EPAPER

Rishabh Pant: టెస్టులో పంత్ రీ ఎంట్రీ.. గంగూలీ ఏమన్నారంటే?

Rishabh Pant: టెస్టులో పంత్ రీ ఎంట్రీ.. గంగూలీ ఏమన్నారంటే?

Rishabh Pant will be an all-time great in Tests: బంగ్లాదేశ్, భారత్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ మేరకు సెప్టెంబర్ 19 నుంచి 23 మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఉంది. అయితే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌తోనే స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్ట్‌ల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు.


బంగ్లాదేశ్ సిరీస్‌తో పంత్ రీ ఎంట్రీ ఇవ్వడంపై భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్పందించాడు. భారత్‌లోని అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మెన్‌లలో రిషబ్ పంత్ ఒకడని నేను భావిస్తున్నానని తెలిపాడు. అతడు తిరిగి జట్టులోకి వచ్చినందుకు ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. పంత్ టెస్టు మ్యాచ్‌ల్లో భారత్ తరఫున ఆడుతూనే ఉంటాడని, ఇలాగే ఆడితే టెస్టుల్లో ఆల్ టైమ్ గ్రేట్ అవుతాడని ప్రశంసలు కురిపించారు.

కానీ, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడు మరింత మెరుగవ్వాలని, అతడు తనకున్న ప్రతిభతో కచ్చితంగా తర్వాతి కాలంలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా నిలుస్తాడని భావిస్తున్నానని గంగూలీ చెప్పుకొచ్చాడు.


Also Read: ఇలాగైతే కష్టమే అనుకుంటా.. గిల్

ఇదిలా ఉండగా, దాదాపు 20 నెలల విరామం తర్వాత పంత్ టెస్టుల్లో ఆడనున్నాడు. అంతకుముందు 2022 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌పైనే చివరిగా పంత్ టెస్టుల్లో ఆడాడు. అదే నెల 30న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో రెండేళ్లు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్‌తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన పంత్.. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియాలోనే ఉండడం విశేషం.

Related News

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Big Stories

×