EPAPER

Khairatabad Ganesh:దారులన్నీ ఖైరతాబాద్ వైపే.. వర్షంలోనూ పోటెత్తిన భక్తజనం

Khairatabad Ganesh:దారులన్నీ ఖైరతాబాద్ వైపే.. వర్షంలోనూ పోటెత్తిన భక్తజనం

– ఆదివారం కావడంతో తరలివచ్చిన భక్తులు
– వర్షం పడుతున్నా అంతకంతకూ పెరిగిన రద్దీ
– రెండోరోజు బడా గణేష్ దగ్గర కోలాహలం


devotees thronged to khairatabad ganesh despite heavy rains: ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రెండోరోజు క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయి కనిపించాయి. ఒకానొక దశలో లైన్ల మధ్య నుంచి కూడా భక్తులను అనుమతించారు. ఆదివారం కావడంతో చిన్నాపెద్దా తేడా లేకుండా మహా గణపతి దర్శనానికి సిటిజన్లు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. మరోవైపు, ఖైరతాబాద్‌లో భారీ వర్షం పడింది. వర్షంలో తడుస్తూనే బడా గణేష్‌ని దర్శించుకున్నారు భక్తులు. భక్తులు తడవకుండా రెండు వైపులా ఉన్న క్యూలైన్ల వరకే షెడ్లు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. మిగతా క్యూలైన్లలో తడుస్తూనే బడా గణేష్‌ను తిలకించారు భక్తులు. నగరం నలువైపుల నుంచి భక్తులు తరలివచ్చారు. మొదటి రోజు 2 లక్షల మంది దాకా దర్శించుకున్నట్టు నిర్వాహకులు చెబుతుండగా, రెండోరోజు అంతకంటే ఎక్కువమంది వచ్చి ఉంటారని తెలిపారు. రద్దీ నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.


Also Read: Khairatabad Ganapathi: ఖైరతాబాద్ గణపతి వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్.. 10 రోజులపాటు ఆల్టర్నేట్ రూట్లు ఇవే

నగరంలో భారీ వర్షం

అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో భారీ వర్షం పడింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మియాపూ, చందానగర్, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, మధురా నగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, బోరంబండ, పంజాగుట్ట, ఖైరతాబాద్, జీడిమెట్ల సహా పలు ప్రాంతాల్లో వర్షం పడింది. కొన్నిచోట్ల ట్రాఫిక్‌తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, ముషీరాబాద్‌లో భారీ వర్షం కురిసింది.

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×