EPAPER

Anitha: జగన్.. ఇంతకు నువ్వు ఒక్క పులిహోర ప్యాకెటైనా పంపిణీ చేశావా..?: అనిత

Anitha: జగన్.. ఇంతకు నువ్వు ఒక్క పులిహోర ప్యాకెటైనా పంపిణీ చేశావా..?: అనిత

AP Home Minister Anitha Comments on Jagan: మాజీ సీఎం జగన్, వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ఏపీ హోంమంత్రి అనిత.. జగన్ పై మరోసారి ఫైరయ్యారు. ఆదివారం విజయవాడలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. వరద ముంపు ప్రాంతాల్లో తమ ప్రభుత్వం చేస్తున్న సాయంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.


వరద ముంపు బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నామన్నారు. విజయవాడలో ఇంకా పలు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉందన్నారు. ఉదయం అల్పాహారం, మంచినీరు, పాల ప్యాకెట్లను సరఫరా చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

Also Read: తీవ్ర విషాదం.. వాగు-రోడ్డు మధ్య వేలాడుతున్న ఆర్టీసీ బస్సు.. ఆర్తనాదాలు చేస్తున్న ప్రయాణికులు


విజయవాడ ముంపు ప్రాంతాల్లో మొత్తం 170 వాటర్ ట్యాంకులతో మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు హోంమంత్రి వెల్లడించారు. ఆ వాటర్ ట్యాంకులు వందల ట్రిప్పులు తిరుగుతున్నాయన్నారు. బాధితులకు అల్పాహారం, ఆహారం, మంచినీరు, పాల ప్యాకెట్లను సరఫరా చేసినట్లు ఆమె చెప్పారు. ఇప్పటివరకు 27వేలకు పైగా ఇళ్లలో బరుదను అధికారులు తొలగించారన్నారు. డ్రోన్లతో ఆహారం సరఫరాతోపాటు క్లోరినేషన్ చేపట్టామన్నారు. కేవలం డ్రోన్లతోనే లక్షకుపైగా ఆహార పొట్లాలను పంపించామన్నారు.

సీఎం చంద్రబాబు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారన్నారు. కనీసం ఆయన వినాయక చవితి పండుగను కూడా జరుపుకోకుండా శ్రమిస్తున్నారన్నారు. కలెక్టరేట్ లోనే ఉండి సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు మూడు రోజులపాటు బుడమేరు వద్దే కూర్చున్నారు.. నిద్రాహారాలు లేకుండా గండ్లను పూడ్చివేశారంటూ ఆమె పేర్కొన్నారు. అయినా కూడా ప్రతిపక్ష నేతలకు ఇవేమీ కనిపించడంలేదా? అంటూ ఆమె ప్రశ్నించారు.

Also Read: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

ప్రభుత్వం వరద బాధితులను ఆదుకుంటుంటే.. జగన్ మాత్రం పేటీఎం బ్యాచ్ ను దింపి విషప్రచారం చేయిస్తున్నారన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సొంత డబ్బుతో కనీసం ఒక్క పులిహోర ప్యాకెటైనా పంపిణీ చేశారా? అని ప్రశ్నించారు. బెంగళూరులో కూర్చొని పులిహోర కబుర్లు మాత్రం చెబుతున్నారంటూ ఆమె మండిపడింది. ప్రకాశం బ్యారేజీలోకి కొట్టుకొచ్చిన బోట్లపై అనుమానాలున్నాయన్నారు.

అదేవిధంగా ఇటు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా, వినాయక మండపాలకు ఎటువంటి చలాన్లను విధించలేదన్నారు. మండపాలకు డబ్బులు వసూలు చేయాలనే జీవోను గత వైసీపీ ప్రభుత్వమే తీసుకొచ్చిందన్నారు. కానీ, ఈ విషయం తెలియగానే సీఎం చంద్రబాబు మండపాలకు ఒక్క రూపాయి కూడా వసూలు చేయొద్దని చెప్పారంటూ ఆమె పేర్కొన్నారు.

Related News

Mumbai actress case: కాదంబరీ జెత్వానీ కేసులో ఓ ఐఏఎస్.. అప్రూవర్‌గా మారేందుకు ఐపీఎస్ ప్రయత్నాలు..

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

Big Stories

×