Kannappa Movie Update: దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలోని స్టార్లను తీసుకొని ఒక సినిమాతో కలిపాడు టాలీవుడ్ హీరో మంచు విష్ణు. శివభక్తుడు అయిన కన్నప్ప జీవితకథ ఆధారంగా మంచు విష్ణు నిర్మిస్తూ నటిస్తున్న చిత్రమే ‘కన్నప్ప’. ఈ మూవీని ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని నిర్ణయించుకున్న విష్ణు కేవలం సౌత్ నుండి మాత్రమే కాదు.. బాలీవుడ్ నుండి కూడా స్టార్లను ఈ ప్రాజెక్ట్ కోసం రంగంలోకి దించాడు. ఇప్పటికే ఈ మూవీలో నటించిన స్టార్లు అందరితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హైప్ క్రియేట్ చేశాడు. తాజాగా ‘కన్నప్ప’ నుండి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ ఫోకస్ అంతా ఈ మూవీపైనే ఉంది.
మిస్టరీ వీడింది
‘కన్నప్ప’ మూవీలో టైటిల్ పాత్రలో, భక్త కన్నప్పగా మంచు విష్ణు కనిపించనున్నాడు. ఇతర దేవుళ్ల పాత్రల కోసం, మరికొన్ని కీలక పాత్రల కోసం పలువురు స్టార్లను ఎంపిక చేశాడు విష్ణు. అంతే కాకుండా వారి కాల్ షీట్స్ సంపాదించి బ్యాక్ టు బ్యాక్ అందరితో షూటింగ్ కూడా పూర్తిచేశాడు. ప్రమోషన్స్‌లో భాగంగా టీజర్ కూడా విడుదల చేశాడు. ఈ ఈవెంట్‌కు మూవీలో నటించిన దాదాపు అందరు హీరోలను పిలిచాడు. అలా మెల్లగా ‘కన్నప్ప’పై ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా ఈ మూవీలో ప్రభాస్ ఉండడం సినిమాకే పెద్ద ప్లస్‌గా మారనుంది. ఇక ‘కన్నప్ప’లో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి అనే మిస్టరీ ఫైనల్‌గా వీడింది.
Also Read: అలాంటి వ్యక్తితో రిలేషన్ కరెక్ట్ కాదనిపించింది, అప్పుడే నా హృదయం ముక్కలయ్యింది – తమన్నా
ప్రభాస్ కాదు
ముందుగా ‘కన్నప్ప’లో శివుడి పాత్ర చేయడం కోసం ప్రభాస్‌ను కాంటాక్ట్ అయ్యాడు మంచు విష్ణు. ఈ విషయం బయటికి రావడంతో ఈ మూవీలో ప్రభాసే శివుడు అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కానీ ప్రభాస్‌కు శివుడి పాత్రకంటే మరొక పాత్ర చాలా నచ్చడంతో ఆయన మాటను కాదనలేక మరొక పాత్రను ఆయనకు ఇచ్చామని ఒక వీడియోతో క్లారిటీ ఇచ్చాడు విష్ణు. దీంతో అసలు ప్రభాస్ ఏ పాత్ర చేస్తున్నాడు? ఇంతకీ ఇందులో శివుడిగా చేస్తుంది ఎవరు? అనే సందేహాలు మళ్లీ ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. మొత్తానికి ‘కన్నప్ప’లో అక్షయ్ కుమార్.. శివుడు పాత్రలో నటిస్తున్నాడనే వార్త తాజాగా అప్డేట్తో కన్ఫర్మ్ చేశారు మేకర్స్.
శివుడు శక్తివంతుడు
తాజాగా అక్షయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ‘కన్నప్ప’ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘అందరికంటే శివుడు శక్తివంతుడు అయినా కూడా తన భక్తులు చూపించే ప్రేమకు ఆయన దాసోహం’ అని ఆ పోస్టర్లో ఉండడంతో ‘కన్నప్ప’లో అక్షయ్ కుమారే శివుడు అనే విషయంలో ప్రేక్షకులు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఇక ప్రభాస్.. రుద్ర అనే పాత్రలో కనిపించనున్నాడని, మూవీలో తన పాత్ర నిడివి 11 నిమిషాలు ఉంటుందనే సమాచారం బయటికొచ్చింది. ప్రభాస్ ఎంచుకున్న పాత్ర చిన్నదే అయినా అది తనకు చాలా నచ్చడంతో దానికి మరింత నిడివి పెంచామని కొన్నాళ్ల క్రితం విష్ణు స్వయంగా క్లారిటీ ఇచ్చాడు.