ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. ట్రైన్ జర్నీ ఎంతో ఉల్లాసం, ఉత్సాహాన్ని పంచుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్ది రైల్వే మార్గాలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రం చాలా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ రూట్ లో జర్నీ అత్యంత డేంజరస్. ప్రయాణం చేస్తుంటే ప్రాణాలో పోయిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ రైల్వే రూట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


 1. అర్గో గెడే ట్రైన్ రైల్‌రోడ్, ఇండోనేషియా

ప్రపంచంలో అత్యంత డేంజరస్ మార్గాలలో ఇది ఒకటి. ఇది ఇండోనేషియాలో ఉంది. జకార్తా నుంచి బాండుంగ్ ఈ రూట్ లో రైలు నడుస్తుంది. అత్యంత ప్రమాకరమైన చికుర్తుంగ్ పైలాన్ ట్రెస్టెల్ బ్రిడ్జి మీదుగా ఈ ట్రైన్ వెళ్తుంది. సముద్ర మట్టానికి చాలా మీటర్ల ఎత్తులో ఉండే ఈ వంతెన మీది నుంచి రైలు వెళ్తుంటే ప్రయాణీకులలో వణుకుపుడుతుంది. 2002లో ఈ వంతెన మీద రైలు పట్టాలు తప్పింది. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  ఈ మార్గంలో లోయలు, దట్టమైన అడవులు, చక్కటి ప్రకృతి అందాలు కనిపిస్తాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో వెళ్తే చక్కటి ఆహ్లాదాన్ని పొందవచ్చు.


2. బాంబో ట్రైన్స్, కంబోడియా

కంబోడియాలోని ఈ రైలు మార్గాన్ని ఫ్రెంచ్ వాళ్లు నిర్మించారు. ఆ తర్వాత బట్టంబాంగ్ లోని  కొన్ని ఉపయోగించని రైలు రూట్లలో చేతితో తయారు చేసిన వెదురు బొంగుల బండ్లను స్థానికులు రైలు పట్టాలపై నడిపిస్తున్నారు. మోటార్ సైకిల్ ఇంజిన్లతో నడిచే ఈ వెదురు బండ్లు చాలా ప్రమాదకరం అయినప్పటికీ, ప్రస్తుతం పర్యాటక ఆకర్షణగా ఉన్నాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ రూట్ లో జర్నీ చేస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది.

3. ఔటెనిక్వా చూ-ట్జో రైలు, దక్షిణాఫ్రికా

ఈ రైలు 1928లో ప్రారంభం అయ్యింది. దక్షిణాఫ్రికాలోని వెస్ట్రన్ కేప్‌లోని జార్జ్,  నైస్నా నెస్లే పట్టణాలను కలుపుతుంది. సుమారు 67 కి. మీ దూరం, 3 గంటల ప్రయాణం ఉంటుంది.మార్గ మధ్యమంలో నైస్నా నది మీది నుంచి వెళ్తుంది. ప్రస్తుతం ఈ రూట్ లో దక్షిణాఫ్రికాకు చెందిన ఓ కంపెనీ ప్రత్యేక రైలును నడుపుతుంది. ప్రతి ఏటా ఈ రూట్ లో లక్షా 15 వేల మంది ప్రయాణీకులు జర్నీ చేస్తున్నారు. వీరిలో 70 శాతం విదేశీ ప్రయాణీకులే కావడం విశేషం. సెప్టెంబర్ నుంచి నవంబర్, మార్చి నుంచి మే వరకు ఈ రూట్ లో జర్నీ చేస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

4. అసో మినామి రూట్, జపాన్

జపాన్ లోని అత్యంత ప్రమాదకరమైన రైల్వే రూట్లలో ఇదొకటి. మినామియాసోమ్ తకమోరి, టాటెనో స్టేషన్  మధ్య ఉన్న ఏకైక రైల్వే లైన్ ఇది. ఈ మార్గం మధ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతం మౌంట్ అసో ఉంటుంది. అగ్ని పర్వతాలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల గుండా రైలు ప్రయాణిస్తుంది. మార్చి నుంచి మే, సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది.

5. ది డెత్ రైల్వే, థాయ్ లాండ్

డెత్ రైల్వేని బర్మా రైల్వే అని కూడా పిలుస్తారు. ఇది థాయిలాండ్లోని రైల్వే లైన్. బాన్ పాంగ్- బర్మా మధ్య 415 కిలో మీటర్ల దూరం ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సైన్యం తరలింపునకు అనుకూలంగా ఉండేందుకు 1943లో జపాన్ చక్రవర్తి దీనిని నిర్మించాడు.  రైల్వే బ్యాంకాక్, బర్మా థాయ్‌లాండ్ ను కలుపుతూ ఈ రైల్వే ఉంటుంది. ఈ మార్గం క్వాయ్ నది, చుట్టుపక్కల ఉన్న అడవులు, అందమైన దృశ్యాల నడుమ వెళ్తుంది. ఈ ప్రాంతంలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు జర్నీ చేస్తే ప్రకృతిం అందాలను చూడవచ్చు.

