EPAPER

HYDRA: ఇప్పటివరకు హైడ్రా ఎన్ని బిల్డింగ్లను కూల్చివేసిందో తెలుసా..?

HYDRA: ఇప్పటివరకు హైడ్రా ఎన్ని బిల్డింగ్లను కూల్చివేసిందో తెలుసా..?

HYDRA: గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో హైడ్రా దూకుడుగా ముందుకెళ్తున్నది. అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని కూల్చి వేస్తుంది. ఇప్పటివరకు కూల్చివేసిన నిర్మాణాల వివరాలను హైడ్రా తాజాగా వెల్లడించింది. ఆక్రమణదారుల నుంచి ఇప్పటివరకు వంద ఎకరాలకు పైగా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా స్పష్టం చేసింది. జూన్ 27 నుంచి 23 ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టినట్లు బుధవారం హైడ్రా అధికారికంగా తెలిపింది. ఇప్పటివరకు 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా వెల్లడించింది. మొత్తం 111.72 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు పేర్కొన్నది. రాజేంద్రనగర్ -45, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 42 నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా వివరించింది.


Also Read: కేసీఆర్ కు అంత సీన్ లేదు.. కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

కూల్చివేతలకు సంబంధించిన వివరాలను హైడ్రా తాజాగా ప్రభుత్వానికి నివేదిక రూపంలో తెలియజేసింది. ఆ నివేదికలో హైడ్రా పేర్కొన్న కూల్చివేతల వివరాలు ఇలా ఉన్నాయి. ‘గత రెండు నెలల నుంచి చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి నేలమట్టం. నగరంలోని జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నాం. రామ్ నగర్ మణెమ్మ గల్లీలో 3, అమీన్ పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, గగన్ పహాడ్ అప్పా చెరువులు 14, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13, మాదాపూర్ సున్నం చెరువులో 42 అక్రమ నిర్మాణాలను తొలగించాం. అదేవిధంగా అక్రమ నిర్మాణాలను తొలగించి మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాం. అత్యధికంగా అమీన్ పూర్ లో 51 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నాం’ అంటూ హైడ్రా ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నది.


Also Read: ఫ్యూచర్ సిటీ ముచ్చర్ల.. ఫ్యూచర్ ప్లాన్స్ ఇవే!

ఇదిలా ఉంటే.. హైడ్రాకు పీవీ రంగనాథ్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం హైడ్రాకు ప్రత్యేక పోలీస్ బలగాలను సైతం కేటాయించింది. 15 మంది సీఐ స్థాయి అధికారులను, 8 మంది ఎస్సై స్థాయి అధికారులను కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు రిలీజయ్యాయి. హైడ్రాకు ప్రత్యేకంగా కేటాయించిన ఈ పోలీస్ అధికారులు ఆక్రమణల కూల్చివేత కోసం పనిచేయనున్నారు. దీంతో హైడ్రా సేవలను మరింత వేగవంతం కానున్నాయి.

పలు ప్రాంతాల్లో హైడ్రా అక్రమ కట్టడాలను గుర్తించి, వాటిని కూల్చివేస్తున్న క్రమంలో పలువురు ఆందోళన చేశారు. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ.. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పటికే నిర్మాణాలు చేపట్టి, వాటిలో నివాసముంటున్నవాటిని కూల్చివేయమని చెప్పారు. కానీ నిర్మాణాలు చేపట్టి వాటిలో వాణిజ్యసముదాయాలుగా మార్చినట్లు గుర్తిస్తే వాటిని ఖచ్చితంగా కూల్చివేస్తామన్నారు. అదేవిధంగా కొత్తగా నిర్మాణాలు చేపట్టినా వాటిని కూల్చివేస్తామన్నారు.

Also Read: రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. వరదలపై సాయం కోసం..

హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైడ్రాపై తీవ్ర ఒత్తడి వస్తున్నదని, అయినా కూడా హైడ్రా విషయంలో వెనుకబడుగు వేయబోమంటూ ఆయన స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకునే హైడ్రాను ఏర్పాటు చేశామని, అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని కూల్చివేస్తున్నామంటూ సీఎం చెప్పారు. అక్రమ కట్టడాల వెనుక ఎవ్వరున్నా కూడా ఉపేక్షించబోయేదిలేదు.. వాటిని హైడ్రా కూల్చేస్తుంది అంటూ రేవంత్ రెడ్డి క్లారిటీ కూడా ఇచ్చారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×