EPAPER

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌కు బేబక్క బైబై.. వెళ్లేటప్పుడు కూడా నిఖిల్, సోనియాపై అవే వ్యాఖ్యలు

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌కు బేబక్క బైబై.. వెళ్లేటప్పుడు కూడా నిఖిల్, సోనియాపై అవే వ్యాఖ్యలు

Bigg Boss 8 Telugu First Elimination: బిగ్ బాస్ సీజన్ 8లో మొదటి ఎలిమినేషన్ ముగిసింది. అసలైతే ఎక్కువగా ఒంటరిగా ఉంటున్నందుకు, తన పర్సనల్ లైఫ్ గురించి ఆలోచిస్తూ ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నందుకు నాగ మణికంఠ ఎలిమినేట్ అయిపోతాడేమో అని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు. అలాగే నాగ మణికంఠ డేంజర్ జోన్‌లో ఉన్నా కూడా కొన్ని ఓట్ల తేడాతో తప్పించుకున్నాడు. ఆ స్థానంలో బేబక్క.. బిగ్ బాస్ హౌజ్‌కు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. హౌజ్‌లో ఉన్నంతకాలం అందరికీ వండిపెడుతూ సరదాగానే ఉండేది. కానీ సోనియా, నిఖిల్‌తో మాత్రం తనకు మనస్పర్థలు ఉన్నాయి. అందుకే వెళ్లేముందు కూడా వారితో సరిగా మాట్లాడలేదు.


అందుకే నామినేట్

ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న అమ్మాయిలు అందరిలో బేబక్కే పెద్ద. అందుకే ముందు నుండి తను కిచెన్ డ్యూటీ తీసుకోవడానికి ఏ మాత్రం వెనకాడలేదు. కానీ మొదటిరోజే తన వల్ల పప్పు మాడిపోయిందని పలువురు కంటెస్టెంట్స్.. తనపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. ముందుగా సోనియా.. ఈ విషయాన్ని పెద్దగా చేసింది. కుక్కర్ పనిచేయడం లేదని గ్రహించక పప్పు మాడిపోయింది అని చెప్పినా వినకుండా బేబక్కపై సీరియస్ అయ్యింది సోనియా. అయినా బేబక్క మాత్రం చాలావరకు సైలెంట్‌గానే ఉంది. చాలామంది ఇదే కారణంగా తనను నామినేట్ చేశారు. అలా బేబక్క నామినేషన్స్‌లోకి వచ్చింది. ఆ తర్వాత చీఫ్ టీమ్‌ను సెలక్ట్ చేసుకునే విషయంలో కూడా తను తీసుకున్న నిర్ణయం తనకు సపోర్ట్ చేయలేకపోయింది.


Also Read: ‘బిగ్ బాస్’ నాగ మణికంఠ పెళ్లి వీడియో వైరల్.. అతడి భార్యపై దారుణమైన ట్రోలింగ్

వారిపై కోపం

నైనికా, యష్మీ, నిఖిల్ టీమ్స్‌లో తాను ఏ టీమ్‌లోకి వెళ్తావని బిగ్ బాస్‌ను అడగగా చాలా ఇష్టంగా నిఖిల్ టీమ్‌ను ఎంచుకుంది బేబక్క. అలాగే కిచెన్ సెక్షన్‌లో నిఖిల్ ఏం చేయమంటే అది చేసింది. కానీ సోనియాతో మనస్పర్థలు వచ్చినప్పుడు నిఖిల్‌కు వచ్చి చెప్పగా తను బేబక్కను సపోర్ట్ చేయలేదు. దీంతో బేబక్క నమ్మకం పూర్తిగా పోయింది. అప్పటినుండి నిఖిల్ గురించి నెగిటివ్‌గా మాట్లాడడం మొదలుపెట్టింది. తను ఒక లీడర్‌గా ఓడిపోయాడని వ్యాఖ్యలు చేసింది. తన టీమ్‌లో ఉండడం ఇష్టం లేదని చెప్పడంతో నాగార్జున కూడా ఆ విషయాన్ని ఒప్పుకున్నారు. వేరే టీమ్‌లోకి వెళ్లేముందు బేబక్క ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయింది. వెళ్లేటప్పుడు కూడా సోనియా, నిఖిల్‌పై కోపంతోనే వెళ్లింది.

రోడ్డు మీద పడాలి

ఎలిమినేట్ అయ్యి వెళ్లేముందు బిగ్ బాస్ హౌజ్ నుండి ఎవరు రోడ్డు మీదకు రావాలి అని నాగార్జున అడగగా.. ముందుగా సోనియా పేరు చెప్పింది బేబక్క. ఆ తర్వాత పృథ్విరాజ్ పేరు చెప్పింది. నామినేషన్స్ సమయంలో తనను ఫిట్‌గా లేడని పృథ్వి అన్న మాటలను గుర్తుచేసుకుంది. నాగ మణికంఠ పేరు కూడా చెప్పి ఆటలో యాక్టివ్‌గా ఉండాలని సలహా ఇచ్చింది. చివరికి నిఖిల్ పేరు కూడా చెప్పింది బేబక్క. మరోసారి తనను మంచి టీమ్ లీడర్ అనుకున్నానని, కానీ అలా జరగలేదని వ్యాఖ్యలు చేసింది. కానీ నిఖిల్ మాత్రం వయసులో చిన్న కాబట్టి ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలేదని, కానీ బేబక్కను హర్ట్ చేయాలని ఏదీ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు. బేబక్క వెళ్లిపోతున్నందుకు అందరికంటే ఎక్కువగా సీత ఎమోషనల్ అయ్యి ఏడ్చేసింది.

Related News

Bigg Boss 8 Telugu: విష్ణుప్రియాతో ప్రేరణ ‘దోశ’ గొడవ.. మణికంఠ తలకు గాయం

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Bigg Boss 11 : కన్నడ బిగ్ బాస్ హోస్ట్ కు ఫ్యూజులు ఔట్ అయ్యే రెమ్యూనరేషన్… ఎన్ని కోట్లంటే?

Shekar Basha: మా ఆవిడ అలా తిట్టింది, వచ్చేవారం కచ్చితంగా ఎలిమినేట్ అయ్యేది తనే.. శేఖర్ భాషా వ్యాఖ్యలు

Bigg Boss 8 Telugu Promo: ‘బిగ్ బాస్’ హౌజ్‌లోకి ప్రభావతి.. కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు, ఆదిత్య ఓం మెడ విరిచేసిన పృథ్వి

Bigg Boss 8: చంద్రముఖిలా మారిన యష్మీ.. ఏడిపించేసిన విష్ణు

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 ఓటింగ్ లో విష్ణు ప్రియా టాప్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే?

Big Stories

×