EPAPER

China Schoolboy Vitiligo: టీచర్ చేసిన పనికి.. ఆ విద్యార్థికి వింత చర్మ వ్యాధి, మరీ అలా శిక్షిస్తే ఎలా బాస్?

China Schoolboy Vitiligo: టీచర్ చేసిన పనికి.. ఆ విద్యార్థికి వింత చర్మ వ్యాధి, మరీ అలా శిక్షిస్తే ఎలా బాస్?

China Schoolboy Vitiligo| హోమ్ వర్క్ చేయలేదని స్కూల్ పిల్లాడిని.. టీచర్ గట్టిగా ముఖంపై కొట్టింది. అది కూడా ఒక సారి కాదు మూడు సార్లు గట్టిగా కొట్టింది. మూడు నెలల తరువాత పిల్లాడి ముఖంపై ఇన్‌ఫెక్షన్ సోకి చర్మ వ్యాధి వచ్చింది. ఆ బాలుడి తల్లి ఆస్పత్రి బిల్లులు కట్టలేక స్కూల్ యజమాన్యంపై కేసు పెట్టింది. ఈ ఘటన చైనాలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. సౌత్ చైనా పోస్ట్ వార్తా సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. చైనాలోని యున్నాన్ రాష్ట్రంలో ఈఫు ప్రైమరీ స్కూల్ ఉంది. ఆ ప్రైమరీ స్కూల్ లో ‘లియూ’ అనే 11 ఏళ్ల బాలుడు చదువుకుంటున్నాడు. అయితే రెండు నెలల క్రితం లియూ అనే బాలుడు ఒక రోజు టీచర్ ఇచ్చిన హోమ్ వర్క్ చేయలదు. దీంతో ఆ టీచర్.. పిల్లాడి ముఖంపై మూడు సార్లు గట్టిగా చెంపదెబ్బలు కొట్టింది.

ఈ కారణంగా పిల్లాడి ముఖం వాచిపోయింది. బుగ్గలు ఎర్రగా కందిపోయాయి. అది చూసి పిల్లాడి తల్లి ‘హుఆంగ్’ స్కూల్ యజమాన్యానికి ఫిర్యాదు చేసింది. కానీ .. పిల్లాడు హోమ్ వర్క్ చేయకపోతే.. టీచర్లు శిక్షించడం సహజం కదా అని టీచర్ ను మందలించి వదిలేసింది. కానీ లియూ ముఖంపై ఏదో తెల్లని మచ్చలు కనిపిస్తూ వచ్చాయి. మొదట లియూ తల్లి ఏదోలే నయం అయిపోతుందనుకుంది. కానీ రెండు నెలల తరువాత ఆ సమస్య తీవ్రం కావడంతో పిల్లాడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. ముందు డాక్టర్లు అది సాధారణ అలర్జీ అని కొన్ని మందులు రాసిచ్చారు. కానీ నెల రోజుల తరువాత ముఖంపై ఇంకా పెద్ద పెద్దని మచ్చలు వచ్చాయి.


Also Read: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

దీంతో పిల్లాడి చర్య వ్యాధి నిపుణుడిని చూపించగా.. టెస్టులు చేసి విటిలిగో (బొల్లి) చర్మ వ్యాధి అని నిర్ధారణ చేశారు. బొల్లి వ్యాధి పూర్తిగా ఒక రోగం కాదు. చర్మ కణాల్లో వచ్చే డిజార్డర్. అంటే రక్తంలోని తెల్ల రక్త కణాలు, రోగనిరోధక శక్తి ఆ ప్రాంతంలో ఏదో హానికారక బ్యాక్టిరియా చేరిందని పొరపాటు దాడి చేస్తుంది. వైద్య నిపుణుల ప్రకారం.. తీవ్ర ఒత్తిడి, కాలుష్యం కారణంగా విటిలిగో సమస్య ఎదురవుతుంది.

అయితే విటిలిగో (బొల్లి) కారణంగా ముఖం, చేతులు, కాళ్లు, శరీరంలోని ఇతర భాగాలపై పెద్ద పరిమాణంలో తెల్లని మచ్చలు కలుగుతూ ఉంటాయి. దీని వల్ల మనిషి ప్రాణహాని లేకపోయినా.. సమాజంలో ఇలాంటి వారికి దూరంగా ఉంటారు. వారితో షేక్ హ్యాండ్ ఇచ్చినా, లేక వారి సమీపంగా కూర్చున్నా ఆ రోగం ఇతరులకు వ్యాపిస్తుందనే అపోహ ఉంది. ఇది పూర్తిగా అబద్ధం. విటిలిగో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. కానీ నలుగురూ విటిలిగో సమస్య ఉన్న వారికి దూరంగా ఉండడంతో బాధితులు మానసిక క్షోభకు గురవుతారు. దీని వల్ల వారికి సమస్య ఇంకా తీవ్రమయ్యే ప్రమాదముందని నిపుణులు అభిప్రాయం.

ప్రస్తుతం చైనాలోని లియూ కేసులో పిల్లాడు స్కూల్ లో మానసిక ఒత్తిడి కారణంగా ఈ సమస్య వచ్చి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. పైగా లియు చికిత్స కోసం చాలా ఖర్చు అవుతుందని.. అంత ధనం తన వద్ద లేదని అతని తల్లి హుయాంగ్ ఆవేదన వ్యక్తం చేసింది. లియు చికిత్స కోసం అయ్యే ఖర్చుని స్కూల్ యజమాన్యం, టీచర్ చెల్లించాలని ఆమె కోర్టులో కేసు వేసింది.

 

Related News

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Big Stories

×