EPAPER

Horoscope 9 September 2024: నేటి రాశి ఫలాలు.. అదృష్టమంటే వీళ్లదే.. ఈ రాశి వారికి ఆదాయం పదింతలు!

Horoscope 9 September 2024: నేటి రాశి ఫలాలు.. అదృష్టమంటే వీళ్లదే.. ఈ రాశి వారికి ఆదాయం పదింతలు!

Horoscope 9 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం పన్నెండు రాశులు. ఇందులో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి ఆటంకాలు ఎదురవుతాయి? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయవంతమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో గతం కంటే మెరుగ్గా ఫలితాలు పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో తోటివారి సహాయం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

వృషభం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో చేసిన పనులకు మంచి గుర్తింపు లభిస్తుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాల్లో పదింతలు లాభాలు ఉంటాయి. మొండి బాకీలు వసూలు చేస్తారు. సుబ్రహ్మణ్యస్వామి వారిని ఆరాధించాలి.


మిథునం:
మిథున రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సమస్యలు పరిష్కారమవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.

కర్కాటకం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. సౌభాగ్య సిద్ధి ఉంది. పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులు కలిసివస్తుంది. సమయానికి చేతికి డబ్బు అందుతుంది. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.

సింహం:
సింహ రాశి వారికి మిశ్రమ కాలం. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయానికి ఏమాత్రం లోటు ఉండదు. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్స్ వస్తాయి. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వేంకటేశ్వరుడిని పూజించాలి.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి లాభాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగిన విధంగా ప్రతిఫలం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తోటి వారి సూచనలు ఉపకరిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. శివారాధన శుభప్రదం.

Also Read: తులా రాశిలోకి చంద్రుడు వీరి వైవాహిక జీవితం అద్భుతంగా ఉండబోతుంది

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. సమయాన్ని వృథా చేయకూడదు. సమయస్ఫూర్తితో సమస్యల నుంచి బయటపడతారు. ఓ శుభవార్త వింటారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉండవచ్చు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు రావొచ్చు. శనిధ్యానం శ్లోకం చదివితే శుభప్రదం.

వృశ్చికం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగిపోతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. సమస్యలు తగ్గుముఖం పడుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. విష్ణు నామస్మరణ చేస్తే మంచిది.

ధనుస్సు:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. అదృష్టం వరిస్తుంది. ఆదాయం పదింతలు అవుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఆఫర్ వస్తుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. దైవారాధన మానవద్దు.

మకరం:
మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారుల్లో లాభాలకు కొరత ఉండదు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబసభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆస్తి వివాదం పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. లక్ష్మీఅష్టకాన్ని చదవాలి.

కుంభం:
కుంభ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శారీరక శ్రమ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారులకు ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. కోపాన్ని ప్రదర్శించవద్దు. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విష్ణు నామాన్ని స్మరించాలి.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. శుభవార్త వింటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరగవచ్చు. ఆదాయానికి తగిన విధంగా ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయవద్దు. ఇష్టదైవారాధన శుభప్రదం.

Related News

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Budh Gochar 2024: కన్య రాశిలో బుధుడి సంచారం.. వీరికి అన్నీ శుభవార్తలే

Big Stories

×