EPAPER

Banana Peel Face Pack: ముఖం అందంగా మెరిసిపోవాలా ? ఈ ఫేస్ ప్యాక్ ఒక్క సారి ట్రై చేయండి

Banana Peel Face Pack: ముఖం అందంగా మెరిసిపోవాలా ? ఈ ఫేస్ ప్యాక్ ఒక్క సారి ట్రై చేయండి

Banana Peel Face Pack: చర్మం అందంగా మెరిసిపోవడానికి రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. బయట దొరికే రసాయనాలతో తయారు చేసిన ఉత్పత్తులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అలాంటి వారు చర్మం న్యాచురల్‌గా మెరవడం కోసం ఫేస్ ప్యాక్‌లు వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అరటి పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అరటి పండు ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. దీంతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ లను చర్మంపై అప్లై చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే ముఖంపై గ్లో కనిపిస్తుంది.


అరటి తొక్కను తేనె, ఓట్స్, పెరుగు మొదలైన వాటితో కలిపి అద్భుతమైన ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. అరటిపండు తొక్కలో విటమిన్ ఎ, బి, సి, ఇ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న అరటితొక్కతో హేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటిపండు తొక్కలతో ఫేస్ ప్యాక్స్..


1. అరటిపండు తొక్క, తేనె ఫేస్ ప్యాక్

కావలసినవి:
పండిన అరటిపండు తొక్క-1
తేనె-1 టీస్పూన్

  • అరటిపండు తొక్కను మిక్సీ పట్టి దానికి తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మానికి మాయిశ్చరైజ్ లాగా పని చేస్తుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న మచ్చలను తగ్గిస్తుంది.

2. అరటిపండు తొక్క, పెరుగు ఫేస్ ప్యాక్

కావలసినవి:
అరటిపండు -1
పెరుగు- 2 స్పూన్లు

  • అరటిపండు తొక్కను మిక్సీ పట్టి దానిలో పెరుగు వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం చల్లటి నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మంపై ఉన్న మొటిమలను తగ్గిస్తుంది. అంతే కాకుండా ఈ ఫేస్ తరుచుగా వాడటం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు కూడా తొలగిపోతాయి.

3. అరటి తొక్క, ఓట్స్ ఫేస్ ప్యాక్

కావలసినవి:
పండిన అరటిపండు-1
ఓట్స్- 2 టీస్పూన్లు

  • అరటిపండు తొక్కను మిక్సీ పట్టి దానిలో ఓట్స్‌ వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. అంతే కాకుండా మృత కణాలను తొలగిస్తుంది.

Also Read: పొడవాటి కురుల కోసం ఈ ఆయిల్స్ వాడాల్సిందే !

అరటిపండు తొక్కతో తయారు చేసే ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు..

  • అరటి తొక్కలో ఉండే సహజ నూనెలు మీ చర్మాన్ని తేమగా మారుస్తాయి.
  • ఓట్స్ మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. అంతే కాకుండా మృత కణాలను తొలగిస్తుంది.
  • వీటిలోని విటమిన్లు సి, ఇ వంటి యాంటీ-ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.
  • అరటి తొక్క చర్మానికి తేమను అందిస్తుంది. చికాకును కూడా తగ్గిస్తుంది.
  • ఈ ఫేస్ ప్యాక్ లను రెగ్యులర్‌గా వాడటం వల్ల ముఖంపై మచ్చలు తగ్గిపోతాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Back Pain Relief Tips: నడుము నొప్పిని తగ్గించే టిప్స్ !

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Big Stories

×