EPAPER

Thalavan OTT Review: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఫ్యాన్స్.. ఇది మీకోసమే.. అస్సలు మిస్ కావొద్దు

Thalavan OTT Review: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఫ్యాన్స్.. ఇది మీకోసమే.. అస్సలు మిస్ కావొద్దు

Thalavan OTT Review: ఈ మధ్య మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులను తెగ మెప్పిస్తున్నాయి. అందుకు కారణం.. వారు చాలా రియలిస్టిక్ గా కథలను చూపిస్తారు. అనవసరమైన హంగు, ఆర్భాటాలు ఉండవు. హీరోల ఎలివేషన్స్ ఉండవు. ఇద్దరు హీరోలు కనిపిస్తే ఒకరు ఎక్కువ .. ఒకరు తక్కువ అనేది ఉండదు.  కథను చెప్పాలనుకొనే డైరెక్టర్.. ఆ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విధానం కూడా అలానే ఉంటుంది. కొద్దిగా స్లోగా ఉంటాయన్న మాటనే కానీ, ఈ మధ్య వచ్చే ప్రతి మలయాళ సినిమా  తెలుగులో మంచి విజయాలనే అందుకుంటున్నాయి.


ఇక దీంతో   తెలుగు ఓటీటీ మేకర్స్ ఏరికోరి.. ఆ సినిమాలకు డబ్బింగ్  చేసి తెలుగువారికి అందిస్తున్నారు. అలా   రిలీజ్ అయిన సినిమానే తలవన్.   మలయాళంలో ఛీప్, లీడర్ అని అర్ధం. తెలుగువారికి సుపరిచితుడైన బిజూ మీనన్ హీరోగా నటించాడు. అతనితో పాటు కుర్ర హీరో ఆసిఫ్ ఆలీ కూడా నటించిన ఈ సినిమాకు జిస్ జోయ్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది మేలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందకుంది. ఇక ఇప్పుడు సోనీలివ్ లో తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చింది. తలవన్ ఎలా ఉంది అనేది చూద్దాం.

కథ: కేరళలోని చేపనతోట  పోలీస్ స్టేషన్ లో  జయశంకర్( బిజూ మీనన్) సీఐగా పనిచేస్తూ ఉంటాడు. అతడు చాలా స్ట్రిక్ట్. ముఖ్యంగా అతని మాటను గౌరవించనివారంటే చాలా కోపం. ఇక అదే స్టేషన్ కు ఎస్ఐ గా  కార్తీక్(అసిఫ్ ఆలీ) వస్తాడు. అతడు  కుర్రాడు. ఉడుకుతనం ఎక్కువ. నిజాయితీగా పనిచేయడంతో ఏడాదిలో 5 ట్రాన్సఫర్లు అవుతాయి. చివరికి కొద్దిగా మారతాడు అని జయశంకర్ దగ్గరకు పంపిస్తారు అధికారులు. ఇక మూడు నెలల తరువాత ఒకరోజు సీఐ జయశంకర్ అరెస్ట్ చేసిన ఒక ఖైదీని.. కార్తీక్ వదిలేస్తాడు. దీనివలన వీరిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అది ఇగోగా మారుతుంది. ఇక ఆ సమయంలోనే సీఐ జయశంకర్ టెర్రస్ పై ఒక మహిళా శవం  కనిపిస్తుంది. అందరు  జయశంకర్ నే ఈ హత్య చేశాడని నమ్మడంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కార్తీక్ వద్దకు వస్తుంది . జయశంకర్ మీద ఉన్న పగతో కార్తీక్ ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా చేశాడు.. ? అసలు జయశంకర్ ఇంట్లో శవాన్ని పడేసింది ఎవరు.. ? కార్తీక్- జయశంకర్ మధ్య ఉన్న ఇగో వలన వారి జీవితాలు ఎలా మారాయి.. ? అనేది  సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


