EPAPER

Telangana: మీ ప్లానింగ్ బాగుంది.. తెలంగాణ ప్రభుత్వంపై ఆర్థిక సంఘం ప్రశంసలు

Telangana: మీ ప్లానింగ్ బాగుంది.. తెలంగాణ ప్రభుత్వంపై ఆర్థిక సంఘం ప్రశంసలు

ఫిస్కల్ ఫెడరలిజంతోనే ఫ్యూచర్..


– రాష్ట్రాల బాగుతోనే దేశ ప్రగతి
– రాష్ట్ర రుణభారం కుంగదీస్తోంది
– ఆదాయంలో సింహభాగం బాకీలకే
– రుణాల రీస్ట్రక్చర్‌కు ఓ ఛాన్సివ్వండి
– నేటి యంగెస్ట్ స్టేట్.. రేపటి ఫ్యూచర్ స్టేట్
– కేంద్ర నిధుల్లో వాటాలు పెంచాలి
– ట్రిలియన్ డాలర్ ఎకానమీ దిశగా రాష్ట్రం
– 9 నెలల్లోనే హామీలు అమలుచేసి చూపాం
– ఆర్థిక సంఘం సమావేశంలో సీఎం రేవంత్

Finance Commission: తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రణాళికలు బాగున్నాయని 16 వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు అరవింద్ పనగారియా ప్రశంసించారు. మంగళవారం సీఎం నేతృత్వంలోని టీంతో మీటింగ్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోని చాలా రాష్ట్రాలు పట్టణాభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నాయని, కానీ, తెలంగాణ ప్రభుత్వం దీనికి తగిన ప్రాధాన్యతను ఇస్తోందని అభిప్రాయపడ్డారు. రుణాల రీ స్ట్రక్చరింగ్ లేదా అదనపు రుణాలకు అవకాశం ఇవ్వాలని, సెస్, సర్‌చార్జీల్లోనూ వాటా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందన్నారు. మంచిపని తీరు కనబరిచిన రాష్ట్రాలకు కేంద్ర నిధుల విషయంలో నష్టం జరుగుతోందని, దీనికి బదులు తమకు ప్రోత్సాహకం అందించాలని తెలంగాణ కోరిందని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం ఇలాంటి రాష్ట్రాలకు డివిజబుల్ పూల్‌లోని 1 శాతం నిధులివ్వాలని సిఫారసు చేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వంతో బాటు పలు పార్టీల ప్రతినిధుల నుంచీ తాము సలహాలు, సూచనలు స్వీకరించామని పనగారియా వివరించారు. తమ కమిషన్ సిఫార్సులను కేంద్రం పరిగణలోకి తీసుకుంటుంది తప్ప వాటిని విధిగా అమలు చేయమని తాము కేంద్రాన్ని ప్రశ్నించే అవకాశం లేదన్నారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీలు సిఫార్సు చేస్తామని తెలిపారు.


ప్రగతిశీల ఆర్థిక విధానాలతో మంచి వృద్ధిని నమోదు చేస్తున్న రాష్ట్రమైన తెలంగాణకు తగినంత సాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు. మంగళవారం ఉదయం ప్రజా భవన్‌లో నిర్వహిస్తున్న 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తగిన వనరులు, బలమైన ఆర్థిక పునాదులున్నప్పటికీ, మితిమీరిన రుణభారం వల్ల రాష్ట్రం అనుకున్నంత వేగంగా ఆర్థిక వృద్ధిని సాధించలేకపోతోందని, ఈ విషయంలో ఫైనాన్స్ కమిషన్ అందించగలిగితే, దేశంలోనే తెలంగాణ ప్రబల ఆర్థిక శక్తిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. మన రాజ్యాంగం ప్రవచించిన సమాఖ్యభావనను ఆర్థిక రంగంలోనూ అమలు చేయాలని, రాష్ట్రాలు ఆర్థికంగా బలపడితేనే దేశం ముందుకు పోతుందని సీఎం వివరించారు.

ఫ్యూచర్ స్టేట్..
దేశంలో యంగెస్ట్ స్టేట్ అయిన తెలంగాణ.. నేడు మెరుగైన వృద్ధిరేటును నమోదుచేస్తోందని ముఖ్యమంత్రి ఆర్థిక సంఘానికి వివరించారు. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని అందుకే దీనిని ఫ్యూచర్ స్టేట్‌గా గుర్తింపు వస్తోందన్నారు. అనేక ప్రకృతి వనరులు, ప్రగతిశీల ఆర్థిక విధానాలు, బహుళత్వపు విలువలు గత తెలంగాణ ఆర్థిక ప్రగతిని మరింత పుంజుకునేందుకు కీలక రంగాల మీద తమ ప్రభుత్వం దృష్టి సారించిందని ముఖ్యమంత్రి తెలిపారు.

Also Read: MB University: కలెక్షన్ కింగ్.. ఫీజులేమైనా కలెక్షన్లా? మోహన్‌ బాబు బాగోతం బట్టబయలు!