6. చెన్నై- రామేశ్వరం రూట్, భారత్

సౌత్ ఇండియాలో చెన్నై-రామేశ్వరం రైలు మార్గం ఉంటుంది. 2.3 కిలోమీటర్ల దూరం సముద్రం మీది నుంచే ప్రయాణించాల్సి ఉంటుంది. సముద్రం పోటెత్తినప్పుడు, బలమైన ఈదురుగాలులు వీచినప్పుడు చాలా రైలు చాలా నెమ్మదిగా ప్రయాణిస్తుంది. ఆ సమయంలో జర్నీ చేసే ప్రయాణీకులు భయంతో వణుకుతారు.  సముద్రంపై నిర్మించిన ఈ వంతెనపై ఈ రైలు ప్రయాణం చేయాలంటే చాలా గుండె ధైర్యం అవసరం.

7. ట్రెన్ ఎ లాస్ న్యూబ్స్, అర్జెంటీనా

అర్జెంటినాలోని సాల్టా, చిలీలోని పోల్వోరిల్లో మధ్యన ఈ రైల్ రూట్ ఉంటుంది. సుమారు  217 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంటుంది. దీనిని ఏకంగా 27 ఏండ్ల పాటు నిర్మించారు. ఈ మార్గంలో రైలు ప్రయాణం చేస్తుంటే మేఘాల్లో తేలుతున్నట్లు అనిపిస్తుంది. సముద్రమట్టానికి ఏకంగా 4200 మీటర్ల ఎత్తులో ఈ రైలు మార్గం ఉండటం విశేషం. 217 కిలో మీటర్ల జర్నీకి ఏకంగా 16 గంటల సమయం పడుతుంది. జర్నీ మధ్యలో ఏకంగా 29 బ్రిడ్జిలు, 21 టన్నెల్స్ దాటాల్సి ఉంటుంది.

8. పిలాటస్ రైల్వే, స్విట్జర్లాండ్‌

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన రైల్వే మార్గాలలో ఇది ఒకటి. పర్వత మధ్యలో నుంచి సొరంగ ద్వారా రైళ్లు ప్రయాణిస్తాయి. సుమారు 2 వేల మీటర్ల ఎత్తులో 4.7 కిలో మీటర్ల పొడవున మౌంట్ పిలాటస్ నుంచి ప్రయాణిస్తుంది. ఈ రైలు మార్గం మౌంట్ పిలాటస్- అల్పాంచ్ రాష్ట్రాన్ని కలుపుతుంది. ఈ జర్నీలో రైలు సుమారు 1600 మీటర్లు నిటారుగా వెళ్లాల్సి ఉంటుంది.  ఆల్పైన్ పచ్చిక భూములు, అడవులు, రాతి కొండల నడుమ జర్నీ అత్యంత కనువిందుగా ఉంటుంది. మే నుంచి నవంబర్ వరకు జర్నీ చేయడం ఆహ్లాదంగా ఉంటుంది.

Also Read: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

9. మేక్లాంగ్ రైల్వే లైన్, థాయిలాండ్

ఈ రైల్వేలైన్ థాయ్ లాండ్ లోని ఇరుకైన వీధుల గుండా వెళ్తుంది. రైల్వై లైన్ కు ఇరువైపుల దుకాణాలు, ఇళ్లు ఉంటాయి. వాటి మధ్య నుంచి రైల్వే ట్రాక్ ఉంటుంది. రైలు ట్రాక్ మీద కూర్చొనే వ్యాపారులు తమ వస్తువులను విక్రయిస్తారు. రైలు రాగానే అందరూ తమ వస్తువులను తీసుకుని పక్కకు వెళ్తారు. రైలు వెళ్లగానే మళ్లీ ట్రాక్ మీదికి వచ్చి తమ వ్యాపారాలను కొనసాగిస్తారు.

10. ల్యాండ్‌వాసర్ వయాడక్ట్, స్విట్జర్లాండ్‌

స్విట్జర్లాండ్‌ లోని అత్యంత ప్రమాదకర రైలు మార్గంలో ల్యాండ్‌వాసర్ వయాడక్ట్ మార్గం ఒకటి. ఇది ల్యాండ్‌వాసర్ నదిపై నిర్మించబడింది.  కొండలో నుంచి సొరంగ మార్గం ద్వారా బయటకు సుమారు 65 మీటర్ల ఎత్తులో స్తంభాలపై నిర్మించిన రైల్వే లైను నుంచి వెళ్తుంది. సముద్ర మట్టానికి సుమారు 9200 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జి ఉండటం విశేషం.

Related News

Viral Video: డాక్టర్‌పై చెప్పులతో దాడి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Amazon Delivery After 2 Years: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Big Stories

×