EPAPER

CM Revanth Reddy: రూ.30 కోట్ల చేనేత రుణ మాఫీకి సీఎం హామీ.. ఎలక్షన్స్‌లో సెలక్షన్స్, కలెక్షన్స్ అంటూ బీఆర్ఎస్‌పై రేవంత్ ఫైర్

CM Revanth Reddy: రూ.30 కోట్ల చేనేత రుణ మాఫీకి సీఎం హామీ.. ఎలక్షన్స్‌లో సెలక్షన్స్, కలెక్షన్స్ అంటూ బీఆర్ఎస్‌పై రేవంత్ ఫైర్

CM Revanthreddy comments: చేనేత రుణభారం 30 కోట్ల రూపాయలను తీర్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. కుల, చేతి వృత్తులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులున్నారని, ఆయా సంఘాల మహిళలకు ఏటా రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.


సోమవారం హైదరాబాద్ లలితా కళాతోరణంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని వర్చువల్‌గా ప్రారంభించారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా చేనేత అభయహస్తం లోగోలను ఆవిష్కరించారు.

ALSO READ:  సరదాలో విషాదం.. టైరు పేలి లోయలోపడిన కారు, ఆ తర్వాత..


ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. ఒకప్పుడు తెలంగాణ విద్యార్థులు హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సు కోసం పొరుగునున్న ఏపీ, ఒడిషాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నా రు. గడిచిన ప్రభుత్వం పదేళ్లుగా అధికారంలో ఉన్నా ఏ మాత్రం చర్యలు తీసుకోలేదన్నారు.

ఈ అంశం మా దృష్టికి వచ్చిన వెంటనే కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు సీఎం. కేసీఆర్ కార్యాలయం ఏర్పాటుకు కొండా లక్ష్మణ్ బాపూజీ భూమి ఇచ్చారన్నారు. తెలంగాణ కోసం కొందరు పదవులు వదులుకున్నారని, కానీ కొంతమంది రాజీనామా చేసిమళ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలు తెచ్చారని గుర్తు చేశారు.

ఆ ఎన్నికల్లో సెలక్షన్లు, కలెక్షన్లు చేసి త్యాగం చేశామని చెప్పుకుంటున్నారని విమర్శించారు సీఎం రేవంత్. గజ్వేల్‌లో ఫామ్ హౌస్ లు ఏర్పాటు చేసుకున్నారని గుర్తు చేశారు. కొండా లక్షణ్ బాపూజీని తెలంగాణ ఎప్పుడూ గుర్తుస్తుందని, ఐఐహెచ్‌టీకి ఆయన పేరు పెడతామన్నారు.

వచ్చే ఏడాది నుంచి స్కిల్స్ యూనివర్సిటీలో ఐఐహెచ్‌టీ భవనం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఆర్భాటం, సినీ తారల తళుకు బెళుకులు తప్పా, నేతన్న ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి లేదన్నారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలను చెల్లించకుండా ఆలస్యం చేసిందని, తాము బకాయిలు చెల్లించి.. రాజకీయాలకు అతీతంగా సిరిసిల్ల కార్మికులను ఆదుకున్నామని వెల్లడించారు.

నేత కార్మికుల కళ్లలో ఆనందం చూసేందుకు రూ.290 కోట్ల బకాయిలు విడుదల చేశామన్నారు. రైతన్న ఎంత ముఖ్యమో.. నేతన్న కూడా మాకు అంతే ముఖ్యమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఐఐహెచ్‌టీ విద్యార్థులకు నెలకు రూ. 2500 ప్రోత్సాహకం అందించారు ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

Related News

Hydra: హైడ్రా భయం.. అటువైపు చూడని కస్టమర్లు.. టార్గెట్ లేక్ వ్యూ భవనాలా?

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Big Stories

×