కుంగదీస్తున్న రుణభారం..
తెలంగాణకు బలమైన ఆర్థిక మూలాలున్నప్పటికీ గత పదేళ్ల కాలంలో నాటి ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా రుణభారం రూ. 6.85 లక్షల కోట్లకు చేరిందన్నారు. ఇందులో బడ్జెట్ రుణాలతో బాటు ఆఫ్ బడ్జెట్ రుణాలూ ఉన్నాయని వివరించారు. ఖజానాకు వస్తున్న ఆదాయంలో సింహభాగం పాత అప్పుల మీద వడ్డీలు, కిస్తీల వారీగా అసలు చెల్లిస్తూ రుణభారాన్ని అదుపుచేసేందుకు తమ ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తోందన్నారు. ఈ బకాయిలు ఎప్పటికప్పుడు తీర్చకపోతే రుణభారం మరింత పెరిగి, అది రాష్ట్ర పురోగతిని దెబ్బతీసే ప్రమాదముందని వివరించారు. తెలంగాణకు ఇప్పుడున్న రుణాలను రీ స్ట్రక్చర్ చేసే అవకాశం లేదా అదనపు ఆర్ధిక సహాయాన్ని అందించేలా చూడాలని ఆర్థిక సంఘాన్ని సీఎం రేవంత్ కోరారు.

వాటా పెంచండి..
అదే సమయంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను ఇప్పుడున్న 41% నుంచి 50%కి పెంచాలని, ఇది కేవలం తెలంగాణ సమస్య మాత్రమే కాదనీ, ప్రతి రాష్ట్రం దీనిని కోరుకుంటోందన్నారు. రాష్ట్రాల వాటాను పెంచితే.. మన ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని వివరించారు. దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని, తాము తెలంగాణను ఒక ట్రిలియన్ ఎకానమీగా మార్చాలని ప్రయత్నిస్తున్నామని సీఎం తెలిపారు. కేంద్రం నుంచి తగిన సహాయం లభిస్తే.. తెలంగాణ ప్రగతి వేగవంతమవుతుందని, ఇది పరోక్షంగా ప్రపంచపు మూడవ ఆర్థిక శక్తిగా భారత్ నిలవటంలో దోహదపడుతుందని సీఎం వివరించారు.

Also Read: Devara Trailer: ‘దేవర’ ట్రైలర్ వేరే లెవెల్.. గూస్‌బంప్స్ వచ్చాయంతే

ఇదీ మా ప్రగతి
తమ ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే ప్రభుత్వ పాఠశాల పర్యవేక్షణ బాధ్యతను ఆదర్శ కమిటీలకు అప్పగించిందని, ఈ కమిటీల్లో డ్వాక్రా సంఘాల మహిళలను భాగస్వాములను చేసిందని దీనివల్ల మంచి ఫలితాలను పొందుతున్నామని వివరించారు. గ్రామీణ మహిళలను పేదరికం నుంచి బయటపడేసి, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏటా వడ్డీ లేని రుణాల కింద రూ. 20 వేల కోట్లు అందిస్తున్నామని, రూ. 5 వేల కోట్లతో అక్షరాస్యతను పెంచేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించామని, టాటా సంస్థ భాగస్వామ్యంతో 65 ఐటిఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించి వారకి హెల్త్ కార్డులివ్వటం ద్వారా ఆరోగ్యంపై వారు వెచ్చించే ఖర్చును తగ్గించే యత్నం చేస్తున్నామన్నారు. రేషన్ కార్డులు, పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు కనీస ఆహార భద్రతతో బాటు సాధికారతను అందించాలని పనిచేస్తున్నట్లు తెలిపారు.

ఆ రూల్స్‌తో తలనొప్పులు..
పదేళ్ల వయసున్న రాష్ట్రమైన తెలంగాణ సమాజంలోని ఆర్థిక అసమానతలకు పలు చారిత్రక కారణాలున్నాయని, నాడు ఈ అసమానతల కారణంగానే ఇక్కడ ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్ వచ్చిందన్నారు. ఈ అసమానతలు తగ్గాలంటే ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడి ఉన్నవారి కోసం సంక్షేమ బడ్జెట్ మరింత పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవరేఖ లాంటివని, వీటవల్ల ప్రజలకు ఆర్థిక భరోసా, సామాజిక భద్రత చేకూరతాయన్నారు. కేంద్ర పథకాల విషయంలో నిబంధనలు కఠినంగా ఉన్నాయని, అందుకే రాష్ట్రాలు వాటిని వినియోగించుకోలేకపోతున్నాయని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా కేంద్రపథకాల రూపకల్పన లేదా వాటిని తగిన విధంగా మార్చుకునే వెసులుబాటు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరముందని ఆయన నొక్కి చెప్పారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతూ, ఒక కీలక దశలో ఉందని, ఈ దశలో కేంద్రం మరింత ఉదారంగా సాయం అందిస్తే దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఎదుగుతుందన్నారు. కేంద్రం వసూలు చేసే సెస్‌లు, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణలో పేదలు, పెద్దల మధ్య గల అంతరాలను తగ్గిస్తున్నామని చెప్పుకొచ్చారు.

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×