EPAPER

KCR Latest News: తప్పు తెలుసుకున్న కేసీఆర్.. వాళ్ళతో చర్చలకు సిద్ధం

KCR Latest News: తప్పు తెలుసుకున్న కేసీఆర్.. వాళ్ళతో చర్చలకు సిద్ధం

సిద్దిపేట జిల్లా గజ్వేలు నియోజకవర్గంలోని ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ తాజాగా చండీ హోమాన్ని నిర్వహించారు. ఈ చండీహోమంలో కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది పార్టీ నాయకులు, నేతలు పాల్గొన్నారు. బడ్జెట్​ ప్రవేశపెట్టిన రోజు సభకు హాజరైన కేసీఆర్.. ఇక ప్రజా క్షేత్రంలో కనిపించలేదు. ఆ తర్వాత కుమార్తె కవిత తిహార్​ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎర్రవెల్లిలో ఆమెను కలిసినప్పుడు తిరిగి వార్తల్లోకెక్కారు.

ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం చేపట్టేటప్పుడు యాగాలు, పూజలు నిర్వహించే కేసీఆర్.. స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నారంట. అందుకే యాగం నిర్వహించారని చెప్తున్నారు . బీఆర్ఎస్‌ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి పార్టీ అనుబంధ కమిటీలు, సభ్యత్వ నమోదుపై ఫోకస్ పెట్టబోతున్నారంట. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్న ఆయన. అందులో భాగంగానే తెలంగాణ భవన్ లో పార్టీ జిల్లా అధ్యక్షులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వస్తారంటున్నారు.


త్వరలోనే కేసీఆర్ ప్రోగ్రాంకు సంబంధించి షెడ్యూల్ వెలువడుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి … రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై జిల్లా పార్టీ అధ్యక్షులతో సుధీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిసింది. తెలంగాణను సాధించిన ఉద్యమపార్టీగా టీఆర్ఎస్‌కు ప్రజల్లో ఆదరణ కనిపించింది. ఆ ఆదరణతోనే వరుసగా 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందాక గతేడాది జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైంది. పదేళ్లు పార్టీపై ఫోకస్ పెట్టకపోవడం, గ్రామస్థాయి నుంచి బలోపేతానికి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఓటమి పాలైనట్లు గులాబీ బాస్ భావిస్తున్నారంట.

పార్టీ గ్రామకమిటీలతో పాటు అనుబంధ కమిటీలను వేసి కేడర్‌ని యాక్టివ్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్‌కు 60లక్షల సభ్యత్వం ఉందని ప్రకటించుకున్నప్పటికీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించలేదు. దాంతో గ్రామస్థాయిలో సభ్యత్వ నమోదు చేయడంతో పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికే బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు అప్పగిస్తే నష్టం జరుగుతుందని మొదటి నుంచి పనిచేస్తున్నవారికి కమిటీల్లో ప్రథమ ప్రయార్టీ ఇవ్వాలని భావిస్తున్నట్లు సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.

Also Read: రూ.30 కోట్ల చేనేత రుణ మాఫీకి సీఎం హామీ.. ఎలక్షన్స్‌లో సెలక్షన్స్, కలెక్షన్స్ అంటూ బీఆర్ఎస్‌పై రేవంత్ ఫైర్

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు చెప్తున్నారు. గతంలో ఉద్యమకారులకు పార్టీలో గుర్తింపు ఇవ్వలేదనే ఆరోపణలు వచ్చాయి. అలాంటి వారికి ఈసారి పార్టీ వేసే కమిటీల్లో ప్రాధాన్యత ఇచ్చి ప్రజల్లో, పార్టీ నేతల్లో ఉన్న అపోహలకు చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారంట. ప్రస్తుతం ఉన్న పార్టీ అనుబంధ కమిటీలన్నీ రద్దు చేస్తారంట. అనుబంధ కమిటీలన్నీ యాక్టీవ్ గా పనిచేయకపోవడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలోనూ వెనుకబడటంపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారంట.

పార్టీ రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధ కమిటీలకు నూతన కార్యవర్గాలు ప్రకటించడానికి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారంట. ఇప్పటివరకు జిల్లాల్లో పార్టీకి అధ్యక్షుడు ఒక్కరే ఉన్నారు … పార్టీలో పనిచేస్తున్న సీనియర్లంతా కమిటీల్లో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. పార్టీలో గుర్తింపు కోసం ఏళ్లతరబడి ఎదురు చూస్తున్నారు. వారందరికీ కమిటీల్లో అవకాశం కల్పించాలని, పార్టీ కార్యక్రమాలను స్పీడ్ పెంచాలని పార్టీ అధ్యక్షుడు ఫిక్స్ అయ్యారంట

పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులతోనూ సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. త్వరలోనే సదరు తేదీలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ సమావేశంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాలు, కేడర్ ను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన ప్రణాళికలపై చర్చించి అందుకు అనుగుణంగా కార్యచరణను ప్రకటిస్తారంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, దీంతో ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయిందని, మరోవైపు ఆ పార్టీల్లోనే గ్రూపులు ఏర్పడ్డాయని ఇదే అదునుగా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

మొత్తమ్మీద త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సైతం అందుకు సన్నద్దమవుతుంది. స్థానిక సంస్థల్లో సత్తా చాటుకోవడానికి కేసీఆర్‌తో సభలు, సమావేశాలు నిర్వహించాలా? లేకుంటే రోడ్డుషోలు నిర్వహించాలా అనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మరి చూడాలి స్లో అయిపోయిన కారుని గులాబీబాస్ ఎలా పరుగులు పెట్టిస్తారో.

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×