EPAPER

Heart Attack: పొద్దున్నే నిద్ర లేవాలని అలారం పెడుతున్నారా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు !

Heart Attack: పొద్దున్నే నిద్ర లేవాలని అలారం పెడుతున్నారా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు !

Heart Attack: చాలామందికి ఉదయాన్నే నిద్రలేవలేకపోతుంటారు. ఇలాంటివారు నిద్రలేవడానికి అలారం వాడుతుంటారు. ఇలా అలారంతో నిద్రలేచేవారు చాలా మందే ఉంటారు. కానీ, తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక గురించి తెలిస్తే బహుషా మీరు మరోసారి అలారం పెట్టుకోకపోవొచ్చు. అవును ఇది నిజమే.. అలారం పెట్టుకుని నిద్రలేస్తే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని ఓ పరిశోధనలో రుజువైంది. అంతే కాకుండా అలారం పెట్టుకుని నిద్రలేచే వారిలో గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆ పరిశోధనలో తేలినట్లు పేర్కొన్నారు.


అయితే, ఎవరికైనా నిద్ర అనేది చాలా ముఖ్యం. నిద్ర సరిగాపోకపోతే ఎన్నో అనారోగ్యాలకు దారి తీస్తుంది. అంతేకాదు.. ఆ రోజంతా కూడా అదోలా ఉంటుంది. చాలామంది ఎక్కువగా నిద్ర పోతుంటారు. ఇంకొంత మంది నిద్ర సమయంలో కూడా అలర్ట్ గా ఉంటారు. మరికొంతమంది ఒకసారి నిద్రపోయారంటే ఎప్పుడు లేస్తారో వారికే తెలియదు. అలాంటివారికి ఏదైనా పని ఉంటే.. అది అంతే సంగతి. అందుకే అలాంటివారు అలారం వాడుతుంటారు. అయితే, అలారం వాడితే నిద్రలేవడమేమో గానీ, పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని తాజా పరిశోధనలో పేర్కొన్నారు. అలారం కారణంగా ముఖ్యంగా గుండె పోటుకు గురవుతారని ఆ పరిశోధనలో తేలినట్లు సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు.

అలారంతో అకస్మాత్తుగా నిద్రలేవడం ద్వారా రక్తపోటు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా హృదయ స్పందన రేటు అకస్మాత్తుగా పెరగడం వల్ల గుండె పోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. ఒకవేళ మీరు తప్పని సరిగా అలారం వాడాలి అనుకుంటే స్నూజ్ వాడటం మంచిదని వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అలారంతో బలవంతంగా ఉదయం పూట నిద్ర మేల్కొనే వ్యక్తులకు రక్తపోటు వచ్చే ప్రమాదం సహజంగా నిద్రలేచే వారితో పోలిస్తే 74 శాతం ఎక్కువగా ఉంటుందని ఆ అధ్యయనం ద్వారా వెల్లడైంది.


Also Read: బార్లీ వాటర్‌తో అనారోగ్య సమస్యలు దూరం !

అంతేకాకుండా ప్రతిరోజూ తగినంత నిద్ర పోనివారిలో బీపీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆ నివేదికలో స్పష్టమైనట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘ఫోన్ అలారం ద్వారా ఆకస్మాత్తుగా నిద్రలేవడం ద్వారా ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. నిద్ర నుంచి మేల్కొనడానికి అలారాలను సెట్ చేయడం వల్ల మీ మానసిక స్థితిపై ఇది ప్రభావాన్ని చూపుతుంది. అలారంతో నిద్ర లేవడం వల్ల చాలా సమయం వరకు చిరాకు, ఒత్తిడితో ఉండే అవకాశాలు ఉంటాయి. అంతే కాకుండా ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది’ అని సూచిస్తున్నారు.

ఒత్తిడి హర్మోన్లు పెరుగుతాయ్..

అలారం ద్వారా అకస్మాత్తుగా నిద్రలేవడం వల్ల కార్టిసాల్, అడ్రినలిన్ అనే ఒత్తిడి హర్మోన్లను విడుదల అవుతాయి. ఇవి మీ భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి. ప్రతి ఒక్కరి మానసిక స్థితికి, స్థిరత్వానికి నిద్ర కీలకమైంది. ఇలా అలారం పెట్టుకుని నిద్ర లేవడం వల్ల చిరాకు, ఒత్తిడి కలుగుతాయి. ఇవి పరోక్షంగా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. జర్నల్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్ నిర్వహించిన మరొక అధ్యయనం ప్రకారం ఒక వేళ నిద్ర లేవడానికి స్నూజ్ ఉపయోగిస్తే కనక దాని బటన్ ఐదు లేదా 10 నిమిషాల లోపు నొక్కితే మంచిదని రుజువైంది.

అలారంలకు ప్రత్యామ్నాయాలు:
1. రోజు అలారం ఉపయోగించడం మానుకోవాలి.
2. ప్రతి రోజు (7-8 ) గంటలు నిద్రపోవాలి.
3. సహజకాంతిని మీరు నిద్రపోయే గదిలోకి వచ్చేలా చూసుకోండి.
4. నిద్రకోసం ప్రతి రోజు ఒక షెడ్యూల్ పెట్టుకోండి.
5. అలారాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి అని అనుకుంటే.. మాత్రం వినడానికి ఆహ్లాదకరమైన , శ్రావ్యమైన రింగ్ టోన్ సెట్ చేసుకోండి.

(గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Back Pain Relief Tips: నడుము నొప్పిని తగ్గించే టిప్స్ !

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Big Stories

×