ముఖం అందంగా కనిపించడం కోసం చాలా మంది రకరకాల పదార్థాలను వాడుతూ ఉంటారు.

కానీ కొన్ని రకాల పదార్థాలను ముఖంపై నేరుగా అప్లై చేయకపోవడం మంచిది.

వీటిని ముఖంపై ఉపయోగించడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. అంతే కాకుండా ఉన్న అందం పాడవుతుంది.

నిమ్మరసం: కొంతమంది నిమ్మరసాన్ని ముఖానికి నేరుగా అప్లై చేస్తూ ఉంటారు. దీని వల్ల ఎంతో హాని కలుగుతుంది.

నిమ్మరసాన్ని వేరే పదార్థాలతో కలిపి ఫేస్‌పై అప్లై చేసుకుంటే.. పర్లేదు కానీ ముఖానికి నేరుగా అప్లై చేయకూడదు.

ఆవాల నూనె: ముఖానికి ఆవాల నూనెను కొందరు వాడుతుంటారు. కానీ దీంతో కలిగే ప్రయోజనాల కంటే ప్రతికూలతలే ఎక్కువ.

ముఖానికి ఆవాల నూనె అప్లై చేస్తే చర్మం నల్లగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ముఖంపై నేరుగా అప్లై చేయకూడదు.

వెల్లుల్లి: తీని వల్ల ముఖానికి దద్దుర్లు, ఎలర్జీ, వాపులు వస్తాయి. అందుకే వెల్లుల్లిని నేరుగా ముఖానికి అప్లై చేయకూడదు.

ఉప్పు : దీనిని నేరుగా ముఖానికి వాడటం చాలా హానికరం.

ఉప్పుతో స్క్రబ్ చేయడం లేదా ఉప్పు నీటిని ముఖానికి ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారుతుంది.

బేకింగ్ సోడా: చర్మంపై నేరుగా బేకింగ్ సోడాను ఉపయోగించకూడదు.

బేకింగ్ సోడా ముఖంపై అప్లై చేయడం వల్ల చర్మంపై  మొటిమలు, మచ్చల సమస్య పెరుగుతుంది