EPAPER

Hair Growth Oils: పొడవాటి కురుల కోసం ఈ ఆయిల్స్ వాడాల్సిందే !

Hair Growth Oils: పొడవాటి కురుల కోసం ఈ ఆయిల్స్ వాడాల్సిందే !

Hair Growth Oils: ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో చిన్నా వయస్సులోనే అనేక మంది జుట్టు సంబంధిత సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారు కొన్ని రకాల సహజ నూనెలను వాడటం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం తగ్గుతుంది. మరి ఏంటా నూనెలు.. వాటిని వాడటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఆముదం నూనె: విటమిన్ ఇ, ప్రోటీన్స్ తో  పాటు మినరల్స్ ఆముదం నూనెలో  పుష్కలంగా ఉంటాయి. తరుచుగా జుట్టుకు ఆముదం నూనె అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా జుట్టు వేగంగా పెరగడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఆముదం నూనెను వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుందని అంతే కాకుండా జుట్టు మృదువుగా మారుతుందని ఓ పరిశోధన ద్వారా రుజువైంది.

ఉల్లిపాయ నూనె: జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ నూనె ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది. అంతే కాకుండా జుట్టు సంబంధిత సమస్యలను రాకుండా చేస్తుంది. ముఖ్యంగా ఈ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. దీంతో ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది.


టీట్రీ ఆయిల్: చుండ్రు సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడే వారికి ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ ఆయిల్ ను తరుచుగా తలకు అప్లై చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి. అంతే కాకుండా ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది.

Also Read: ఈ హెయిర్ మాస్క్‌తో జుట్టు సమస్యలకు చెక్ !

కొబ్బరి నూనె: మనలో చాలా మంది జుట్టుకు కొబ్బరి నూనెను ఎక్కువగా వాడుతుంటారు. ఇందులో చాలా రకాల విటమిన్లతో పాటు ఖనిజాలు కూడా ఉంటాయి. ఈ ఆయిల్ తో జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారుతుంది. అంతే కాకుండా కొబ్బరి నూనె జుట్టును మృదువుగా ఉండేలా చేస్తుంది. అందుకే ఇన్ని ప్రయోజనాలు ఉన్న కొబ్బరి నూనెను జుట్టుకు వాడాలని నిపుణుల చెబుతున్నారు.

ఆలివ్ ఆయిల్: విటమిన్ ఇ, యాంటీఆక్సిండెంట్లు ఆలివ్ ఆయిల్ లో పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కాల్ప్ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ నూనెతో ప్రతి రోజు తలకు మసాజ్ చేయడం వల్ల హెయిర్ కు తగిన పోషణ అందుతుంది. అలాగే చుండ్రు సమస్యతో ఇబ్బందిపడే వారు ఈ నూనెను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×