EPAPER

Vegetarian Foods With Omega 3 Fatty Acids: శాఖాహారులకు గుండెపోటు, పక్షవాతం రాకుండా కాపాడే ఫుడ్స్ ఇవే..

Vegetarian Foods With Omega 3 Fatty Acids: శాఖాహారులకు గుండెపోటు, పక్షవాతం రాకుండా కాపాడే ఫుడ్స్ ఇవే..

Vegetarian Foods With Omega 3 Fatty Acids| మానవ శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గల పోషకాహారం చాలా అవసరం. గుండె బలంగా ఉండాలన్నా, మెదడు చురుకుగా పని చేయాలన్నా.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలన్నా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా చేప, ఇతర మాంసాహార పదార్థాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పోషకాలు ఉంటాయి. అయితే శాఖాహారులకు కూడా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. నిత్యం తీసుకునే ఆహారంతో పాటు కాస్త ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఐటెమ్స్ కూడా జోడిస్తే.. అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం.


ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల కలిగే 5 లాభాలు:

గుండె ఆరోగ్యానికి బలం: ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండడంతోపాటు రక్తంలో ట్రైగ్లిసిరైడ్స్ ఉన్న కొవ్వు శాతాన్ని తగ్గిస్తాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె పోటు, ఇతర గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు నివారించవచ్చు.


మెదడులో చురుదనం: ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల మెదడు వికాసం సరైన క్రమంలో జరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అల్జీమర్స్, డిమెన్షియా వంటి మెదడు, నరాల సంబంధిత రోగాలు నివారించవచ్చు.

శరీరంలో వాపుని తగ్గిస్తుంది: ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఇన్‌ఫ్లమెటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శరీరంలో ఏదైనా భాగంలో గాయమైనా, లేదా వాపు వచ్చినా.. ఆ ప్రాంతం త్వరగా సాధారణ స్థాయికి చేరుకుంటుంది. ఎముకల బలహీనత, రోగ నిరోధక శక్తి తగ్గుదల వంటి సమస్యలు రాకుండా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ నివారిస్తాయి.

డిప్రెషన్ కు దూరం: ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న పోషకాహారం నిత్యం తినే వారు డిప్రెషన్ కు, ఆందోళనకు దూరంగా ఉంటారని మానసికంగా చాలా చురుకుగా ఉంటారని పలు ఆధ్యయనాల్లో తేలింది.

కంటి ఆరోగ్యం: ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆహారం తినడం వల్ల కళ్లలోని రెటీనా ఆరోగ్యంగా ఉంటుందని, వయసు పై బడినా కంటిచూపు తగ్గడం వంటి సమస్యలు నివారించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

Also Read: చిన్న వయసులోనే డయాబెటీస్ రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!

శాఖాహారుల కోసం ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం పదార్థాలు:

1. చియా సీడ్స్ : చియ సీడ్స్ లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో

2. ఫ్లాక్స్ సీడ్స్ : ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తోపాటు ఫైబర్, లిగ్ నాన్స్, యాంటి ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు ఫ్లాక్స్ సీడ్స్ లో ఉంటాయి. అయితే ఈ గింజలను పౌడర్ గా చేసుకొని ఆహారంగా తీసుకోవాలి. నేరుగా గింజలనే తింటే వాటివల్ల ఏ ఉపయోగం ఉండదు.

3. వాల్ నట్స్ : వాల్ నట్స్ అంటే అందరికీ ఇష్టమే. మంచి రుచికరమైన డ్రై ఫ్రూట్. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ డ్రై ఫూట్ లో విటమిన్ ఈ కూడా ఉంటుంది. ఇవి తినడం వల్ల గుండె సమస్యలను నివారించవచ్చు. ప్రతి రోజు నాలుగు లేదా అయిదు వాల్ నట్స్ తినడం ఉత్తమం.

4. హెంప్ సీడ్స్ : ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉంటాయి. మంచి ప్రొటీన్, మినరల్స్, విటమిన్స్ కలిగి ఉంటాయి. పెరుగు, సలాడ్స్, స్మూతీస్ డ్రింక్స్ లో వీటిని గార్నిష్ చేయొచ్చు.

5. అవకాడో : వెన్నె టేస్ట్ కలిగిన అవకాడో పండులో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలతో పాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం, ఫైబర్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.

6. ఆకుకూరలు: స్పినాచ్, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్ లాంటి తాజా ఆకుకూరల్లో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కానీ చిన్న మొత్తంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి.

7. టోఫు, సోయ్ బీన్స్: ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ టోఫు, సోయ్ బీన్స్ లాంటి ఆహార పదార్థాల్లో కూడా ఉంటాయి. ఇవి తినడం వల్ల శరీరానికి అదనంగా ఫైబర్, ఐరన్, కాల్షియం పోషకాలు లభిస్తాయి.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×