EPAPER

Monthly One Lakh Income Post Retirement: రిటైర్మెంట్ తరువాత నెలకు రూ.లక్ష సంపాదన.. ఇలా ప్లాన్ చేసుకోండి సరిపోతుంది..

Monthly One Lakh Income Post Retirement: రిటైర్మెంట్ తరువాత నెలకు రూ.లక్ష సంపాదన.. ఇలా ప్లాన్ చేసుకోండి సరిపోతుంది..

Monthly One Lakh Income Post Retirement: రిటైర్మెంట్ కు మరి కొన్ని సంవత్సరాలు ముందుగానే ఆ తరువాత వచ్చే ఆదాయాన్ని ప్లాన్ చేసుకోవాలి. సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఆ తరువాత జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే రిటైర్మెంట్ తరువాత ఆర్థిక స్థిరత్వం కోసం మీ సంపాదనని ఆలోచించి పెట్టుబడి చేయండి. రోజు రోజుకు పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, వయసు మీరితే వచ్చే ఆరోగ్య సమస్యలకు ఒకటే పరిష్కారం.. వాటిని ఎదుర్కొనేందుకు ప్రతినెలా సరిపడ సంపాదన ఉండేలా ఏర్పాటు చేసుకోవడం.


అందుకే రిటైర్మెంట్ తరువాత ప్రతినెలా రూ.లక్ష వచ్చాలా ఇలా ప్లాన్ చేసుకోండి. రిటైర్మెంట్ కు మరో నాలుగు అయిదు సంవత్సరాలు ఉన్న వారి ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) అకౌంట్ లో రూ.95 లక్షలు ఉంటాయని అంచనా వేస్తే.. మరో నాలుగు, అయిదు సంవత్సరాల సంపాదన, దానిపై 8.25 శాతం వడ్డీ కలిపి పిఎఫ్ అకౌంట్ లో బ్యాలెన్స్ దాదాపు రూ.1.3 కోట్లు లేదా రూ.1.4 కోట్లకు పెరుగుతుంది. రిటైర్మెంట్ సమయంలో వచ్చే గ్రాడ్యుటీ, రిటైర్మెంట్ కార్పస్ ఫండ్ తో కలిపి మీ పిఎఫ్ ఖాతాలో దాదాపు రూ.1.5 కోట్లు బ్యాలెన్స్ ఉంటుంది.

అయితే రిటైర్మెంట్ తీసుకున్న ఒక ఉద్యోగి ఏ సమస్య లేకుండా నెల ఆదాయం రూ.1 లక్ష ఉండాలంటే.. ఒక బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ లో పెట్టుబడులు పెట్టి.. వాటి ద్వారా సిస్టమ్ విత్ డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్యూపి) చేసుకొని నెలకు రూ.లక్ష పొందవచ్చు. ముఖ్యంగా సరైన హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ని ఎంచుకొని పెట్టుబడులు చేయాలి. హైబ్రిడ్ అంటే ఇందులో డెట్, ఈక్విటీ రెండు రకాలు మిక్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఎన్నుకుంటే మంచింది. డెట్ రూపంలో నెల సరి వడ్డీ వస్తుంది… కానీ ఈక్విటీ ఫండ్స్ లో మంచి లాభాలుంటాయి. అయితే ఈక్విటీ ఫండ్స్ లో డబ్బు నష్టపోయే రిస్క్ కూడా ఉంటుంది. అందుకే మార్కెట్ లో మంచి ఎక్స్ పోజుర్ ఉన్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ని ఎంచుకోవడం కీలకం.


Also Read: Fixed Deposit Interest Rate| ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా?.. అత్యధిక వడ్డీ రేటు ఏ బ్యాంకు ఇస్తుందో తెలుసా?

ఈక్విటీ, డెట్ కలగలిసిన మ్యూచువల్ ఫండ్స్ పై సాధారణంగా 8 నుంచి 10 శాతం వార్షిక రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే ఇది కొంచెం ఎక్కువేనని చెప్పాలి. ప్రస్తుతం మార్కెట్ లో బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ని హెడిఎఫ్‌సి, ఐసిఐసిఐ, ఈడెల్‌వైస్ కంపెనీలు అందిస్తున్నాయి.

వీటిలో హెడిఎఫ్‌సి బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ చాలా పాపులర్. పైగా అన్నింటి కంటే హెచ్ డిఎఫ్‌సి బ్రాండ్ పై మార్కెట్ లో నమ్మకం ఉంది. 2018లో ప్రారంభమైన హెడిఎఫ్‌సి బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ కు ఎక్కువ మంది పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ఫండ్ ఈక్విటీ మార్కెట్ పై ఫోకస్ చేసి పటిష్టమైన పోర్ట్ ఫొలియోని అందిస్తోంది.

Related News

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

iPhone Craze: ఐఫోన్ పిచ్చెక్కిస్తోందా? భారతీయుల స్వేచ్ఛ హరీ.. ఎలాగో తెలుసా?

Onion Export Restrictions: ఉల్లి రైతులకు శుభవార్త.. ఎన్నికల దృష్ట్యా ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన కేంద్రం..

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Vande Bharat Metro Train: వందే భారత్ ‘మెట్రో రైల్’ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ మరీ అంత తక్కువా?

Govt Schemes Interest rate up to 8.2%: అత్యధిక వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకాలివే.. పెట్టుబడి పూర్తిగా సురక్షితం..

Big Stories

×