EPAPER

Vande bharat train: సికింద్రాబాద్ నుంచి మరో వందేభారత్ ట్రైన్.. పీఎం మోదీ స్కెచ్ మామూలుగా లేదుగా..

Vande bharat train: సికింద్రాబాద్ నుంచి మరో వందేభారత్ ట్రైన్.. పీఎం మోదీ స్కెచ్ మామూలుగా లేదుగా..

Vande bharat train: రైల్వే విషయంలో మోదీ సర్కార్ తెలివిగా వ్యవహరిస్తోందా? కొత్త రైళ్లపై బడ్జెట్‌లో ఏ మాత్రం నోరు మెదపకుండా సైలెంట్‌గా ఎందుకుంది? కేవలం వందేభారత్ రైళ్లపై ఫోకస్ చేసిందా? ఆదాయం పెంచడం కోసమే ఈ రైళ్లను మోదీ సర్కార్ ప్రవేశపెట్టిందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది మోదీ పాలన. దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని ఓ వైపు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ప్రజల ఆదాయాలు పెంచాల్సిన ప్రభుత్వం .. కేవలం ఖరీదైన రైళ్లపైనే ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది.

ALSO READ: ఎమ్మెల్యేల అనర్హత ఇష్యూ.. కేసీఆర్ హ్యాపీగా లేరా? ఆ విషయం ముందే తెలుసా?


ఆదాయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు మోదీ సర్కార్. గడిచిన పదేళ్లలో కొత్త రైళ్ల మాటేమోగానీ.. కేవలం వందే భారత్ రైళ్లకు మాత్రమే పచ్చజెండా ఊపారు. దేశవ్యాప్తంగా ఈ తరహా రైళ్లను ప్రవేశ పెట్టారు. వీటి టారిఫ్ కూడా అదే రేంజ్‌లో ఉందనుకోండి. కానీ ప్రజల ఆదాయం మాత్రం అంతంత మాత్రమే.

సెప్టెంబర్ 15న మరో 10 రైళ్లను వర్చువల్ పద్దతిలో జెండా ఊపనున్నారు ప్రధాని నరేంద్రమోదీ. 10 రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 10 రైళ్లను ప్రారంభించనున్నారు. అందులో తెలంగాణ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వరకు ఒక రైలు ఉంది.

సికింద్రాబాద్‌లో ఉదయం ఐదు గంటలకు బయలు దేరి మధ్యాహ్నం 12.15 గంటలకు నాగపూర్‌కు చేరుకోనుంది. అదే రైలు నాగపూర్‌లో మధ్యాహ్నం  ఒంటి గంటకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు సికింద్రాబాద్‌కు రానుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య 578 కిలోమీటర్లు కాగా, కేవలం ఏడున్నర గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. కాజీపేట, రామగుండం, చంద్రాపూర్, సేవాగ్రామ్‌లో మాత్రమే ఆగనుంది.

ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి బెంగుళూరుకు మాత్రమే వందేభారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా సికింద్రాబాద్ నుంచి నాగ్ పూర్ వరకు కొత్త రైలు రానుంది.

ఏపీలోని విశాఖ నుంచి మరో వందే భారత్ రైలును అందుబాటులోకి రానున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒడిశాలోని దుర్గ్-విశాఖపట్నం మధ్య నడననుంది. ఉదయం 6 గంటలకు దుర్గ్‌లో బయలుదేరి మధ్యాహ్నం 1.55 గంటలకు విశాఖపట్నం చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి రాత్రి 10.50 గంటలకు దుర్గ్‌కు వెళ్తనుంది.

టాటానగర్-పాట్నా, వారణాసి-డియోఘర్, టాటానగర్-బ్రహ్మాపూర్, రాంచీ-గొడ్డ, ఆగ్రా-బనారస్, హౌరా-గయా, హౌరా-భాగల్‌పూర్, దుర్గ్-విశాఖపట్నం, హుబ్లీ-సికింద్రాబాద్, పూణె-నాగపూర్ ప్రాంతాల రైళ్లను ఆదివారం ప్రారంభించనున్నారు ప్రధాని. కొత్త రైళ్ల జాబితాలో జార్ఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్, యూపీ వంటి రాష్ట్రాలున్నాయి.

ఈ కొత్త రైళ్ల ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగు పడుతుందని మోదీ సర్కార్ చెబుతోంది. ప్రయాణ మౌలిక సదుపాయాలను పెరుగుతాయని అంటోంది. కీలక నగరాలకు ఆయా రైళ్లను అనుసంధానం చేయడం ద్వారా లక్షలాది మంది ప్రయాణికుల ట్రావెలింగ్ మరింత సులభం కానుంది.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×