EPAPER

Sunny Leone: అలాంటి పదాలు వాడొద్దు, వాటికోసమే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు.. మీడియాపై సన్నీ లియోన్ ఫైర్

Sunny Leone: అలాంటి పదాలు వాడొద్దు, వాటికోసమే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు.. మీడియాపై సన్నీ లియోన్ ఫైర్

Sunny Leone: కమర్షియల్ సినిమాలు అనగానే చాలామంది ప్రేక్షకులకు గుర్తొచ్చేది అందమైన హీరోయిన్స్, వారు చేసే ఐటెమ్ సాంగ్స్. అయితే కొన్నాళ్లుగా అలాంటి పాటలను ఐటెమ్ సాంగ్స్ అనడం కరెక్ట్ కాదని, స్పెషల్ సాంగ్స్ అనమని కొందరు నటీనటులు.. వాటిని ఖండించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో బిజీగా కాలాని గడుపుతున్న పలువురు హీరోయిన్లు.. ఐటెమ్ సాంగ్స్‌తోనే తమ కెరీర్లను స్టార్ట్ చేశారు. అలాంటి వారిలో సన్నీ లియోన్ ఒకరు. ఒకవైపు స్పెషల్ సాంగ్స్, మరోవైపు సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్న సన్నీ లియోన్.. తాజాగా తన మూవీ ప్రమోషన్స్ సమయంలో మీడియాపై ఫైర్ అయ్యింది.


మళ్లీ సినిమాల్లోకి

2014లో విడుదలయిన ‘రాగిని ఎమ్ఎమ్ఎస్ 2’ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో తనకంటూ ఒక గుర్తింపు సాధించుకుంది సన్నీ లియోన్. కానీ ఆ సినిమాలో హీరోయిన్‌గా కంటే అందులో తను చేసిన ‘బేబీ డాల్’ అనే స్పెషల్ సాంగ్‌తోనే తనకు ఎక్కువగా గుర్తింపు లభించింది. అలా వరుసగా తనకు బాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో స్టెప్పులేసే అవకాశం లభించింది. గత కొన్నాళ్లుగా సన్నీ లియోన్ సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఉండడం లేదు. సోషల్ మీడియాలో బ్రాండింగ్, పర్సనల్ లైఫ్‌తోనే బిజీ అయిపోయింది. ఇన్నాళ్ల తర్వాత ‘పెట్టా ర్యాప్’ అనే చిత్రంలో నటించింది సన్నీ. ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో మీడియాపై సీరియస్ అయ్యింది ఈ భామ.


Also Read: వైరల్ అవుతోన్న కూతురి ఫొటోలు.. స్పందించిన దీపికా

ఎంటర్‌టైన్మెంట్ కోసమే

ప్రభుదేవా, వేదిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘పేటా ర్యాప్’లో సన్నీ లియోన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం తాజాగా మేకర్స్ అంతా కేరళలోని కొచ్చికి వెళ్లారు. అక్కడ ఐటెమ్ సాంగ్స్ గురించి మీడియా మాట్లాడుతున్న తీరుపై సీరియస్ అయ్యింది సన్నీ లియోన్. ఐటెమ్ సాంగ్స్‌ గురించి ప్రస్తావించడం కోసం ఇబ్బందికరం అనే పదాన్ని ఉపయోగిస్తున్నారని చెప్పుకొచ్చింది. ‘‘మీడియానే ఇబ్బందికరం అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఎన్నో వేలమంది ప్రేక్షకులు ఇలాంటి సాంగ్స్ చూడడానికే థియేటర్లకు వస్తారు. ఇది ఇబ్బందికరం కాదు.. ఇవి కేవలం ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తాయి. ఆ ఎంటర్‌టైన్మెంట్‌ను ఆడియన్స్‌కు అందించడానికే మేము ఉన్నాం’’ అని గట్టిగా చెప్పింది సన్నీ.

సపోర్ట్ కావాలి

ఇబ్బందికరం అనే పదాన్ని ఉపయోగించడం మానేసి ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తే బాగుంటుందని మీడియాను కోరింది సన్నీ లియోన్. మీడియా సపోర్ట్ లేకపోతే తనలాంటి ఎంతోమంది ఆర్టిస్టులకు పని దొరకడం కష్టమయిపోతుందని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ప్రేక్షకుడు ఒక టికెట్ కొని సినిమా చూడడం మేకర్స్‌కు చాలా పెద్ద విషయం. బయటికొచ్చే ప్రతీ సినిమాకు మీ సపోర్ట్ కావాలని కోరింది సన్నీ లియోన్. ప్రస్తుతం సన్నీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఎస్‌జే శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెట్టా ర్యాప్’.. సెప్టెంబర్ 27న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇందులో వివేక్ ప్రసన్నా, భగవతి పెరుమాళ్, రమేశ్ తిలక్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×