నేటి జీవన శైలి కారణంగా చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కుంటున్నారు. అలాంటి వారు కొన్ని రకాల ఆయిల్స్ వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

ఆముదం నూనె: విటమిన్ ఇ, మినరల్స్ ఆముదంలో పుష్కలంగా ఉంటాయి. తరుచుగా జుట్టుకు ఆముదం నూనె అప్లై చేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది.

ఆముదం నూనెను వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారుతుంది.

ఉల్లిపాయ నూనె: జుట్టు పెరుగుదలకు ఈ నూనె ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది. అంతే కాకుండా జుట్టు సంబంధిత సమస్యలను రాకుండా చేస్తుంది.

ముఖ్యంగా ఈ ఆయిల్ ఉపయోగించడం వల్ల  జుట్టు బాగా పెరుగుతుంది.  దీంతో ఒత్తైన జుట్టు మీ  సొంతం అవుతుంది.

టీట్రీ ఆయిల్: చుండ్రు సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడే వారికి ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది.

ఈ ఆయిల్‌ను తరుచుగా తలకు అప్లై చేయడం వల్ల  జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి. అంతే కాకుండా ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది.

కొబ్బరి నూనె: మనలో చాలా మంది జుట్టుకు కొబ్బరి నూనెను ఎక్కువగా వాడుతుంటారు. ఇందులో చాలా రకాల విటమిన్లతో పాటు ఖనిజాలు కూడా ఉంటాయి.

ఈ ఆయిల్ జుట్టు కుదుళ్లను నుంచి బలంగా మారుస్తుంది. అంతే కాకుండా జుట్టును మృదువుగా చేస్తుంది.

ఆలివ్ ఆయిల్: విటమిన్ ఇ, యాంటీఆక్సిండెంట్లు ఆలివ్ ఆయిల్ లో పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కాల్ప్ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.

ఈ నూనెతో ప్రతి రోజు తలకు మసాజ్ చేయడం వల్ల హెయిర్‌కు తగిన పోషణ అందుతుంది.  చుండ్రు కూడా తగ్గుతుంది.