Tecno భారతదేశంలో Tecno Pova 6 Neo 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ AI మ్యాజిక్ ఎరేజర్, AI కటౌట్, AI వాల్‌పేపర్, ఆర్ట్‌బోర్డ్, ఆస్క్ AI వంటి అనేక AI ఫీచర్లను అందించింది.

ఇది రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది.

అదే సమయంలో 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా కంపెనీ నిర్ణయించింది.

అలాగే దీనిపై పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. రూ.1000 బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాకుండా భారీ ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ కూడా పొందొచ్చు.

ఈ ఫోన్‌ను అమెజాన్‌తో పాటు సమీపంలోని రిటైల్ స్టోర్ల నుండి సెప్టెంబర్ 14 నుండి కొనుగోలు చేయవచ్చు.

ఇది మిడ్‌నైట్ షాడో, అజూర్ స్కై, అరోరా క్లౌడ్ వంటి కలర్ ఆప్షన్‌లలో రిలీజ్ అయింది.

ఈ స్మార్ట్‌ఫోన్ 3x ఇన్-సెన్సార్ జూమ్‌తో AI-బ్యాక్డ్ 108 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది.

అనేక AI ఫీచర్లతో వస్తుంది. 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

6nm MediaTek డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్ ఈ ఫోన్‌లో అందించబడింది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.