EPAPER

Rahul Gandhi: ‘మిస్టర్ మోదీ’ని ద్వేషించను.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rahul Gandhi: ‘మిస్టర్ మోదీ’ని ద్వేషించను.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rahul Gandhi attacks BJP, RSS again in US: అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిజీబిజీగా ఉంటున్నారు. తాజాగా, వాషింగ్టన్ డీసీలోని ప్రతిష్టాత్మక జార్జ్ టౌన్ యూనివర్సిటీలో జరిగిన సమావేశానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ మేరకు విద్యార్థులతో జరిగిన చిట్ చాట్ మీటింగ్‌లో రాహుల్ మాట్లాడారు. వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోదీ అంటే ద్వేషం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


నిజం చెబితే అందరూ ఆశ్చర్యపోతారని, ఆయనపై నాకు ఎలాంటి ద్వేషం లేదని చెప్పుకొచ్చారు. ఎన్నోసార్లు ఆయన తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు అర్థం చేసుకుంటానని చెప్పారు. అయితే, ఆయన అభిప్రాయాలు వేరని, వాటితో నేను ఏకీభవించలేనన్నారు. అంతేకానీ నాకు ఆయనపై ఎలాంటి ద్వేషం లేదని, శత్రువుగా చూడటం లేదని వెల్లడించారు.

ప్రధానిగా మోదీ చేసే పనులు అర్థం చేసుకుంటున్నా.. కానీ ఆ పనులతో ఎలాంటి మంచి జరుగుతుందని నేను భావించడం లేదన్నారు. అందుకే మా ఇద్దరివి విభిన్న దృక్పథాలు అంటూ వివరించాడు. వాస్తవానికి చాలా సందర్భాల్లో మోదీని సానుభూతిగా చూస్తామని, శత్రువు కాదన్నారు. కాగా, రాహుల్ గాంధీ మూడు రోజులుగా అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.


అనంతరం సార్వత్రిక ఎన్నికలపై విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు పారదర్శకంగా జరగలేదన్నారు. ఒకవేళ ఎన్నికలు పారదర్శకంగా జరిగి ఉంటే బీజేపీకి 240 సీట్లు ఎలా వస్తాయని, అందుకే నేను పారద్శకంగా జరిగి ఉంటాయని భావించడం లేదన్నారు. బీజేపీకి ఆర్థికంగా అండ ఉందని, అందుకే ఎన్నికల సంఘం సైతం అనుకూలంగా వ్యవహరించదని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికలు జరగక ముందు కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికలకు ముందే మా నేతలకు నిధులు ఇచ్చేందుకు డబ్బు లేకుండా చేశారని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన నెలకొందని, విశ్వాసం లేకుండా చేశారన్నారు. ఈ సమయంలో ఏమైనా జరగనివ్వండి అని చెప్పానన్నారు. 2004 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ జరగలేదని వెల్లడించారు.

అలాగే రిజర్వేషన్ల అంశంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా పారదర్శక అవకాశాలు లభించే పరిస్థితులు వచ్చిన తర్వాతే రిజర్వేషన్ల రద్దుపై తమ పార్టీ ఆలోచిస్తుందన్నారు. భారత్‌లో ప్రస్తుతం ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదన్నారు. అభివృద్ధిలో ఇప్పటికీ న్యాయం జరగడం లేదని, అందరి భాగస్వామ్యం ఉండాలన్నారు. ఎప్పుడైతే అందరికీ సముచిత స్థానం కల్పింస్తారో అప్పుడే రిజర్వేషన్ గురించి మాట్లాడడం సమంజసమన్నారు.

అంతకుముందు, వర్జీనియాలో ప్రవాస భారతీయులతో రాహుల్ ముచ్చటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. మీడియా, దర్యాప్తు ఏజెన్సీలతో ప్రజలను భయాందోళనకు గురిచేశారన్నారు. కానీ ఎన్నికల తర్వాత ప్రజల్లో బీజేపీ అంటే భయం పోయిందని వ్యాఖ్యలు చేశారు.

కాగా, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అమెరికాలో దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని మాట్లాడడం ఏంటని మండిపడుతున్నారు. మన దేశం పరువు తీసేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీంతోపాటు వాషింగ్టన్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ పలువురు చట్టసభ్యులు, సీనియర్ అధికారులతో సమావేశం కానున్నారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×