EPAPER

This Week Releases: ఈవారం సినిమాల సందడి – థియేటర్లలో మాత్రమే కాదు.. ఓటీటీలో కూడా ఎంటర్‌టైన్మెంట్ ఫుల్

This Week Releases: ఈవారం సినిమాల సందడి – థియేటర్లలో మాత్రమే కాదు.. ఓటీటీలో కూడా ఎంటర్‌టైన్మెంట్ ఫుల్

This Week Releases: ఈవారం థియేటర్లలో కంటే ఓటీటీలో సినిమాల సందడి ఎక్కువగా ఉండనుంది. థియేటర్లలో మాత్రం ఒక మలయాళ డబ్బింగ్ చిత్రంతో పాటు రెండు చిన్న బడ్జెట్ చిత్రాలు సందడి చేయనున్నాయి. దాదాపు ప్రతీ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో అరడజను సినిమాలు సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.


డబ్బింగ్ చిత్రం

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మలయాళ చిత్రాలకు ఉన్న క్రేజే వేరే. ఆ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తెలుగులో భారీ ఎత్తున విడుదల అవుతున్న మలయాళ డబ్బింగ్ చిత్రం ‘ఏ.ఆర్.ఎమ్’ (ARM). ‘2018’ ఫేమ్ టోవినో థామస్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ పీరియాడిక్ డ్రామాగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. సెప్టెంబర్ 12న ‘ఏ.ఆర్.ఎమ్’ థియేటర్లలో సందడి చేయనుంది.


బ్లాక్‌బస్టర్ సీక్వెల్

కొన్నేళ్ల క్రితం విడుదలయిన ‘మత్తు వదలరా’ మూవీ సైలెంట్‌గా వచ్చి ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘మత్తు వదలరా 2’ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. ఇప్పటికీ ఈ సీక్వెల్‌కు సంబంధించిన టీజర్, ట్రైలర్.. అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో శ్రీసింహా కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్ చేశారు. సెప్టెంబర్ 13న ‘మత్తు వదలరా 2’ విడుదలకు సిద్ధమయ్యింది.

బ్యాక్ టు బ్యాక్

యంగ్ హీరో రాజ్ తరుణ్ కొన్నాళ్ల క్రితం వరకు వెండితెరకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తున్నాడు. ఇప్పటికే తనకు సంబంధించిన రెండు చిత్రాలు వెంటవెంటనే విడుదల కాగా అదే ఫ్లోలో మూడో చిత్రం కూడా వచ్చేస్తోంది. అదే ‘భలే ఉన్నాడే’. శివసాయి వర్ధన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీ.. సెప్టెంబర్ 7నే విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల పోస్ట్‌పోన్ అయ్యింది. ఫైనల్‌గా సెప్టెంబర్ 13న రిలీజ్‌కు సిద్ధమయ్యింది.

ఓటీటీ చిత్రాలు

సోనీ లివ్‌లో ఈవారం కేవలం ఒక్క మూవీ మాత్రమే స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యింది. అదే ‘తలవన్’. ఈ మలయాళ మూవీ సెప్టెంబర్ 10 నుండే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్

ఛాంపియన్స్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబర్ 10
ఆయ్ (తెలుగు సినిమా) – సెప్టెంబర్ 12
ఎమిలీ ఇన్ ప్యారిస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – సెప్టెంబర్ 12
సెక్టర్ 36 (హిందీ సినిమా) – సెప్టెంబర్ 12
ఇన్‌టూ ది ఫైర్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబర్ 12
అగ్లీస్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబర్ 13
ఆడిషన్ ప్రాజెక్ట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – సెప్టెంబర్ 13
ఆఫీసర్ బ్లాక్ బెల్ట్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబర్ 13
గిఫ్టెడ్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబర్ 15
మిస్టర్ బచ్చన్ (తెలుగు సినిమా) – సెప్టెంబర్ 12

జీ5

బెర్లిస్ (హిందీ సినిమా) – సెప్టెంబర్ 13
నునాకుజి (తెలుగు సినిమా) – సెప్టెంబర్ 13
రఘు తాత (తెలుగు సినిమా) – సెప్టెంబర్ 13

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ది ఛావెజ్ (స్పానిష్ సినిమా) – సెప్టెంబర్ 11
రీబిల్ట్ ది గ్యాలక్సీ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబర్ 13
సియోల్ బస్టర్స్ (కొరియన్ సినిమా) – సెప్టెంబర్ 13
గోలీసోడా (తమిళ సినిమా) – సెప్టెంబర్ 13

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×