EPAPER

Rahu Transit 2024: రాహువు సంచారం.. ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు

Rahu Transit 2024: రాహువు సంచారం.. ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు

Rahu Transit 2024: జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహువును ఛాయా గ్రహంగా పరిగణిస్తారు. రాహువు రాశి లేదా నక్షత్ర మార్పు ఖచ్చితంగా 12 రాశులను ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తుంది. రాహువు ప్రభావం వల్ల ఒక వ్యక్తి చెడు సాంగత్యం, కోపం, క్రూరత్వం, దురాశకు గురవుతాడు. రాహువు రాశి మార్పు అన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులను కలుగజేస్తుంది. ఛాయా గ్రహం అయిన రాహువు ఏ రాశిలోనైనా సుమారు ఒకటిన్నర సంవత్సరాలు అంటే 18 నెలల పాటు ఉంటాడు. ఎవరి జాతకంలోనైనా రాహువు స్థానం బాగుంటే వారు ఉన్నత స్థానంలో నిలుస్తారు. ఎవరి జాతకంలో రాహువు చెడు స్థానంలో ఉంటారో వారు అనేక కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.


దృక్ పంచాంగ్ ప్రకారం, రాహువు ప్రస్తుతం ఉత్తరాభాద్రపద రాశిలో సంచరిస్తున్నాడు. డిసెంబర్ 2 వరకు ఈ రాశిలోనే సంచరిస్తాడు. ఫలితంగా అప్పటి వరకు రాహువు యొక్క రాశిలో మార్పు 12 రాశులలో ప్రతి ఒక్కరి జీవితాలు ఏదో ఒక విధంగా ప్రభావితం అవుతాయి. మరి ఉత్తరాభాద్రపద నక్షత్రంలో రాహువు సంచారం ఏ రాశుల వారి జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు వృషభ రాశిలో పదకొండవ ఇంట్లో సంచరిస్తున్నాడు. రాహువు యొక్క రాశి మార్పు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాహువు సంచారం వృషభ రాశి వారికి అన్ని రంగాలలో విజయాన్ని కలిగిస్తుంది. అలాగే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా త్వరలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారు ఊహించని ధనాన్ని పొందుతారు. మీరు మీ సీనియర్స్ నుంచి మద్దతు పొందుతారు. అలాగే రాహువు ప్రభావం వల్ల మీ కోరికలన్నీ అతి త్వరలోనే నెరవేరుతాయి. కొత్త పనులు చేపట్టే ముందు జాగ్రత్తలు వహించడం మంచిది.ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరుగుతాయి.


కన్య రాశి:
జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహువు యొక్క నక్షత్ర మార్పు కన్య రాశి వారికి సమస్యలు తెచ్చిపెడుతుంది. కన్య రాశి వారి జీవితాల్లో జరుగుతున్న సమస్యలన్నీ పెరిగే అవకాశం ఉంది. అహంకారంతో మీరు తీసుకున్న నిర్ణయాలు సమస్యలను తెచ్చి పెడతాయి. ఆఫీసుల్లో సీనియర్ల నుంచి మద్దతు పెరుగుతుంది. అనుకోని ఖర్చులు చాలా పెరుగుతాయి. కొత్త పనులు ఈ సమయంలో ప్రారంభించకపోతేనే మంచిది. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్తారు. వైవాహిక జీవితంలో సమస్యలు పెరిగేందుకు అవకాశం ఉంది.

Also Read: ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. ఇలా చేయండి

కుంభ రాశి:
ఈ రాశి వారికి రాహువు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి రాహువు ప్రవేశించడం వల్ల మీ జీవితంలో పెద్ద మార్పు కనిపిస్తుంది.ఎందుకంటే ఈ రాశిలో రాహువు ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. అటువంటి పరిస్థితిలో, కుంభ రాశి ఉన్నవారు ఏ పనిలోనైనా రెట్టింపు ప్రయోజనం పొందుతారు. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ త్వరగా పూర్తి చేస్తారు. కానీ కుటుంబంలో సంతోషం కనుమరుగవుతుంది. కుటుంబ సమేతంగా ఏదో ఒక తీర్థయాత్రకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. దీనితో పాటు, మీ భౌతిక సుఖాలు కూడా పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు తీసుకునే నిర్ణయాలను ఆలోచించి తీసుకోవడం మంచిది. ఆఫీసుల్లో అధికారుల వైపు నుంచి సమస్యలు పెరుగుతాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Big Stories

×