విశ్లేషణ:  సాధారణంగా పగ తీర్చుకొనేవారు రెండు రకాలు ఉంటారు. తమకు అన్యాయం జరిగింది అని తెలియగానే.. అదే ఫైర్ లో వెళ్లి పగ తీర్చుకుంటారు. కానీ, కొంతమంది ఆ పగ తీర్చుకోవడానికి అనువైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆ సమయం వచ్చిందా పులి పంజా విసిరినట్లు విసురుతారు. ఆ పంజా నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఈ కథ కూడా అలాంటిందే. సీఐ జయశంకర్ గతంలో చేసిన ఒక పని.. అతనిపై పగ పట్టిన  ఒక వ్యక్తి అదునుచూసి ఎలా  పంజా విసిరాడు  అనేది ఎంతో అద్భుతంగా చూపించారు.  మొదట  20 నిముషాలు చాలా స్లోగా నడిచినా.. ఇన్వెస్టిగేషన్ మొదలైనప్పటి నుంచి ఎంతో ఉత్కంఠ తెచ్చేలా ప్రేక్షకులను కుర్చోపెట్టడంలో డైరెక్టర్ సఫలమయ్యాడు.

ఇక ఇద్దరు పోలీసుల మధ్య ఉండే గొడవలను అడ్డం పెట్టుకొని.. మిగతా  పోలీసులు కూడా తమ పగను  తీర్చుకోవాలని చూసే తీరు  మనుషుల నైజాన్ని చూపించింది.  జయశంకర్ కోపధారి మనిషే కానీ, హత్య చేసేంత క్రూరుడు కాదు అని కార్తీక్ కు తెలుసు. అంతేకాకుండా తన మొదటి ఇన్వెస్టిగేషన్ కావడంతో.. నిజాలను బయటపెట్టడానికి అతడు తీసుకున్న చొరవ.. తన మీద నింద వేసినవారిని కనుక్కోవాలని జయశంకర్ పడే ఆత్రుతను బ్యాలెన్స్ గా చూపించారు. ఇక సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే.. చివరి 20 నిముషాలు మరో ఎత్తు. క్లైమాక్స్ ను అస్సలు ఊహించలేము. ఇన్వెస్టిగేషన్ లో నిందితుడు  ఒకరైతే.. చివరికి అసలు ఊహించని వ్యక్తి ఇదంతా చేశాడని చెప్పడం అది కూడా చాలా కన్విన్స్ గా చెప్పడం ఆకట్టుకుంటుంది. ఇక ఇదంతా జయశంకర్ పై అధికారి..  ఒక టీవీ షోలో చెప్పడంతో మొదలై.. అతడు చనిపోవడంతో ముగుస్తుంది. అంతేకాకుండా.. ఈ కేసులో ఇంకో నిందితుడు ఉన్నాడని చెప్పి, తలవన్ 2 కి హింట్ ఇచ్చారు.  క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఫ్యాన్స్ అయినా కూడా హంతకుడు ఎవరు అనేది కనుక్కోలేరు అని చెప్పొచ్చు.

నటీనటులు: సినిమా మొత్తం బిజూ మీనన్, అసిఫ్ ఆలీ మీదనే తిరుగుతుంటుంది. ఇద్దరు పోటాపోటీగా నటించారు.  క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో తమ సొంత పగలు చూసుకోకుండా నిజాయితీ వైపు నిలబడాలి అనే పోలీస్ గా అసిఫ్ నటన అదిరిపోయింది. ఇక బిజూ నటన  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగతావారందరు తమ పరిఫైమేరకు నటించారు. సినిమాకు మెయిన్ హైలైట్ అంటే మ్యూజిక్. దీపక్ దేవ్ ఇంటెన్సివ్ మ్యూజిక్ తో మరింత ఉత్కంఠను రేపాడు. అక్కడక్కడా చిన్న చిన్న లోపాలు ఉన్నా.. ఓవరాల్ గా  కుటుంబంతో కలిసి తలవన్ ను చూడొచ్చు.

ట్యాగ్ లైన్:  ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కు పర్ఫెక్ట్ ఛాయిస్

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×