Actor Jeeva: కోలీవుడ్ హీరో జీవా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చెన్నై నుంచి సేలం వైపు ఆయన కారులో తన భార్యతో పాటు ప్రయాణిస్తుండగా కన్నియమూర్ వద్ద ఒక బైక్ ను తప్పించే ప్రయత్నంలో కారు పక్కనే ఉన్న బారికేడ్ ను ఢీ కొట్టింది.
ఇక ఈ ప్రమాదంలో జీవా, ఆయన భార్య సుప్రియ చిన్న చిన్న గాయాలతో బయటపడగా.. కారు నుజ్జు నుజ్జు అయ్యిందని తెలుస్తోంది. వెంటనే ఈ జంటను ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. ఇక తమిళ్ హీరో జీవా గురించి తెలుగువారికి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
రంగం సినిమాతో తెలుగువారికి దగ్గరయ్యిన జీవా.. ఆ తరువాత స్నేహితుడు లాంటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ ఏడాది యాత్ర 2 సినిమాతో మరింత చేరువ అయ్యాడు. జగన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహి వి రాఘవ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో జగన్ గా జీవా నటనకు మంచి మార్కులే పడ్డాయి. జీవాకు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.