టెక్ బ్రాండ్ రియల్‌మి తాజాగా realme NARZO 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది.

ఈ స్మార్ట్‌ఫోన్ టర్బో ఎల్లో, టర్బో గ్రీన్, టర్బో పర్పుల్ కలర్‌లలో అందుబాటులోకి వచ్చింది.

ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 6GB + 128GB వేరియంట్ ప్రారంభ ధర రూ. 16999గా ఉంది.

అదే సమయంలో దీని మిడ్ రేంజ్ 8GB + 128GB వేరియంట్ ధర రూ.17,999గా ఉంది.

అలాగే దీని టాప్ రేంజ్ 12GB + 256GB వేరియంట్ ధర రూ. 20,999గా కంపెనీ నిర్ణయించింది.

ఈ ఫోన్‌ సేల్ సెప్టెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటల నుండి realme.com, Amazon.in సహా ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులోకి రానుంది.

మొదటి సేల్‌లో కంపెనీ ఫ్లాట్ రూ.2000 కూపన్ డిస్కౌంట్ అందిస్తోంది. అప్పుడు ఇది మరింత తక్కువ ధరకే లభిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌‌తో వచ్చింది

ఫోన్ MediaTek డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది.

ఫోన్‌లో 50 MP ప్రధాన కెమెరా సెన్సార్ ఉంది. దానితో పాటు 2 MP పోర్ట్రెయిట్ లెన్స్ అందించబడింది.

ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ, వీడియో కాలింగ్‌ల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించబడింది.