EPAPER

IAF Officer Rape: సీనియర్ అధికారిపై రేప్ కేసు పెట్టిన మహిళా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్!

IAF Officer Rape: సీనియర్ అధికారిపై రేప్ కేసు పెట్టిన మహిళా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్!

IAF Officer Rape| దేశంలో మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాల కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూ ఉంది. తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (భారతీయ వాయు సైన్యం) సీనియర్ అధికారి పై రేప్ కేసు నమోదైంది. అయితే తనపై అత్యాచారం చేశాడని కేసు పెట్టిన మహిళ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కావడం గమనార్హం. ఈ ఘటన జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో జరిగింది. జమ్మూ కశ్మీర్ లోని బుడ్గామ్ పోలీస్ స్టేషన్ లో ఆ మహిళా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ తన పై అత్యాచారం జరిగిందని ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే బాధితురాలు, నిందితుడు.. ఇద్దరూ వాయు సైన్య అధికారులు శ్రీనగర్ కు చెందిన వారే.


బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్ ఫోర్స్ తో వింగ్ కమాండర్ స్థాయి ఆఫీసర్ అయిన తన సీనియర్ అధికారి.. గత రెండేళ్లుగా చిత్రహింసలు పెడుతున్నాడని, లైంగికంగా, మానకంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఈ విషయం బయట పెడితే తన కెరీర్ ఏం జరుగుతుందోనని భయంతో ఇన్నాళ్లు చెప్పలేదని తెలిపింది.

”డిసెంబర్ 31, 2023 రాత్రి.. శ్రీ నగర్ లోని ఆఫీసర్స్ మెస్ లో న్యూ ఇయర్ పార్టీ జరుగుతున్నప్పుడు అతను నా వద్దకు వచ్చి నీకు గిఫ్ట్ అందిందా?.. అని అడిగాడు. నేను నా కేమీ గిఫ్ట్ లభించలేదు అని చెప్పగానే.. అయితే సరే నాతో రా.. ఆ గదిలో స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి. అని చెప్పి నన్ను తనతో తీసుకెళ్లాడు. అయితే అక్కడ ఎటువటి గిఫ్ట్స్ లేవు, ఎవరూ లేరు.! నన్ను అసభ్యంగా గట్టిగా పట్టుకున్నాడు. ఓరల్ శృంగారం చేయమని నన్ను బలవంతం చేశాడు. నేను వదిలేయమని ఎంత ప్రాధేయపడినా? వద్దలేదు. చివరికి అతడికి తోసేసి అక్కడి నుంచి పారిపోయాను. అయినా నా వెంట బయటకు వచ్చి శుక్రవారం తన కుటుంబమంతా వెళ్లిపోతుందని అప్పుడు తనను ఏకాంతంలో కలవాలని అడిగాడు.” అని ఒక ఘటనను మీడియాకు వివరించింది.


Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

ఇలాంటి ఘటనలు చాలాసార్లు జరిగాయని.. ఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత మళ్లీ జనవరి మొదటి వారంలో తన ఆఫీస్ లోకి ఆ సీనియర్ అధికారి వచ్చి మళ్లీ తన చేయి గట్టిగా పట్టుకుని లాగాడని చెప్పింది. తన సహచరులతో తన సమస్యల గురించి చెబితే.. అందరూ మౌనంగా ఉండాలనే సూచించారని తెలిపింది. తనకు ఇంకా వివాహం కాలేదని.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎంతో కష్టపడి ఉద్యోగం పొందానని చెబుతూ తాను మానసికంగా ఎంతో క్షోభ అనుభవించానని చెప్పింది. ఇద్దరు మహిళా ఆఫీసర్లు తన సమస్య గురించి తెలుసుకొని ఒక కల్నల్ ర్యాంక్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారని వెల్లడించింది.

అయితే తాను ఫిర్యాదు చేసిన తరువాత ఒక కల్నల్ ర్యాంక్ ఆఫీసర్ ఆధ్వర్యంలో విచారణ జరిగిందని.. అయితే రెండు సార్లు విచారణ కోసం పిలిచి ఆ సీనియర్ అధికారితో మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోమని చెప్పారని.. ఇది విని తనకు ఆశ్చర్యం కలిగిందని తెలిపింది. ఆ తరువాత విచారణ ఇంతవరకు ముందుకు సాగలేదని చెప్పింది.

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!

అయినా తాను పట్టువదలకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంటర్నల్ కమిటీకి రెండు నెలల తరువాత మార్చి నెలలో ఫిర్యాదు చేశానని వెల్లడించింది. అయితే ఇంటర్నల్ కమిటీలో ఉన్న సభ్యులందరూ నిందితుడికి సన్నిహితంగా ఉన్నవారే కావడంతో అక్కడ కూడా న్యాయం జరగకపోవడంతో తాను నిరాశతో కనీసం తనకు కొన్ని రోజులు సెలవు ఇవ్వాలని లేదా ట్రాన్స్ ఫర్ చేయమని అడిగినా.. అది కూడా చేయలేదని చెప్పింది. పైగా విచారణ పూర్తి చేయకుండానే మే నెలలో కేసు కొట్టేశారని తెలిపింది.

మానసికంగా తాను కంగిపోతున్నాని చెబుతూ.. తనలాగే మరికొందరు మహిళా ఆఫీసర్లు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని.. అందుకే న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించానని చెప్పింది.

ఈ కేసులో పోలీసులు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంటర్నల్ కమిటీతో సంప్రదించారు. ఇంటర్నల్ కమిటీ సభ్యలు కేసులో అని విధాలా సహకరిస్తామని చెప్పారు. విచారణ సాగుతోందని పోలీసులు తెలిపారు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×